Skip to content

Phenicia గురించి బైబిల్ వచనాలు

11 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. కనాను కుమారులు: మొదటి కుమారుడగు సీదోను, హిత్తీయులు,

  2. అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు. (తర్వాత కనాను వంశస్థులు చెదిరిపోయారు

  3. కనాను సరిహద్దులు సీదోను నుండి గెరారు వైపు గాజా వరకు అలాగే సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిము, లాషా పట్టణాల వరకు విస్తరించాయి.)

  4. కాబట్టి ఆ అయిదుగురు మనుష్యులు ప్రయాణిస్తూ లాయిషుకు వచ్చి అక్కడి ప్రజలు సీదోనీయుల్లా సమాధానం భద్రత కలిగి క్షేమంగా జీవించడం చూశారు. ఆ దేశాన్ని ఆక్రమించుకుని వారిని బాధించేవారు ఎవరూ లేరని, వారు వృద్ధి చెందుతున్నారని చూశారు. అంతేకాక వారు సీదోనీయులకు దూరంగా ఉంటూ ఎవరితో సంబంధం లేకుండా ఉండడం చూశారు.

  5. “ఉత్తర ప్రాంత అధిపతులందరు, అలాగే సీదోనీయులందరు అక్కడ ఉన్నారు; వారు తమ శక్తి వల్ల భీభత్సం సృష్టించినప్పటికీ చంపబడినవారితో దిగివెళ్లి అవమానానికి గురయ్యారు. వారు ఖడ్గం చేత చంపబడినవారితో సున్నతి పొందని వారిగా పడి ఉన్నారు, పాతాళానికి దిగివెళ్లే వారితో తమ అవమానాన్ని భరిస్తున్నారు.

  6. ఆయన చేస్తున్న గొప్ప కార్యాల గురించి ప్రజలు విని, చాలామంది యూదయ, యెరూషలేము, ఇదూమయ, యొర్దాను అంతటా తూరు, సీదోను చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి ఆయన దగ్గరకు వచ్చారు.

  7. కాబట్టి సంఘస్థులు వారిని పంపినప్పుడు, వారు ఫేనీకే సమరయ ప్రాంతాల ద్వారా వెళ్తూ, యూదేతరులు ఎలా దేవుని వైపు తిరిగారో చెప్పినప్పుడు విశ్వాసులందరు చాలా ఆనందించారు.

  8. అక్కడ ఫేనీకేకు వెళ్లే ఒక ఓడను చూసి దానిలో ఎక్కి బయలుదేరాము.

  9. కుప్ర కనపడగా దాని దక్షిణ వైపు నుండి సిరియాకు వెళ్లాము. తూరు పట్టణ తీరాన మేమున్న ఓడలోని సరుకులను దించవలసి వచ్చింది.

  10. కాబట్టి మేము అక్కడి శిష్యులను కలిసి వారితో ఏడు రోజులు ఉన్నాము. నీవు యెరూషలేముకు వెళ్లవద్దని ఆత్మ ద్వారా వారు పౌలును బ్రతిమలాడారు.

  11. మరుసటిరోజు మేము సీదోను పట్టణ ప్రాంతంలో దిగాం; యూలి శతాధిపతి పౌలు పట్ల దయ చూపించి, అతడు తన స్నేహితుల దగ్గరకు వెళ్లి తనకు అవసరమైన వాటిని సమకూర్చుకోవడానికి అతన్ని అనుమతించాడు.