కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. జెకర్యా 13:5సుమారు క్రీ.పూ. 487

    ప్రతి ఒక్కరు, ‘నేను ప్రవక్తను కాను. నేను ఒక రైతును; నా చిన్నప్పటి నుండి నన్ను కొన్న వాని దగ్గర పొలంలో పని చేస్తున్నాను’ అంటారు.

  2. జెకర్యా 13:6సుమారు క్రీ.పూ. 487

    ‘నీ చేతులకు గాయాలేంటి?’ అని ఎవరైనా వారిని అడిగితే, ‘ఇవి నేను నా స్నేహితుల ఇంట్లో ఉన్నప్పుడు తగిలిన గాయాలు’ అంటారు.

  3. జెకర్యా 13:7సుమారు క్రీ.పూ. 487

    “ఖడ్గమా, మేలుకో, నా గొర్రెల కాపరి మీద నా సన్నిహితుడి మీద పడు!” అని సైన్యాల యెహోవా అంటున్నారు. “కాపరిని కొడతాను, గొర్రెలు చెదిరిపోతాయి, చిన్నవారి మీద నేను నా చేతిని ఉంచుతాను.”

  4. జెకర్యా 13:8సుమారు క్రీ.పూ. 487

    యెహోవా అంటున్నారు, “దేశమంతటిలో మూడింట రెండు వంతుల ప్రజలు హతమై నశిస్తారు; అయినా దేశంలో మూడవ వంతు ప్రజలు మిగిలి ఉంటారు.

  5. జెకర్యా 13:9సుమారు క్రీ.పూ. 487

    ఈ మూడవ వంతు ప్రజలను నేను అగ్నిలో నుండి వెండిని శుద్ధి చేసినట్లు వారిని శుద్ధి చేస్తాను బంగారాన్ని పరీక్షించినట్లు వారిని పరీక్షిస్తాను. వారు నా పేరట మొరపెడతారు, నేను వారికి జవాబిస్తాను. ‘వారు నా ప్రజలు’ అని నేనంటాను, ‘యెహోవా మా దేవుడు’ అని వారంటారు.”

  6. జెకర్యా 14:1సుమారు క్రీ.పూ. 487

    యెరూషలేమా, యెహోవా దినం రాబోతుంది, అప్పుడు మీ దగ్గర కొల్లగొట్టబడిన ఆస్తులు మీ మధ్యనే పంచుతారు.

  7. జెకర్యా 14:2సుమారు క్రీ.పూ. 487

    యెరూషలేము మీద యుద్ధం చేయడానికి అన్ని దేశాలను నేను సమకూరుస్తాను; వారు పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు, ఇల్లు దోచుకుంటారు, స్త్రీలను అత్యాచారం చేస్తారు. పట్టణ ప్రజల్లో సగం మంది బందీలుగా వెళ్తారు. అయితే మిగిలి ఉన్న ప్రజలు నాశనం కాకుండా పట్టణంలోనే ఉండిపోతారు.

  8. జెకర్యా 14:3సుమారు క్రీ.పూ. 487

    అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలంలో పోరాడే విధంగా ఆ దేశాలతో యుద్ధం చేస్తారు.

  9. జెకర్యా 14:4సుమారు క్రీ.పూ. 487

    ఆ రోజున ఆయన యెరూషలేముకు తూర్పుగా ఉన్న ఒలీవకొండ మీద తన పాదాలు ఉంచగా ఒలీవకొండ తూర్పు నుండి పడమరకు రెండుగా చీలిపోయి, సగం కొండ ఉత్తరదిక్కుకు, మరో సగం కొండ దక్షిణ దిక్కుకు జరిగి మధ్యలో విశాలమైన లోయ ఏర్పడుతుంది.

  10. జెకర్యా 14:5సుమారు క్రీ.పూ. 487

    కొండల మధ్య నేను ఏర్పరచిన ఆ లోయ ఆజేలు వరకు ఉంటుంది కాబట్టి మీరు ఆ కొండలోయ గుండా పారిపోతారు. యూదా రాజైన ఉజ్జియా కాలంలో భూకంపం వచ్చినప్పుడు మీరు పారిపోయినట్లు మీరు పారిపోతారు. అప్పుడు నా దేవుడైన యెహోవా తన పరిశుద్ధులందరితో కలిసి వస్తారు.

  11. జెకర్యా 14:6సుమారు క్రీ.పూ. 487

    ఆ రోజున సూర్యకాంతి ఉండదు, చలి ఉండదు, చీకటి ఉండదు.

  12. జెకర్యా 14:7సుమారు క్రీ.పూ. 487

    అది యెహోవాకు మాత్రమే తెలిసిన ప్రత్యేకమైన రోజు. అది పగలు కాదు, రాత్రి కాదు. సాయంకాలమైనా వెలుగు ఉంటుంది.

  13. జెకర్యా 14:8సుమారు క్రీ.పూ. 487

    ఆ రోజున యెరూషలేములో నుండి జీవజలాలు బయలుదేరి వాటిలో సగం మృత సముద్రానికి తూర్పుగా మరో సగం మధ్యధరా సముద్రానికి పడమరగా ప్రవహిస్తాయి. వేసవికాలంలో చలికాలంలో కూడా ఇలాగే ప్రవహిస్తాయి.

  14. జెకర్యా 14:9సుమారు క్రీ.పూ. 487

    యెహోవా సర్వభూమికి రాజుగా ఉంటారు. ఆ రోజున యెహోవా ఒక్కరే ఉంటారు, ఆయన పేరు ఒక్కటే నిలిచి ఉంటుంది.

  15. జెకర్యా 14:10సుమారు క్రీ.పూ. 487

    యెరూషలేముకు దక్షిణాన ఉన్న గెబా నుండి రిమ్మోను వరకు ఉన్న దేశమంతా అరాబాలా మైదానంలా అవుతుంది. అయితే యెరూషలేము బెన్యామీను ద్వారం నుండి మూల ద్వారం వరకు అనగా మొదటి ద్వారం ఉన్న స్థలం వరకు, హనానేలు గోపురం నుండి రాజ ద్రాక్షగానుగల వరకు వ్యాపించి ఉంటుంది.

  16. జెకర్యా 14:11సుమారు క్రీ.పూ. 487

    మనుష్యులు దానిలో నివసిస్తారు; ఇక ఎన్నడు అది నాశనం కాదు. యెరూషలేము క్షేమంగా ఉంటుంది.

  17. జెకర్యా 14:12సుమారు క్రీ.పూ. 487

    యెరూషలేము మీద యుద్ధం చేసిన దేశాలన్నిటి మీదికి యెహోవా రప్పించే తెగులు ఇలా ఉంటుంది: వారు నిలబడి ఉండగానే వారి శరీరాలు కుళ్ళిపోతాయి, వారి కళ్లు కంటి కుహరాల్లో ఉండి కూడా కుళ్ళిపోతాయి, వారి నాలుకలు వారి నోటిలోనే కుళ్ళిపోతాయి.

  18. జెకర్యా 14:13సుమారు క్రీ.పూ. 487

    ఆ రోజున యెహోవా ప్రజల్లో గొప్ప భయాన్ని పుట్టిస్తారు. వారంతా శత్రువులుగా మారి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు.

  19. జెకర్యా 14:14సుమారు క్రీ.పూ. 487

    యూదా వారు కూడా యెరూషలేము దగ్గర యుద్ధం చేస్తారు. చుట్టూ ఉన్న దేశాల నుండి విస్తారమైన బంగారం, వెండి, వస్త్రాలు, సంపదలు పోగు చేయబడతాయి.

  20. జెకర్యా 14:15సుమారు క్రీ.పూ. 487

    అలాగే వారి గుర్రాలకు, కంచరగాడిదలకు, ఒంటెలకు, గాడిదలకు శిబిరాలలో ఉన్న పశువులన్నిటికి తెగులు సోకుతుంది.

  21. జెకర్యా 14:16సుమారు క్రీ.పూ. 487

    అప్పుడు యెరూషలేముపై దాడి చేసిన దేశాలన్నిటిలో మిగిలి ఉన్నవారంతా రాజైన సైన్యాల యెహోవాను ఆరాధించడానికి గుడారాల పండుగ ఆచరించడానికి ఏటేటా యెరూషలేముకు వస్తారు.

  22. జెకర్యా 14:17సుమారు క్రీ.పూ. 487

    ఒకవేళ భూప్రజల కుటుంబాలలో ఎవరైనా రాజైన సైన్యాల యెహోవాను ఆరాధించడానికి యెరూషలేముకు రాకపోతే, వారికి వాన కురవదు.

  23. జెకర్యా 14:18సుమారు క్రీ.పూ. 487

    ఒకవేళ ఈజిప్టు కుటుంబాలు బయలుదేరి వెళ్లి పాల్గొనకపోతే వారికి వర్షం ఉండదు. గుడారాల పండుగ ఆచరించడానికి రాని దేశాలకు యెహోవా నియమించిన తెగులును ఆయన వారికి సోకేలా చేస్తారు.

  24. జెకర్యా 14:19సుమారు క్రీ.పూ. 487

    ఈజిప్టుకు, గుడారాల పండుగ ఆచరించడానికి వెళ్లని దేశాలకు విధించే శిక్ష ఇదే!

  25. జెకర్యా 14:20సుమారు క్రీ.పూ. 487

    ఆ రోజున గుర్రాలకు కట్టిన గంటల మీద, “యెహోవాకు పవిత్రమైనది” అని వ్రాయబడి ఉంటుంది. యెహోవా మందిరంలో ఉన్న వంట పాత్రలు బలిపీఠం ఎదుట ఉన్న పవిత్ర పాత్రల వలె ఉంటాయి.