Sidon
ఇలా కూడా పిలుస్తారు: Zidon
33.5600, 35.3600 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి
Sidon ను ప్రస్తావించే వచనాలు
కనాను సరిహద్దులు సీదోను నుండి గెరారు వైపు గాజా వరకు అలాగే సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిము, లాషా పట్టణాల వరకు విస్తరించాయి.)
“జెబూలూను సముద్రతీరాన నివసిస్తాడు ఓడలకు రేవు అవుతాడు; అతని సరిహద్దు సీదోను వరకు వ్యాపిస్తుంది.
ఆషేరు గోత్రం వారు కూడా అక్కోను సీదోనును అహ్లాబును అక్సీబును హెల్బాను ఆఫెకును రెహోబును వెళ్లగొట్టలేదు.
ఇశ్రాయేలీయులు మరల యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు. వారు బయలు, అష్తారోతు, అరాము, సీదోను, మోయాబు, అమ్మోనీయుల, ఫిలిష్తీయుల దేవుళ్ళను పూజించారు. ఇశ్రాయేలీయులు యెహోవాను విడిచి ఆయనను సేవించడం మానుకున్నారు.
ఆ ప్రజలు సీదోనుకు దూరంగా ఉండడం, ఎవరితో సంబంధం లేకపోవడం చేత వారిని కాపాడే మనుష్యులే లేరు. ఆ పట్టణం బేత్-రెహోబు దగ్గర లోయలో ఉంది. దానీయులు ఆ పట్టణాన్ని పునర్నిర్మించి అక్కడ స్థిరపడ్డారు.
అక్కడినుండి గిలాదు, తహ్తీము హొద్షీ ప్రాంతానికి వచ్చి దానాయాను మీదుగా సీదోనుకు వచ్చారు.
“నీవు లేచి, సీదోనుకు చెందిన సారెపతుకు వెళ్లి, అక్కడ ఉండు. అక్కడ ఆహారం పెట్టాలని ఒక విధవరాలికి ఆదేశించాను.”
సముద్ర తీర వాసులారా, సీదోను వ్యాపారులారా, మౌనంగా ఉండండి, సముద్ర నావికులు మిమ్మల్ని సంపన్నులుగా చేశారు.
సీదోనూ, సముద్రపు కోట సిగ్గుపడండి, సముద్రం ఇలా మాట్లాడింది: “నేను ప్రసవ వేదన పడలేదు, పిల్లలు కనలేదు, కుమారులను పోషించలేదు కుమార్తెలను పెంచలేదు.”
ఆయన ఇలా అన్నారు, “అణచివేతకు గురైన సీదోను కుమార్తె, ఇకపై నీకు సంతోషం ఉండదు. “నీవు లేచి కుప్రకు వెళ్లు, అక్కడ కూడా నీకు విశ్రాంతి దొరకదు.”
తూరు సీదోను రాజులందరూ; సముద్ర తీర ప్రాంతాల రాజులు;
యూదా రాజైన సిద్కియా దగ్గరకు యెరూషలేముకు వచ్చిన రాయబారులతో ఎదోము, మోయాబు, అమ్మోను, తూరు, సీదోను రాజులకు కబురు పంపించు.
ఎందుకంటే ఆ రోజు వచ్చింది, ఫిలిష్తీయులందరినీ నాశనం చేసే రోజు తూరు, సీదోనులకు సహాయం చేసేవారందరిని తొలగించే రోజు తప్పకుండా వస్తుంది. యెహోవా ఫిలిష్తీయులను, కఫ్తోరు తీరాల్లో మిగిలి ఉన్నవారిని నాశనం చేయబోతున్నారు.
తూరూ, సీదోను వారు అర్వాదు వారు నీ తెడ్లు వేసేవారు; నీ మనుష్యుల్లో నిపుణులైనవారు నీ నావికులు.
“మనుష్యకుమారుడా, నీ ముఖాన్ని సీదోను పట్టణం వైపు త్రిప్పుకుని దాని గురించి ప్రవచించి ఇలా చెప్పు:
‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: “ ‘సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని, నీ మధ్య నేను ఘనత పొందుతాను. నేను నీకు శిక్ష విధించి నీలో నా పరిశుద్ధతను కనుపరిచినప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.
“తూరూ, సీదోనూ, ఫిలిష్తియా ప్రాంతాలందరూ, నా మీద మీకున్న వ్యతిరేకత ఏంటి? నేను చేసిన దానికి నాకు ప్రతీకారం చేస్తున్నారా? ఒకవేళ మీరు నాకు ప్రతీకారం చేస్తే, మీరు చేసిన దాన్ని త్వరలోనే, చాలా వేగంగా మీ తల మీదికి రప్పిస్తాను.
అంతేకాక, దాని సరిహద్దును ఆనుకుని ఉన్న హమాతు గురించి, చాలా నిపుణులైన తూరు సీదోను ప్రజల గురించి వచ్చిన యెహోవా వాక్కు.
“కొరజీనూ నీకు శ్రమ! బేత్సయిదా నీకు శ్రమ! ఎందుకంటే మీలో జరిగిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణాల్లో జరిగి ఉంటే, ఆ ప్రజలు చాలా కాలం క్రిందటే గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని పశ్చాత్తాపపడి ఉండేవారు.
అయితే తీర్పు దినాన మీ మీదికి వచ్చే గతికంటే తూరు సీదోను పట్టణాల గతి భరించ గలదిగా ఉంటుంది.
యేసు అక్కడినుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతానికి వెళ్లారు.
ఆయన చేస్తున్న గొప్ప కార్యాల గురించి ప్రజలు విని, చాలామంది యూదయ, యెరూషలేము, ఇదూమయ, యొర్దాను అంతటా తూరు, సీదోను చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి ఆయన దగ్గరకు వచ్చారు.
యేసు అక్కడినుండి లేచి తూరు ప్రాంతానికి వెళ్లారు. ఆయన ఒక ఇంట్లో ప్రవేశించి తాను అక్కడ ఉన్నట్లు ఎవరికి తెలియకూడదని కోరుకున్నారు; కాని, తాను అక్కడ ఉన్నాననే సంగతిని ఆయన రహస్యంగా ఉంచలేకపోయారు.
యేసు తూరు పట్టణ ప్రాంతాన్ని విడిచి సీదోను ద్వారా, గలిలయ సముద్రం దెకపొలి ప్రాంతాలకు వెళ్లారు.
అయితే వారెవరి దగ్గరకు ఏలీయా పంపబడలేదు, సీదోను ప్రాంతంలోని సారెపతు గ్రామంలోని ఒక విధవరాలి దగ్గరికే పంపబడ్డాడు.