- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- జెకర్యా 8:13సుమారు క్రీ.పూ. 518
యూదా, ఇశ్రాయేలూ, మీరు ఇతర ప్రజల్లో ఎలా శాపానికి గురై ఉన్నారో అలాగే మీరు దీవెనకరంగా ఉండేలా నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీరు దీవెనకరంగా ఉంటారు. భయపడకండి, మీ చేతులు బలం కలిగి ఉండనివ్వండి.”
- జెకర్యా 8:14సుమారు క్రీ.పూ. 518
సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “మీ పూర్వికులు నాకు కోపం పుట్టించినప్పుడు దయ చూపించకుండ నేను మీకు కీడు చేయాలని అనుకున్నట్టే” అని సైన్యాల యెహోవా అంటున్నారు,
- జెకర్యా 8:15సుమారు క్రీ.పూ. 518
“ఇప్పుడు నేను యెరూషలేము యూదాలకు మేలు చేయాలని నిశ్చయించుకున్నాను. భయపడకండి.
- జెకర్యా 8:16సుమారు క్రీ.పూ. 518
మీరు చేయవలసిన పనులేవంటే: ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడాలి, మీ న్యాయస్థానాల్లో సమాధానకరమైన తీర్పు ఇవ్వాలి;
- జెకర్యా 8:17సుమారు క్రీ.పూ. 518
ఒకరిపై ఒకరు కుట్ర చేయకూడదు, అబద్ధ ప్రమాణం చేయడానికి ఇష్టపడవద్దు. ఇవన్నీ నేను ద్వేషిస్తాను” అని యెహోవా చెప్తున్నారు.
- జెకర్యా 8:18సుమారు క్రీ.పూ. 518
సైన్యాల యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది.
- జెకర్యా 8:19సుమారు క్రీ.పూ. 518
సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “నాలుగు, అయిదు, ఏడు పదవ నెలల్లో మీరు చేసే ఉపవాసాలు యూదా వారికి ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగించే సంతోషకరమైన పండుగలుగా మారుతాయి. కాబట్టి సత్యాన్ని సమాధానాన్ని ప్రేమించండి.”
- జెకర్యా 8:20సుమారు క్రీ.పూ. 518
సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “అనేకమంది ప్రజలు ఎన్నో పట్టణాల నివాసులు ఇంకా వస్తారు,
- జెకర్యా 8:21సుమారు క్రీ.పూ. 518
ఒక పట్టణం వారు మరో పట్టణం వారి దగ్గరకు వెళ్లి, ‘సైన్యాల యెహోవాను వెదకి, యెహోవాను వేడుకోడానికి వెంటనే వెళ్దాం రండి’ అని చెప్పగా వారు, ‘మేము కూడా వస్తాం’ అని అంటారు.
- జెకర్యా 8:22సుమారు క్రీ.పూ. 518
అన్నిటిని పరిపాలించే సైన్యాల యెహోవాను వెదకడానికి, ఆయన దయను కోరడానికి అనేకమంది ప్రజలు, శక్తివంతమైన దేశాలు యెరూషలేముకు వస్తారు.”
- జెకర్యా 8:23సుమారు క్రీ.పూ. 518
సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “ఆ రోజుల్లో, ఇతర ప్రజల్లో ఆయా భాషల్లో మాట్లాడే పదిమంది ఒక యూదుని చెంగు పట్టుకుని, ‘దేవుడు మీకు తోడుగా ఉన్నారని మేము విన్నాము. మేము కూడా మీతో వస్తాం’ అంటారు.”
- జెకర్యా 9:1సుమారు క్రీ.పూ. 487
ప్రవచనం: హద్రాకు దేశం గురించి దమస్కు పట్టణం గురించి వచ్చిన యెహోవా వాక్కు: మనుష్యులందరి కళ్లు, ఇశ్రాయేలు గోత్రాలన్నిటి కళ్లు యెహోవా మీద ఉన్నాయి.
- జెకర్యా 9:2సుమారు క్రీ.పూ. 487
అంతేకాక, దాని సరిహద్దును ఆనుకుని ఉన్న హమాతు గురించి, చాలా నిపుణులైన తూరు సీదోను ప్రజల గురించి వచ్చిన యెహోవా వాక్కు.
- జెకర్యా 9:3సుమారు క్రీ.పూ. 487
తూరు తన కోసం బలమైన దుర్గం కట్టుకుంది; ధూళి అంత విస్తారంగా వెండిని, వీధుల్లోని మట్టి అంత విస్తారంగా బంగారాన్ని పోగుచేసింది.
- జెకర్యా 9:4సుమారు క్రీ.పూ. 487
అయితే యెహోవా దాని సంపదలు తీసివేసి, సముద్రంలో ఉన్న దాని శక్తిని నాశనం చేస్తారు. అది అగ్నితో కాల్చబడుతుంది.
- జెకర్యా 9:5సుమారు క్రీ.పూ. 487
అష్కెలోను దానిని చూసి భయపడుతుంది; గాజా వేదనతో విలపిస్తుంది ఎక్రోను కూడా తన నిరీక్షణ కోల్పోతుంది. గాజా తన రాజును కోల్పోతుంది అష్కెలోను ఎడారిగా మారుతుంది.
- జెకర్యా 9:6సుమారు క్రీ.పూ. 487
సంకరజాతి ప్రజలు అష్డోదును ఆక్రమిస్తారు, ఫిలిష్తీయుల గర్వాన్ని నేను అంతం చేస్తాను.
- జెకర్యా 9:7సుమారు క్రీ.పూ. 487
వారి నోటిలో నుండి రక్తాన్ని, వారి పళ్ల మధ్య నుండి తినకూడని ఆహారాన్ని నేను తీసివేస్తాను. వారిలో మిగిలి ఉన్నవారు మన దేవుని వారై యూదాలో ఒక వంశంగా ఉంటారు. ఎక్రోను వారు యెబూసీయుల్లా ఉంటారు.
- జెకర్యా 9:8సుమారు క్రీ.పూ. 487
నేను కళ్లారా చూస్తున్నాను కాబట్టి బాధించేవారు నా ప్రజలపై మరలా ఎన్నడూ దాడి చేయకుండా దోపిడి మూకలు నా మందిరం మీదికి రాకుండా కాపాడడానికి నేను దాని దగ్గర శిబిరం ఏర్పాటు చేస్తాను.
- జెకర్యా 9:9సుమారు క్రీ.పూ. 487
సీయోను కుమారీ, గొప్పగా సంతోషించు! యెరూషలేము కుమారీ, ఆనందంతో కేకలు వేయి! ఇదిగో నీతిమంతుడు, జయశీలియైన మీ రాజు దీనుడిగా గాడిద మీద, గాడిదపిల్ల మీద స్వారీ చేస్తూ మీ దగ్గరకు వస్తున్నాడు.
- జెకర్యా 9:10సుమారు క్రీ.పూ. 487
నేను ఎఫ్రాయింలో రథాలు లేకుండా చేస్తాను యెరూషలేములో యుద్ధ గుర్రాలు లేకుండా చేస్తాను యుద్ధపు విల్లు విరిగిపోతుంది. ఆయన దేశాలకు సమాధానాన్ని ప్రకటిస్తారు. ఆయన రాజ్యం సముద్రం నుండి సముద్రం వరకు నది నుండి భూమి అంచుల వరకు ఉంటుంది.
- జెకర్యా 9:11సుమారు క్రీ.పూ. 487
నేను మీతో చేసిన నిబంధన రక్తాన్ని బట్టి బందీలుగా ఉన్న మీ వారిని నీరులేని గోతిలో నుండి విడిపిస్తాను.
- జెకర్యా 9:12సుమారు క్రీ.పూ. 487
నిరీక్షణగల బందీల్లారా, మీ కోటకు తిరిగి రండి. నేను మీకు రెండింతలు మేలు చేస్తానని ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను.
- జెకర్యా 9:13సుమారు క్రీ.పూ. 487
నా విల్లును వంచినట్లు నేను యూదాను వంచుతాను ఎఫ్రాయిము అనే నా బాణంతో దానిని నింపుతాను. సీయోనూ, నీ కుమారులను పురికొల్పి నిన్ను యోధుని కత్తిలా మార్చుతాను; గ్రీసు దేశస్థులారా! సీయోను కుమారులను మీ మీదికి పురికొల్పుతాను.
- జెకర్యా 9:14సుమారు క్రీ.పూ. 487
అప్పుడు యెహోవా వారికి పైగా ప్రత్యక్షమవుతారు; ఆయన బాణాలు మెరుపులా వస్తాయి. ప్రభువైన యెహోవా బాకా మోగిస్తూ దక్షిణపు తుఫాను గాలులతో ముందుకు సాగుతారు,