కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. జెకర్యా 9:15సుమారు క్రీ.పూ. 487

    సైన్యాల యెహోవా వారిని కాపాడతారు. వారు నాశనం చేస్తూ వడిసెల రాళ్లతో గెలుస్తారు. వారు త్రాగి, ద్రాక్షారసాన్ని త్రాగినట్లుగా వారు గర్జిస్తారు; బలిపీఠం మూలల్లో చిలకరించడానికి ఉపయోగించే గిన్నెలా వారు నిండుగా ఉంటారు.

  2. జెకర్యా 9:16సుమారు క్రీ.పూ. 487

    కాపరి తన గొర్రెల మందను కాపాడినట్లు ఆ రోజున వారి దేవుడైన యెహోవా వారిని కాపాడతారు. వారు కిరీటంలోని ప్రశస్తమైన రాళ్లలా ఆయన దేశంలో ఉంటారు.

  3. జెకర్యా 9:17సుమారు క్రీ.పూ. 487

    ధాన్యంతో యువకులు క్రొత్త ద్రాక్షరసంతో యువతులు వర్ధిల్లుతారు. వారు ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఉంటారు!

  4. జెకర్యా 10:1సుమారు క్రీ.పూ. 487

    వసంతకాలంలో వర్షం కోసం యెహోవాను అడగండి; ఉరుములతో ఉన్న తుఫానును పంపేది యెహోవాయే. అందరి పొలానికి మొక్కలు పెరిగేలా, ఆయన ప్రజలందరికి వర్షాన్ని కురిపిస్తారు.

  5. జెకర్యా 10:2సుమారు క్రీ.పూ. 487

    గృహదేవతలు మోసపు మాటలు మాట్లాడతాయి, సోదె చెప్పేవారు అబద్ధపు దర్శనాలు చూస్తారు; వారు మోసంతో కలల భావాలు చెప్తారు, వ్యర్థమైన ఓదార్పు ఇస్తారు. కాబట్టి కాపరి లేకపోవడం వలన బాధించబడిన గొర్రెలు తిరిగినట్లు ప్రజలు తిరుగుతారు.

  6. జెకర్యా 10:3సుమారు క్రీ.పూ. 487

    “కాపరుల మీద నా కోపం రగులుకుంది, నేను నాయకులను శిక్షిస్తాను; సైన్యాల యెహోవా తన మందయైన యూదా ప్రజల మీద శ్రద్ధ చూపుతారు ఆయన వారిని గర్వించే యుద్ధ గుర్రాల్లా చేస్తారు.

  7. జెకర్యా 10:4సుమారు క్రీ.పూ. 487

    యూదా నుండి మూలరాయి వస్తుంది, అతని నుండి డేరా మేకు, అతని నుండి యుద్ధ విల్లు వస్తాయి, అతని నుండి ప్రతి పాలకుడు వస్తాడు.

  8. జెకర్యా 10:5సుమారు క్రీ.పూ. 487

    వారందరు కలిసి యుద్ధంలోని వీరుల్లా వీధుల బురదలో తమ శత్రువులను త్రొక్కుతారు. యెహోవా వారికి తోడుగా ఉన్నారు కాబట్టి వారు పోరాడతారు, శత్రువుల గుర్రపురౌతులను సిగ్గుపడేలా చేస్తారు.

  9. జెకర్యా 10:6సుమారు క్రీ.పూ. 487

    “నేను యూదాను బలపరుస్తాను యోసేపు గోత్రాలను రక్షిస్తాను. వారి పట్ల నాకు దయ ఉంది కాబట్టి, నేను వారిని తిరిగి రప్పిస్తాను. నేను వారిని విడిచిపెట్టిన సంగతిని వారు మరిచిపోతారు, ఎందుకంటే నేను వారి దేవుడనైన యెహోవాను, నేను వారికి జవాబిస్తాను.

  10. జెకర్యా 10:7సుమారు క్రీ.పూ. 487

    ఎఫ్రాయిమువారు వీరుల్లా అవుతారు, ద్రాక్షరసం త్రాగినట్లుగా వారి హృదయాలు సంతోషిస్తాయి. వారి పిల్లలు అది చూసి సంతోషిస్తారు; యెహోవాను బట్టి వారి హృదయాలు ఆనందిస్తాయి.

  11. జెకర్యా 10:8సుమారు క్రీ.పూ. 487

    నేను వారికి ఈలవేసి పిలిచి వారిని సమకూరుస్తాను. ఖచ్చితంగా నేను వారిని విమోచిస్తాను; వారు మునుపటిలా అనేకులుగా ఉంటారు.

  12. జెకర్యా 10:9సుమారు క్రీ.పూ. 487

    నేను వారిని ఇతర ప్రజల మధ్యలోనికి చెదరగొట్టినా దూరదేశాలలో వారు నన్ను జ్ఞాపకం చేసుకొంటారు. వారు వారి సంతానం సజీవులుగా తిరిగి వస్తారు.

  13. జెకర్యా 10:10సుమారు క్రీ.పూ. 487

    నేను వారిని ఈజిప్టు నుండి తిరిగి తీసుకువస్తాను అష్షూరు దేశం నుండి సమకూరుస్తాను. నేను వారిని గిలాదు, లెబానోను దేశాలకు తీసుకువస్తాను అక్కడ ఉన్న స్థలం వారికి సరిపోదు.

  14. జెకర్యా 10:11సుమారు క్రీ.పూ. 487

    వారు దుఃఖ సముద్రాన్ని దాటుతారు; సముద్రపు అలలు అణచివేయబడతాయి నైలు నదిలోని లోతైన స్థలాలన్నీ ఎండిపోతాయి. అష్షూరు యొక్క గర్వం అణచివేయబడుతుంది, ఈజిప్టు రాజదండం తీసివేయబడుతుంది.

  15. జెకర్యా 10:12సుమారు క్రీ.పూ. 487

    నేను వారిని యెహోవాలో బలపరుస్తాను. ఆయన నామం బట్టి వారు క్షేమంగా జీవిస్తారు,” అని యెహోవా చెప్తున్నారు.

  16. జెకర్యా 11:1సుమారు క్రీ.పూ. 487

    లెబానోనూ! అగ్ని వచ్చి నీ దేవదారు చెట్లను కాల్చివేయునట్లు, నీ తలుపులు తీయి.

  17. జెకర్యా 11:2సుమారు క్రీ.పూ. 487

    సరళ వృక్షాల్లారా, రోదించండి! దేవదారు చెట్లు కూలిపోయాయి; మహా వృక్షాలు నాశనమైపోయాయి! బాషాను యొక్క సింధూర వృక్షాల్లారా, రోదించండి: దట్టమైన అడవి నరకబడింది.

  18. జెకర్యా 11:3సుమారు క్రీ.పూ. 487

    గొర్రెల కాపరుల ఏడ్పు వినండి; వారి శ్రేష్ఠమైన పచ్చికబయళ్లు నాశనమైపోయాయి! సింహాల గర్జన వినండి; యొర్దాను లోయలోని దట్టమైన అడవులు పాడైపోయాయి!

  19. జెకర్యా 11:4సుమారు క్రీ.పూ. 487

    నా దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: “వధకు సిద్ధంగా ఉన్న గొర్రెల మందకు కాపరిగా ఉండు.

  20. జెకర్యా 11:5సుమారు క్రీ.పూ. 487

    వాటిని కొనేవారు వాటిని వధించి శిక్ష పొందకుండా ఉన్నారు. వాటిని అమ్మేవారు, ‘యెహోవాకు స్తోత్రం, మాకు డబ్బు వచ్చింది!’ అని అంటారు. వాటి సొంత కాపరులే వాటి మీద జాలిపడరు.

  21. జెకర్యా 11:6సుమారు క్రీ.పూ. 487

    ఇకనుండి నేను ఈ దేశ ప్రజలపై కనికరం చూపించను. వారందరిని వారి పొరుగువారి చేతికి, వారి రాజు చేతికి నేను అప్పగిస్తాను. వారు దేశాన్ని పాడుచేస్తారు, నేను వారి చేతుల్లో నుండి ఎవరినీ విడిపించను” అని యెహోవా అంటున్నారు.

  22. జెకర్యా 11:7సుమారు క్రీ.పూ. 487

    కాబట్టి వధకు సిద్ధంగా ఉన్న గొర్రెల మందకు, ముఖ్యంగా మందలో బాధించబడిన వాటికి నేను కాపరిగా ఉన్నాను. రెండు కర్రలు పట్టుకుని కాపరిగా కాచాను. ఒక కర్రకు దయ అని, రెండవ కర్రకు బంధం అని పేరు పెట్టాను.

  23. జెకర్యా 11:8సుమారు క్రీ.పూ. 487

    ఒకే నెలలో నేను ముగ్గురు కాపరులను తీసివేశాను. మంద నన్ను అసహ్యించుకుంది; నేను వారిని చూసి విసిగిపోయి,

  24. జెకర్యా 11:9సుమారు క్రీ.పూ. 487

    “నేను మీ కాపరిగా ఉండను. చచ్చేవారు చావవచ్చు, నశించేవారు నశించవచ్చు. మిగిలి ఉన్నవారు ఒకరి మాంసాన్ని ఒకరు తింటే తినవచ్చు” అన్నాను.

  25. జెకర్యా 11:10సుమారు క్రీ.పూ. 487

    తర్వాత నేను దేశాలన్నిటినితో చేసిన నిబంధనను రద్దు చేయడానికి దయ అనే కర్రను తీసుకుని దానిని విరిచాను.