- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- జెకర్యా 11:11సుమారు క్రీ.పూ. 487
ఆ రోజు ఆ నిబంధన రద్దయింది కాబట్టి నేను చెప్పింది యెహోవా వాక్కు అని మందలోని అణచివేతకు గురై నా వైపు చూస్తున్నవారు తెలుసుకున్నారు.
- జెకర్యా 11:12సుమారు క్రీ.పూ. 487
నేను వారితో, “మీకు మంచిదనిపిస్తే నా జీతం ఇవ్వండి; లేదంటే మానేయండి” అన్నాను. కాబట్టి వారు నాకు ముప్పై వెండి నాణేలు చెల్లించారు.
- జెకర్యా 11:13సుమారు క్రీ.పూ. 487
అప్పుడు వారు నాకు చెల్లించిన దానిని కుమ్మరి దగ్గర పారవేయమని యెహోవా నాకు ఆజ్ఞాపించారు కాబట్టి నేను ఆ ముప్పై వెండి నాణేలు తీసుకుని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేశాను.
- జెకర్యా 11:14సుమారు క్రీ.పూ. 487
తర్వాత యూదా వారికి, ఇశ్రాయేలు వారికి మధ్య ఉన్న సహోదర బంధాన్ని తెంచడానికి బంధమనే నా రెండవ కర్రను విరిచాను.
- జెకర్యా 11:15సుమారు క్రీ.పూ. 487
అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు, “బుద్ధిలేని గొర్రెల కాపరి సామాగ్రిని మరల తీసుకో.
- జెకర్యా 11:16సుమారు క్రీ.పూ. 487
ఎందుకంటే ఈ దేశంలో నేను నియమించబోయే కాపరి తప్పిపోయిన వాటిని పట్టించుకోడు, పిల్లలను వెదకడు, గాయపడ్డ వాటిని బాగు చేయడు, ఆరోగ్యకరమైన వాటిని పోషించడు, కాని క్రొవ్విన వాటి డెక్కలు చీల్చి వాటి మాంసాన్ని తింటాడు.
- జెకర్యా 11:17సుమారు క్రీ.పూ. 487
“మందను విడిచిపెట్టిన పనికిమాలిన కాపరికి శ్రమ! ఖడ్గం అతని చేయి, కుడికన్నును నరుకుతుంది గాక! అతని చేయి పూర్తిగా ఎండిపోవాలి, అతని కుడికన్ను పూర్తిగా గ్రుడ్డిదవ్వాలి.”
- జెకర్యా 12:1సుమారు క్రీ.పూ. 487
ఇది ప్రవచనం: ఇశ్రాయేలు ప్రజల గురించి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశాలను విశాలపరచి, భూమికి పునాది వేసి, ఒక వ్యక్తిలో మానవ ఆత్మను సృష్టించిన యెహోవా చెప్తున్న మాట:
- జెకర్యా 12:2సుమారు క్రీ.పూ. 487
“నేను యెరూషలేమును చుట్టూ ఉన్న ప్రజలందరికి మత్తెక్కించే పాత్రగా చేయబోతున్నాను. యూదా యెరూషలేము ముట్టడి చేయబడతాయి.
- జెకర్యా 12:3సుమారు క్రీ.పూ. 487
భూమిపై ఉన్న దేశాలన్నీ దానికి వ్యతిరేకంగా సమకూడినప్పుడు, ఆ రోజున నేను యెరూషలేమును అన్ని దేశాలకు బరువైన బండగా చేస్తాను. దాన్ని తొలగించడానికి ప్రయత్నించే వారందరూ తమను తాము గాయపరచుకుంటారు.
- జెకర్యా 12:4సుమారు క్రీ.పూ. 487
ఆ రోజున నేను ప్రతి గుర్రానికి భయాన్ని, దాని రౌతుకు వెర్రిని పుట్టిస్తాను” అని యెహోవా చెప్తున్నారు. “నేను యూదాపై నా దృష్టి ఉంచి ఇతర ప్రజల గుర్రాలన్నిటికి గుడ్డితనం కలిగిస్తాను.
- జెకర్యా 12:5సుమారు క్రీ.పూ. 487
అప్పుడు యూదా నాయకులు తమ హృదయాల్లో, ‘యెరూషలేము ప్రజలకు వారి దేవుడైన సైన్యాల యెహోవా తోడుగా ఉన్నందుకు వారు బలంగా ఉన్నారు’ అనుకుంటారు.
- జెకర్యా 12:6సుమారు క్రీ.పూ. 487
“ఆ రోజున నేను యూదా నాయకులను కట్టెల క్రింద నిప్పులా పనల క్రింద దివిటీలా చేస్తాను. వారు నాలుగు వైపుల ఉన్న ప్రజలందరినీ కాల్చివేస్తారు, కాని యెరూషలేము దాని స్థానంలో చెక్కుచెదరకుండా ఉంటుంది.
- జెకర్యా 12:7సుమారు క్రీ.పూ. 487
“దావీదు వంశీయులకు యెరూషలేము నివాసులకు ఉన్న ఘనత యూదా వారికంటే గొప్పది కాకుండా యెహోవా మొట్టమొదట యూదా వారి నివాస స్థలాలను రక్షిస్తారు.
- జెకర్యా 12:8సుమారు క్రీ.పూ. 487
ఆ రోజున, యెహోవా యెరూషలేములో నివసించేవారిని కాపాడతారు, అప్పుడు వారిలో బలహీనులు దావీదులా, దావీదు వంశీయులు దేవుని వంటివారిగా, వారి ముందు నడిచే యెహోవా దూతలా ఉంటారు.
- జెకర్యా 12:9సుమారు క్రీ.పూ. 487
ఆ రోజున యెరూషలేముపై దాడి చేసే దేశాలన్నిటిని నాశనం చేయడానికి నేను బయలుదేరుతాను.
- జెకర్యా 12:10సుమారు క్రీ.పూ. 487
“అప్పుడు దావీదు వంశీయుల మీద యెరూషలేము నివాసుల మీద కనికరంగల ఆత్మను విన్నపం చేసే ఆత్మను కుమ్మరిస్తాను. వారు తాము పొడిచిన నన్ను చూసి, ఒకరు తన ఒక్కగానొక్క బిడ్డ కోసం విలపించినట్లు, తన మొదటి కుమారుని కోసం దుఃఖపడునట్లు, ఆయన విషయంలో దుఃఖిస్తూ విలపిస్తారు.
- జెకర్యా 12:11సుమారు క్రీ.పూ. 487
ఆ రోజు, మెగిద్దో మైదానంలో హదద్-రిమ్మోనులో జరిగిన రోదన కంటే యెరూషలేములోని రోదన అధికంగా ఉంటుంది.
- జెకర్యా 12:12సుమారు క్రీ.పూ. 487
దేశ ప్రజలంతా ఏ వంశానికి ఆ వంశంగా తమ భార్యలతో పాటు రోదిస్తాయి: దావీదు రాజవంశీయులు వారి భార్యలు, నాతాను వంశీయులు వారి భార్యలు,
- జెకర్యా 12:13సుమారు క్రీ.పూ. 487
లేవీ వంశీయులు వారి భార్యలు, షిమీ వంశీయులు వారి భార్యలు,
- జెకర్యా 12:14సుమారు క్రీ.పూ. 487
మిగిలిన వంశీయులు వారి భార్యలు అందరు ఎవరికి వారు రోదిస్తారు.
- జెకర్యా 13:1సుమారు క్రీ.పూ. 487
“ఆ రోజున పాపాన్ని అపవిత్రతను శుభ్రం చేసుకోవడానికి దావీదు వంశీయులకు, యెరూషలేము నివాసులకు ఒక నీటి ఊట తెరవబడుతుంది.
- జెకర్యా 13:2సుమారు క్రీ.పూ. 487
“ఆ రోజున విగ్రహాల పేర్లు ఎప్పటికీ జ్ఞాపకం రాకుండా దేశంలోని నుండి నేను వాటిని నిర్మూలిస్తాను. ప్రవక్తలను అపవిత్ర ఆత్మను దేశంలో లేకుండా చేస్తాను” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.
- జెకర్యా 13:3సుమారు క్రీ.పూ. 487
“ఇంకా ఎవరైనా ప్రవచనాలు చెప్తూ ఉంటే, ఆ వ్యక్తిని కన్న తల్లిదండ్రులు వారితో, ‘నీవు యెహోవా పేరట అబద్ధాలు చెప్తున్నావు కాబట్టి నీవు చావాలి’ అని అంటారు. వారు ప్రవచనం చెప్తే, వారి కన్న తల్లిదండ్రులే వారిని పొడుస్తారు.
- జెకర్యా 13:4సుమారు క్రీ.పూ. 487
“ఆ రోజున ప్రతి ప్రవక్త తాము చెప్పిన ప్రవచనం బట్టి దర్శనం బట్టి సిగ్గుపడి ఇకపై ప్రజలను మోసగించడానికి ప్రవక్త గొంగళి ధరించడం మానేస్తారు.