కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. జెకర్యా 14:21సుమారు క్రీ.పూ. 487

    యెరూషలేములో, యూదాలో ఉన్న ప్రతి పాత్ర సైన్యాల యెహోవాకు ప్రతిష్ఠించబడతాయి, బలి అర్పించడానికి వచ్చే వారంతా ఆ పాత్రల్లో కావలసిన వాటిని తీసుకుని వాటిలో వంట చేసుకుంటారు. ఆ రోజు ఏ కనానీయుడు సైన్యాల యెహోవా మందిరంలో ఉండడు.

  2. మలాకీ 1:1సుమారు క్రీ.పూ. 397

    ఇది ఇశ్రాయేలు ప్రజలకు మలాకీ ద్వారా ఇవ్వబడిన యెహోవా ప్రవచన వాక్కు.

  3. మలాకీ 1:2సుమారు క్రీ.పూ. 397

    యెహోవా ఇలా అంటున్నారు, “నేను మిమ్మల్ని ప్రేమించాను.” “కాని మీరు, ‘నీవెలా మమ్మల్ని ప్రేమించావు?’ అని అడుగుతున్నారు. “ఏశావు యాకోబుకు అన్న కాడా? అయినా నేను యాకోబును ప్రేమించాను.

  4. మలాకీ 1:3సుమారు క్రీ.పూ. 397

    ఏశావును ద్వేషించాను; నేను అతని కొండలను పాడు చేశాను. అతడు వారసత్వంగా పొందిన ప్రదేశాన్ని అడవి నక్కల పాలు చేశాను” అని యెహోవా అంటున్నారు.

  5. మలాకీ 1:4సుమారు క్రీ.పూ. 397

    ఎదోము వారు, “మేము నలుగగొట్టబడ్డాము, అయినాసరే మేము ఆ శిథిలాలనే తిరిగి కట్టుకుంటాము” అని అంటారేమో! కాని సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: “వారు మళ్ళీ కట్టుకున్నా, నేను కూల్చివేస్తాను. వారిది దుర్మార్గుల దేశమని, ఎప్పటికీ యెహోవా ఉగ్రతకు గురయ్యే ప్రజలని పిలువబడతారు.

  6. మలాకీ 1:5సుమారు క్రీ.పూ. 397

    మీరు అది కళ్లారా చూసి, ‘ఇశ్రాయేలు సరిహద్దు అవతల కూడా యెహోవా గొప్పవాడు!’ అని అంటారు.

  7. మలాకీ 1:6సుమారు క్రీ.పూ. 397

    “కుమారుడు తన తండ్రిని గౌరవిస్తాడు, దాసుడు తన యజమానిని గౌరవిస్తాడు, కానీ ఒకవేళ నేను మీ తండ్రినైతే, మరి నా గౌరవం ఏది? నేను యజమానినైతే, నాకెందుకు భయపడరు?” అని సైన్యాల యెహోవా అంటున్నారు. “యాజకులైన మీరు నా నామాన్ని అవమానిస్తున్నారు. “అయినా మీరు, ‘మేము మీ నామాన్ని ఎలా అవమానిస్తున్నాము?’ అని అంటారు.

  8. మలాకీ 1:7సుమారు క్రీ.పూ. 397

    “మీరు నా బలిపీఠం మీద అపవిత్రమైన ఆహారం అర్పిస్తూ, “అయినా మీరు, ‘మేము మిమ్మల్ని ఎలా అపవిత్రపరచాము?’ అని అడుగుతారు. “యెహోవా బల్లను ప్రాముఖ్యత లేనిదిగా చూడడం వల్లనే.

  9. మలాకీ 1:8సుమారు క్రీ.పూ. 397

    మీరు గ్రుడ్డి జంతువులను తెచ్చి బలి అర్పిస్తే తప్పు కాదా? కుంటి దానిని, జబ్బుతో ఉన్న జంతువులను తెచ్చి బలి అర్పిస్తే తప్పు కాదా? అలాంటి వాటిని మీ అధికారికి ఇచ్చి చూడండి! అలాంటివి ఇస్తే స్వీకరిస్తాడా? అతడు నిన్ను అంగీకరిస్తాడా?” అని సైన్యాల యెహోవా అంటున్నారు.

  10. మలాకీ 1:9సుమారు క్రీ.పూ. 397

    “కానీ ఇప్పుడేమో మాపై దయచూపమని దేవుని వేడుకొంటున్నారు. మీ చేతులతో అలాంటి అర్పణలను ఇస్తే ఆయన స్వీకరిస్తాడా?” అని సైన్యాల యెహోవా అంటున్నారు.

  11. మలాకీ 1:10సుమారు క్రీ.పూ. 397

    “మీరు నా బలిపీఠం మీద వృధాగా మంటలు వేయకుండా మీలో ఎవరైనా గుడి తలుపులు మూసివేస్తే ఎంత బాగుంటుంది! నేను మీ పట్ల సంతోషంగా లేను. నేను మీ చేతుల నుండి ఏ అర్పణను స్వీకరించను అని సైన్యాల యెహోవా అంటున్నారు.

  12. మలాకీ 1:11సుమారు క్రీ.పూ. 397

    తూర్పుదిక్కు నుండి పడమటిదిక్కు వరకు ఇతర దేశాల మధ్య నా నామం ఘనపరచబడుతుంది. ప్రతిచోటా ధూపద్రవ్యాలు, పవిత్రమైన అర్పణలు వారు నాకు తెస్తారు. నా పేరు ఇతర దేశాల్లో గొప్పగా ఉంటుంది” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.

  13. మలాకీ 1:12సుమారు క్రీ.పూ. 397

    “కానీ మీరు, ‘యెహోవా బల్ల అపవిత్రం అయింది, దాని ఆహారం నీచమైనది’ అంటూ నా నామాన్ని అవమానపరుస్తున్నారు.

  14. మలాకీ 1:13సుమారు క్రీ.పూ. 397

    పైగా, ‘ఎంత భారంగా ఉంది!’ అంటూ ఆ బల్లను తిరస్కరిస్తున్నారు” అని సైన్యాల యెహోవా అంటున్నారు. “మీరు గాయపడిన దాన్ని కుంటి దాన్ని, జబ్బుపడిన జంతువులను తీసుకువచ్చి బలి అర్పించినప్పుడు నేను మీ చేతుల నుండి వాటిని స్వీకరించాలా?” అని యెహోవా అంటున్నారు.

  15. మలాకీ 1:14సుమారు క్రీ.పూ. 397

    “తన మందలో అంగీకారయోగ్యమైన మగ జంతువు ఉండి, దానిని బలి ఇస్తానని మ్రొక్కుబడి చేసి దోషం ఉన్న జంతువును బలి అర్పించే మోసగాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే నేను గొప్ప రాజును, దేశాలకు నేనంటే భయం” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.

  16. మలాకీ 2:1సుమారు క్రీ.పూ. 397

    “యాజకులారా, ఈ ఆజ్ఞ మీ కోసమే!

  17. మలాకీ 2:2సుమారు క్రీ.పూ. 397

    మీరు నా మాట వినకుండా నా పేరును మనసారా గౌరవించడానికి నిశ్చయించుకోకపోతే, నేను మీ మీదికి శాపం రప్పిస్తాను. మీరు పొందుకున్న దీవెనలను కూడా నేను శాపాలుగా మారుస్తాను. నిజానికి, మీరు నా హెచ్చరికను గుర్తు ఉంచుకోలేదు కాబట్టి నేను ఇప్పటికే వాటిని శాపాలుగా మార్చాను” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.

  18. మలాకీ 2:3సుమారు క్రీ.పూ. 397

    “నేను మీ కారణంగా మీ సంతానాన్ని గద్దిస్తాను; మీ పండుగల్లో మీరు అర్పించే పశువుల పేడ మీ ముఖాల మీద వేస్తాను. దానితో పాటు మీరు కూడా ఊడ్చివేయబడతారు.

  19. మలాకీ 2:4సుమారు క్రీ.పూ. 397

    నేను లేవీయులకు చేసిన ఒడంబడిక ఉండిపోయేలా నేనే మీకు ఈ ఆజ్ఞ ఇచ్చానని మీరు తెలుసుకుంటారు” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.

  20. మలాకీ 2:5సుమారు క్రీ.పూ. 397

    నేను లేవీయులతో చేసిన నిబంధన జీవానికి సమాధానానికి సంబంధించింది. వారు నా పట్ల భయభక్తులు చూపాలని అవి వారికి ఇచ్చాను. అప్పుడు వారు నన్ను గౌరవించి నా పేరు పట్ల భయభక్తులు కలిగివుంటారు.

  21. మలాకీ 2:6సుమారు క్రీ.పూ. 397

    సత్యమైన ఉపదేశం వారి నోటి నుండి వెలువడిందే తప్ప దుర్బోధ ఏమాత్రం కాదు. వారు సమాధానంతో నిజాయితీ కలిగి నా సహవాసంలో నడిచారు. వారు అనేకులను పాపం విడిచిపెట్టేలా చేశారు.

  22. మలాకీ 2:7సుమారు క్రీ.పూ. 397

    “యాజకులు సైన్యాలకు అధిపతియైన యెహోవా దూతలు. ఎందుకంటే మనుష్యులు వారి నోట ధర్మశాస్త్రం విని నేర్చుకుంటారు. కాబట్టి వారు జ్ఞానాన్ని కలిగి బోధించాలి.

  23. మలాకీ 2:8సుమారు క్రీ.పూ. 397

    మీరైతే దారి తప్పారు, మీ ఉపదేశం వల్ల అనేకులు తడబడ్డారు, నేను లేవీయులతో చేసిన ఒడంబడికను వమ్ము చేశారు” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.

  24. మలాకీ 2:9సుమారు క్రీ.పూ. 397

    “నా మార్గాలను అనుసరించక, ధర్మశాస్త్ర విషయాల్లో పక్షపాతం చూపుతూ వచ్చారు, కాబట్టి ప్రజలందరి కళ్లెదుటే మిమ్మల్ని అణచివేసి తృణీకారానికి గురిచేస్తాను” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.

  25. మలాకీ 2:10సుమారు క్రీ.పూ. 397

    మనకందరికి తండ్రి ఒక్కడు కాదా? ఒక్క దేవుడే మనల్ని సృజించలేదా? అలాంటప్పుడు ఒకరిపట్ల ఒకరం నమ్మకద్రోహం చేస్తూ దేవుడు మన పూర్వికులతో చేసిన నిబంధనను ఎందుకు అపవిత్రం చేస్తున్నాము?