కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మలాకీ 2:11సుమారు క్రీ.పూ. 397

    యూదా వారు నమ్మకద్రోహులయ్యారు, ఇశ్రాయేలీయుల మధ్య యెరూషలేములో అసహ్యమైన పనులు జరుగుతున్నాయి. యూదా వారు యెహోవా ప్రేమించే పరిశుద్ధాలయాన్ని అపవిత్రపరచి ఇతర దేవతలను పూజించేవారి స్త్రీలను పెండ్లి చేసుకున్నారు.

  2. మలాకీ 2:12సుమారు క్రీ.పూ. 397

    ఇలా చేసినవారు ఎవరైనా సరే యాకోబు వంశీయుల డేరాలలో లేకుండా సైన్యాలకు అధిపతియైన యెహోవాకు నైవేద్యాలు అర్పించేవారి సహవాసంలో లేకుండా యెహోవా నిర్మూలించు గాక!

  3. మలాకీ 2:13సుమారు క్రీ.పూ. 397

    మీరు మరొకసారి అలాగే చేస్తున్నారు: మీ కన్నీళ్లతో యెహోవా బలిపీఠాన్ని తడుపుతున్నారు. ఆయన మీ నైవేద్యాలను ఇష్టపడరు వాటిని మీ నుండి సంతోషంతో స్వీకరించరు కాబట్టి మీరు ఏడుస్తూ రోదిస్తారు.

  4. మలాకీ 2:14సుమారు క్రీ.పూ. 397

    “ఎందుకు?” అని మీరడుగుతారు. ఎందుకంటే నీకు నీ యవ్వనకాలంలో నీవు పెండ్లాడిన భార్యకు మధ్య యెహోవా సాక్షిగా ఉన్నారు. ఆమె నీ భాగస్వామి, నీ చేసిన వివాహ నిబంధన వలన నీ భార్య అయినప్పటికీ నీవు ఆమెకు ద్రోహం చేశావు.

  5. మలాకీ 2:15సుమారు క్రీ.పూ. 397

    ఆయన మీ ఇద్దరిని ఒకటి చేయలేదా? శరీరం, ఆత్మ రెండూ ఆయనకే చెందుతాయి గదా! అలా ఒకటిగా చేయడం ఎందుకు? దేవుని మూలంగా వారికి సంతానం కలగాలని కదా! అందుచేత మీ హృదయాన్ని మీరు కాపాడుకోండి, యవ్వనంలో పెండ్లాడిన మీ భార్యకు ద్రోహం చేయకండి.

  6. మలాకీ 2:16సుమారు క్రీ.పూ. 397

    “పెళ్ళి బంధాన్ని తెంచడం నాకు అసహ్యం అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అంటున్నారు. మనిషి వస్త్రంలా దౌర్జన్యాన్ని కప్పుకోవడం కూడా నాకు అసహ్యం” అని సైన్యాలకు అధిపతియైన యెహోవా అంటున్నారు. కాబట్టి మీ హృదయాలను కాపాడుకోండి, ద్రోహం తలపెట్టకండి.

  7. మలాకీ 2:17సుమారు క్రీ.పూ. 397

    మీరు మీ మాటచేత యెహోవాకు విసుగు పుట్టిస్తున్నారు. “ఆయనకు విసుగు ఎలా కలిగించాం?” అని మీరు అడుగుతున్నారు. “చెడు చేసేవారంతా యెహోవా దృష్టికి మంచి వారు, అలాంటి వారంటే ఆయనకు ఇష్టమే, లేకపోతే న్యాయం జరిగించే దేవుడు ఏమయ్యాడు?” అని అడుగుతూ ఆయనకు విసుగు పుట్టిస్తున్నారు.

  8. మలాకీ 3:1సుమారు క్రీ.పూ. 397

    సైన్యాలకు యెహోవా చెప్పేదేమంటే, “నేను నా దూతను పంపుతాను, అతడు నా ముందర మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఆ తర్వాత మీరు వెదుకుతున్న ప్రభువు అంటే మీరు కోరే నిబంధన దూత తన ఆలయానికి హఠాత్తుగా వస్తాడు.”

  9. మలాకీ 3:2సుమారు క్రీ.పూ. 397

    అయితే ఆయన రాకడ దినం ఎవరు తట్టుకోగలరు? ఆయన కనబడేటప్పుడు ఎవరు నిలబడి ఉండగలరు? ఆయన కంసాలి నిప్పులాంటి వాడు, బట్టలను శుద్ధి చేసే చాకలివాని సబ్బు లాంటివాడు.

  10. మలాకీ 3:3సుమారు క్రీ.పూ. 397

    ఆయన వెండిని పరీక్షించి, పుటం పెట్టి శుద్ధి చేసే కంసాలిలా కూర్చుంటారు, వెండి బంగారాలను పుటం పెట్టే విధంగా ఆయన లేవీ వారిని శుద్ధి చేస్తారు. అప్పుడు వారు నీతి నిజాయితీ అనుసరించి యెహోవాకు నైవేద్యాలు అర్పిస్తారు.

  11. మలాకీ 3:4సుమారు క్రీ.పూ. 397

    గతించిన రోజుల్లో, పూర్వకాలంలో ఉన్నట్లు యూదా వారు యెరూషలేము నివాసులు చేసే అర్పణలు యెహోవాకు అంగీకారమవుతాయి.

  12. మలాకీ 3:5సుమారు క్రీ.పూ. 397

    “తీర్పు తీర్చడానికి నేను మీ దగ్గరికి వస్తాను, మాంత్రికుల మీద, వ్యభిచారుల మీద, అప్రమాణికుల మీద సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. నాకు భయపడక జీతాల విషయంలో కూలివారిని మోసం ఉద్యోగులను మోసం చేసేవారికి, విధవరాండ్రను అనాధలను అణచివేసే వారికి, మీ మధ్య నివసిస్తున్న విదేశీయులకు న్యాయం జరుగకుండ చేసేవారికి వ్యతిరేకంగా నేను మాట్లాడతాను” అని సైన్యాల యెహోవా అంటున్నారు.

  13. మలాకీ 3:6సుమారు క్రీ.పూ. 397

    “నేను యెహోవాను, నేను మార్పు చెందను. కాబట్టే యాకోబు సంతతివారలారా, మీరు నాశనం కాలేదు.

  14. మలాకీ 3:7సుమారు క్రీ.పూ. 397

    మీ పూర్వికుల కాలం నుండి మీరు నా శాసనాల విషయంలో త్రోవ తప్పి వాటిని పాటించలేదు. నా వైపుకు తిరగండి, అప్పుడు నేను మీవైపుకు తిరుగుతాను” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు. “కాని మీరు, ‘మేము ఏ విషయంలో తిరగాలి?’ అని అడుగుతారు.

  15. మలాకీ 3:8సుమారు క్రీ.పూ. 397

    “మానవులు దేవున్ని దోచుకుంటారా? కాని మీరు నన్ను దోచుకుంటున్నారు. “అయినా మీరు, ‘మేము మిమ్మల్ని ఎలా దోచుకుంటున్నాము?’ అని అడుగుతారు. “పదవ భాగాన్ని కానుకలను ఇవ్వక దోచుకుంటున్నారు.

  16. మలాకీ 3:9సుమారు క్రీ.పూ. 397

    ఈ ప్రజలంతా నా దగ్గర దొంగతనం చేస్తున్నారు కాబట్టి శాపగ్రస్థులయ్యారు.

  17. మలాకీ 3:10సుమారు క్రీ.పూ. 397

    నా మందిరంలో ఆహారం ఉండేలా పదవ భాగాన్నంతా నా ఆలయానికి తీసుకురండి. ఇలా చేసి నన్ను పరీక్షించండి, నేను పరలోక ద్వారాలను తెరచి పట్టలేనంతగా దీవెనలు కుమ్మరిస్తానో లేదో చూడండి అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.

  18. మలాకీ 3:11సుమారు క్రీ.పూ. 397

    మీ పైరును పురుగులు తినివేయకుండా చేస్తాను, అవి మీ పొలం పంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్ల పండ్లు అకాలంలో రాలవు” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.

  19. మలాకీ 3:12సుమారు క్రీ.పూ. 397

    “అప్పుడు మీ దేశం ఆనందంగా ఉంటుంది కాబట్టి అన్ని దేశాల ప్రజలు మిమ్మల్ని ధన్యులంటారు” అని సైన్యాలకు యెహోవా ప్రకటిస్తున్నాడు.

  20. మలాకీ 3:13సుమారు క్రీ.పూ. 397

    యెహోవా చెప్పేదేమంటే, “నాకు వ్యతిరేకంగా మీరు చాలా గర్వించి మాట్లాడారు.” “అయినా మేము నీకు వ్యతిరేకంగా ఏం మాట్లాడాము?” అని మీరు అడుగుతున్నారు.

  21. మలాకీ 3:14సుమారు క్రీ.పూ. 397

    “మీరు ఇలా అంటారు, ‘దేవునికి సేవ చేయడం వ్యర్థం, ఆయన ఆజ్ఞ ప్రకారం ప్రవర్తిస్తూ సైన్యాలకు అధిపతియైన యెహోవా ఎదుట దుఃఖా క్రాంతులై తిరుగుతూ ఉండి ప్రయోజనం ఏంటి?

  22. మలాకీ 3:15సుమారు క్రీ.పూ. 397

    ఇప్పుడు గర్విష్ఠులనే ధన్యులని పిలుస్తున్నాము. చెడు చేసేవారు వర్ధిల్లుతూ ఉన్నారు, వారు దేవున్ని పరీక్షించినప్పుడు కూడా వారికి ఏ హాని కలగడం లేదు.’ ”

  23. మలాకీ 3:16సుమారు క్రీ.పూ. 397

    అప్పుడు, యెహోవా పట్ల భయభక్తులు కలిగినవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు యెహోవా విన్నారు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయన పేరును గౌరవించే వారి విషయం ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థమైన గ్రంథంలో వ్రాయబడింది.

  24. మలాకీ 3:17సుమారు క్రీ.పూ. 397

    “నేను నియమించిన ఆ రోజున వారు నాకు విలువైన స్వాస్థ్యంగా ఉంటారు. తండ్రి తనను సేవించే తన కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరిస్తాను” అని అంటూ సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు.

  25. మలాకీ 3:18సుమారు క్రీ.పూ. 397

    అప్పుడు నీతిమంతులకు, దుర్మార్గులకు, దేవున్ని సేవించేవారికి, సేవించని వారికి మధ్య వ్యత్యాసాన్ని మీరు మళ్ళీ చూస్తారు.