- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
ఈ కాలపు వచనాలు
- యోహాను 14:2సుమారు క్రీ.శ. 33
నా తండ్రి ఇంట్లో చాలా నివాసస్థలాలు ఉన్నాయి, ఒకవేళ లేకపోతే, మీ కోసం స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్తున్నానని నేను మీతో చెప్పి ఉండేవాడినా?
- యోహాను 14:3సుమారు క్రీ.శ. 33
నేను వెళ్లి మీ కోసం నివాస స్థలాన్ని సిద్ధపరచి, మళ్ళీ వచ్చి నాతో పాటు ఉండడానికి నేను ఉండే స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్తాను.
- యోహాను 14:4సుమారు క్రీ.శ. 33
నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆ స్థలానికి మార్గం మీకు తెలుసు” అన్నారు.
- యోహాను 14:5సుమారు క్రీ.శ. 33
తోమా ఆయనతో, “ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు. అలాంటప్పుడు మాకు ఆ మార్గం ఎలా తెలుస్తుంది?” అన్నాడు.
- యోహాను 14:6సుమారు క్రీ.శ. 33
అందుకు యేసు ఇలా జవాబిచ్చారు, “నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరకు ఎవరు రాలేరు.
- యోహాను 14:7సుమారు క్రీ.శ. 33
మీరు నన్ను నిజంగా తెలుసుకుని ఉంటే, మీకు నా తండ్రి కూడా తెలిసి ఉండేవాడు. ఇప్పటినుండి ఆయన మీకు తెలుసు, మీరు ఆయనను చూశారు” అన్నారు.
- యోహాను 14:8సుమారు క్రీ.శ. 33
అందుకు ఫిలిప్పు, “ప్రభువా, మాకు తండ్రిని చూపించు, మాకది చాలు” అన్నాడు.
- యోహాను 14:9సుమారు క్రీ.శ. 33
యేసు అతనితో, “ఫిలిప్పూ, నేను ఇంతకాలం మీతో ఉన్నా నేను నీకు తెలియదా? నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే. అలాంటప్పుడు ‘తండ్రిని చూపించు’ అని ఎలా అడుగుతున్నావు?
- యోహాను 14:10సుమారు క్రీ.శ. 33
నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నామని నీవు నమ్మడం లేదా? నేను మీతో మాట్లాడే మాటలు నా స్వంత మాటలు కావు, నాలో జీవిస్తూ, తన కార్యాలను చేస్తున్న తండ్రియే మాట్లాడుతున్నాడు.
- యోహాను 14:11సుమారు క్రీ.శ. 33
నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నామని నేను చెప్పితే నన్ను నమ్మండి; లేదా కనీసం దానికి రుజువుగా ఉన్న అద్భుత కార్యాలను చూసి నమ్మండి.
- యోహాను 14:12సుమారు క్రీ.శ. 33
నన్ను నమ్మేవారు నేను చేస్తున్న క్రియలు చేయడమే కాదు, వీటికన్నా గొప్ప వాటిని చేస్తారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను.
- యోహాను 14:13సుమారు క్రీ.శ. 33
మీరు నా పేరిట ఏది అడుగుతారో, తండ్రి కుమారునిలో మహిమ పొందునట్లు నేను దాన్ని చేస్తాను.
- యోహాను 14:14సుమారు క్రీ.శ. 33
మీరు నా పేరిట ఏమి అడిగినా నేను చేస్తాను.
- యోహాను 14:15సుమారు క్రీ.శ. 33
“మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటిస్తారు.
- యోహాను 14:16సుమారు క్రీ.శ. 33
మీతో ఎల్లప్పుడు ఉండేలా మరొక ఆదరణకర్తను మీకు ఇవ్వమని, నేను తండ్రిని అడుగుతాను.
- యోహాను 14:17సుమారు క్రీ.శ. 33
ఆయన సత్యమైన ఆత్మ. ఈ లోకం ఆయనను చూడలేదు తెలుసుకోలేదు, కాబట్టి ఆయనను అంగీకరించదు. కానీ మీకు ఆయన తెలుసు, ఎందుకంటే ఆయన మీలో జీవిస్తున్నాడు మీలో ఉంటాడు.
- యోహాను 14:18సుమారు క్రీ.శ. 33
నేను మీ దగ్గరకు వస్తాను, మిమ్మల్ని అనాధలుగా విడిచిపెట్టను.
- యోహాను 14:19సుమారు క్రీ.శ. 33
కొంత కాలమైన తర్వాత ఈ లోకం ఇక నన్ను చూడదు, కాని మీరు నన్ను చూస్తారు. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు జీవిస్తారు.
- యోహాను 14:20సుమారు క్రీ.శ. 33
నేను నా తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నామని మీరు ఆ రోజు గుర్తిస్తారు.
- యోహాను 14:21సుమారు క్రీ.శ. 33
నా ఆజ్ఞలను పాటించేవారు నన్ను ప్రేమించేవారు. నన్ను ప్రేమించేవారిని నా తండ్రి ప్రేమిస్తాడు, నేను కూడ వారిని ప్రేమించి నన్ను నేను వారికి ప్రత్యక్షం చేసుకుంటాను” అన్నారు.
- యోహాను 14:22సుమారు క్రీ.శ. 33
యూదా ఇస్కరియోతు కాదు, మరొక యూదా యేసుతో, “కానీ ప్రభువా, నీవు ఈ లోకానికి కాకుండా మాకే ఎందుకు కనుపరచుకోవాలని అనుకుంటున్నావు?” అని అడిగాడు.
- యోహాను 14:23సుమారు క్రీ.శ. 33
అందుకు యేసు, “ఎవరైనా నన్ను ప్రేమిస్తే వారు నా బోధను పాటిస్తారు. కాబట్టి నా తండ్రి వానిని ప్రేమిస్తాడు మేము వారి దగ్గరకు వచ్చి వారితో నివాసం చేస్తాము.
- యోహాను 14:24సుమారు క్రీ.శ. 33
నన్ను ప్రేమించనివారు నా బోధలను పాటించరు. మీరు వింటున్న ఈ మాటలు నా సొంతం కాదు; అవి నన్ను పంపిన తండ్రి మాటలు.
- యోహాను 14:25సుమారు క్రీ.శ. 33
“నేను మీ మధ్య ఉన్నప్పుడే ఈ సంగతులను మీతో చెప్పాను.
- యోహాను 14:26సుమారు క్రీ.శ. 33
కానీ నా పేరిట తండ్రి పంపించు ఆదరణకర్తయైన పరిశుద్ధాత్మ, మీకు అన్ని విషయాలను బోధిస్తూ నేను మీకు చెప్పిన వాటినన్నింటిని మీకు జ్ఞాపకం చేస్తాడు.