- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- జెకర్యా 5:3సుమారు క్రీ.పూ. 519
అందుకతడు నాతో ఇలా అన్నాడు, “ఇది భూమి అంతటి మీదికీ బయలుదేరి వెళ్తున్న శాపం; దానికి ఒకవైపు వ్రాసి ఉన్న ప్రకారం దొంగలు నాశనమవుతారు, రెండవ వైపు వ్రాసి ఉన్న ప్రకారం అబద్ధ ప్రమాణం చేసేవారంతా దేశ బహిష్కరణ శిక్ష పొందుతారు.
- జెకర్యా 5:4సుమారు క్రీ.పూ. 519
సైన్యాల యెహోవా చెప్తున్న మాట ఇదే, ‘నేను దానిని బయటకు పంపుతాను, అది దొంగల ఇంట్లోకి, నా పేరిట అబద్ధ ప్రమాణం చెప్పే అందరి ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంట్లో ఉంటూ దాని దూలాలు, రాళ్లతో సహా సమస్తాన్ని నాశనం చేస్తుంది.’ ”
- జెకర్యా 5:5సుమారు క్రీ.పూ. 519
అప్పుడు నాతో మాట్లాడుతున్న దేవదూత ముందుకు వచ్చి, “నీ కళ్లు పైకెత్తి ఏమి కనిపిస్తుందో చూడు” అన్నాడు.
- జెకర్యా 5:6సుమారు క్రీ.పూ. 519
“అది ఏమిటి?” అని నేను అడిగాను. అందుకతడు, “అది ఓ బుట్ట, అది దేశమంతటిలో ఉన్న ప్రజల దోషం” అని చెప్పాడు.
- జెకర్యా 5:7సుమారు క్రీ.పూ. 519
తర్వాత సీసంతో చేసిన మూత తీసినప్పుడు ఆ బుట్టలో ఒక స్త్రీ కూర్చుని కనబడింది.
- జెకర్యా 5:8సుమారు క్రీ.పూ. 519
అతడు, “ఇది దుర్మార్గం” అని చెప్పి బుట్టలోనికి దానిని నెట్టి సీసం మూత మూసి వేశాడు.
- జెకర్యా 5:9సుమారు క్రీ.పూ. 519
నేను మరలా పైకి చూడగా నా ఎదుట ఇద్దరు స్త్రీలు కనిపించారు, వారికున్న రెక్కలు గాలికి కదులుతున్నాయి. కొంగ రెక్కలవంటి రెక్కలు వారికున్నాయి, అవి ఆకాశానికి భూమికి మధ్యలో ఆ బుట్టను ఎత్తాయి.
- జెకర్యా 5:10సుమారు క్రీ.పూ. 519
నాతో మాట్లాడుతున్న దూతను, “బుట్టను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” అని అడిగాను.
- జెకర్యా 5:11సుమారు క్రీ.పూ. 519
అతడు జవాబిస్తూ, “దానికి ఇల్లు కట్టడానికి బబులోను దేశానికి తీసుకెళ్తున్నారు. ఇల్లు సిద్ధమైనప్పుడు ఆ బుట్ట అక్కడ దాని స్థానంలో ఉంచుతారు” అన్నాడు.
- జెకర్యా 6:1సుమారు క్రీ.పూ. 519
నేను మళ్ళీ పైకి చూస్తే, నా ఎదుట రెండు పర్వతాల మధ్య నుండి నాలుగు రథాలు బయలుదేరుతూ కనిపించాయి. అవి ఇత్తడి పర్వతాలు.
- జెకర్యా 6:2సుమారు క్రీ.పూ. 519
మొదటి రథానికి ఎర్రటి గుర్రాలు, రెండవ రథానికి నల్లని గుర్రాలు,
- జెకర్యా 6:3సుమారు క్రీ.పూ. 519
మూడవ రథానికి తెల్లని గుర్రాలు, నాలుగవ రథానికి చుక్కలు ఉన్న గుర్రాలు ఉన్నాయి. అవన్నీ బలమైనవి.
- జెకర్యా 6:4సుమారు క్రీ.పూ. 519
నాతో మాట్లాడుతున్న దూతను, “నా ప్రభువా, ఇవి ఏమిటి?” అని అడిగాను.
- జెకర్యా 6:5సుమారు క్రీ.పూ. 519
దూత నాకు జవాబిస్తూ ఇలా అన్నాడు, “ఇవి సర్వలోక ప్రభువు సన్నిధి నుండి బయలుదేరిన నాలుగు పరలోకపు ఆత్మలు.
- జెకర్యా 6:6సుమారు క్రీ.పూ. 519
నల్లని గుర్రాలున్న రథం ఉత్తర దేశం వైపు, తెల్లని గుర్రాలున్న రథం పడమర వైపు, చుక్కలున్న గుర్రాలున్న రథం దక్షిణం వైపు వెళ్తాయి.”
- జెకర్యా 6:7సుమారు క్రీ.పూ. 519
ఆ బలమైన గుర్రాలు బయలుదేరి భూమి అంతా తిరగడానికి సిద్ధంగా ఉండగా అతడు, “వెళ్లి భూమి అంతా తిరగండి!” అని అన్నాడు. కాబట్టి అవి భూమి అంతటా వెళ్లాయి.
- జెకర్యా 6:8సుమారు క్రీ.పూ. 519
అప్పుడు అతడు నన్ను పిలిచి, “ఉత్తర దేశం వైపు వెళ్లేవాటిని చూడు, అవి ఉత్తర దేశంలో నా ఆత్మకు నెమ్మది కలిగిస్తాయి” అన్నాడు.
- జెకర్యా 6:9సుమారు క్రీ.పూ. 519
యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
- జెకర్యా 6:10సుమారు క్రీ.పూ. 519
“బందీలుగా వెళ్లిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబీయా, యెదాయాల నుండి వెండి బంగారాలు తీసుకో. ఆ రోజే జెఫన్యా కుమారుడైన యోషీయా ఇంటికి వెళ్లు.
- జెకర్యా 6:11సుమారు క్రీ.పూ. 519
వారి నుండి వెండి బంగారాలు తీసుకుని కిరీటం చేసి దానిని ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువ తలమీద పెట్టి,
- జెకర్యా 6:12సుమారు క్రీ.పూ. 519
అతనితో ఇలా చెప్పు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘చిగురు అనే పేరుగల వ్యక్తి ఉన్నాడు. అతడు తన స్థలంలో నుండి చిగురిస్తూ, యెహోవా మందిరం కడతాడు.
- జెకర్యా 6:13సుమారు క్రీ.పూ. 519
యెహోవా మందిరాన్ని కట్టేవాడు అతడే; అతడు వైభవాన్ని కలిగి సింహాసనం మీద కూర్చుని పరిపాలిస్తాడు. అతడు తన సింహాసనం మీద యాజకునిగా ఉంటాడు. ఆ ఇద్దరి మధ్య సమాధానకరమైన ఆలోచన ఉంటుంది.’
- జెకర్యా 6:14సుమారు క్రీ.పూ. 519
ఆ కిరీటం యెహోవా మందిరంలో జ్ఞాపకార్థంగా హేలెము, టోబీయా, యెదాయాలకు, జెఫన్యా కుమారుడైన హేనుకు ఇవ్వబడుతుంది.
- జెకర్యా 6:15సుమారు క్రీ.పూ. 519
దూరంగా ఉన్నవారు వచ్చి యెహోవా మందిరాన్ని కట్టడానికి సహాయం చేస్తారు. అప్పుడు సైన్యాల యెహోవా నన్ను మీ దగ్గరకు పంపారని మీరు తెలుసుకుంటారు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జ్రాగత్తగా వింటే ఇలా జరుగుతుంది.”
- జెకర్యా 7:1సుమారు క్రీ.పూ. 518
రాజైన దర్యావేషు పరిపాలన నాలుగవ సంవత్సరం కిస్లేవు అనే తొమ్మిదవ నెల నాలుగో రోజున యెహోవా వాక్కు జెకర్యా దగ్గరకు వచ్చింది.