- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- జెకర్యా 1:11సుమారు క్రీ.పూ. 519
వారు గొంజిచెట్ల మధ్యలో నిలబడిన యెహోవా దూతతో, “మేము లోకమంతటా తిరిగి వచ్చాము. లోకమంతా ప్రశాంతంగా సమాధానంగా ఉండడం చూశాం” అన్నారు.
- జెకర్యా 1:12సుమారు క్రీ.పూ. 519
అప్పుడు యెహోవా దూత, “సైన్యాల యెహోవా, డెబ్బై సంవత్సరాలుగా మీరు యెరూషలేము మీద, యూదా పట్టణాల మీద కోపంతో ఉన్నారు, ఇంకెన్నాళ్లు వరకు కనికరించకుండా ఉంటారు?” అని మనవి చేశాడు.
- జెకర్యా 1:13సుమారు క్రీ.పూ. 519
కాబట్టి నాతో మాట్లాడుతున్న ఆ దూతకు యెహోవా దయగల ఆదరణ కలిగించే మాటలు చెప్పారు.
- జెకర్యా 1:14సుమారు క్రీ.పూ. 519
ఆ తర్వాత నాతో మాట్లాడుతున్న దూత ఇలా అన్నాడు, “నీవు ఈ మాటను ప్రకటించు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘యెరూషలేము, సీయోను గురించి నేనెంతో ఆసక్తి కలిగి ఉన్నాను.
- జెకర్యా 1:15సుమారు క్రీ.పూ. 519
నిశ్చింతగా బ్రతుకుతున్న ఇతర జాతులపై నేను చాలా కోపంగా ఉన్నాను. గతంలో నేను కొంచెమే కోప్పడ్డాను, కానీ వారు ఆ శిక్షను చాలా తీవ్రం చేసుకున్నారు.’
- జెకర్యా 1:16సుమారు క్రీ.పూ. 519
“కాబట్టి యెహోవా చెప్పే మాట ఇదే: ‘నేను కనికరంతో యెరూషలేము వైపు తిరుగుతాను, అక్కడ నా మందిరం తిరిగి కట్టబడుతుంది. యెరూషలేము మీద నిర్మాణకులు కొలతలు వేస్తారు’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.
- జెకర్యా 1:17సుమారు క్రీ.పూ. 519
“ఇది కూడా నీవు ప్రకటించు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘నా పట్టణాలు మళ్ళీ అభివృద్ధితో నిండుతాయి, యెహోవా మళ్ళీ సీయోనును ఆదరిస్తారు, యెరూషలేమును ఎన్నుకుంటారు.’ ”
- జెకర్యా 1:18సుమారు క్రీ.పూ. 519
తర్వాత నేను పైకి చూసినప్పుడు అక్కడ నాలుగు కొమ్ములు కనిపించాయి.
- జెకర్యా 1:19సుమారు క్రీ.పూ. 519
నాతో మాట్లాడుతున్న దూతను, “ఇవి ఏంటి?” అని అడిగాను. అందుకతడు, “ఇవి యూదా, ఇశ్రాయేలు, యెరూషలేములను చెదరగొట్టిన కొమ్ములు” అని చెప్పాడు.
- జెకర్యా 1:20సుమారు క్రీ.పూ. 519
అప్పుడు యెహోవా నాకు నలుగురు కంసాలులను చూపించారు.
- జెకర్యా 1:21సుమారు క్రీ.పూ. 519
“వీరు ఏమి చేయడానికి వస్తున్నారు?” అని నేను అడిగాను. అందుకాయన, “ఎవ్వరూ తమ తల ఎత్తకుండ యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే, అయితే కంసాలులు వారిని భయభ్రాంతులకు గురిచేసి, యూదా దేశంలోని ప్రజలను చెదరగొట్టడానికి తమ కొమ్ములను ఎత్తిన దేశాల కొమ్ములను పడగొట్టడానికి వచ్చారు” అని అన్నారు.
- జెకర్యా 2:1సుమారు క్రీ.పూ. 519
ఆ తర్వాత నేను పైకి చూసినప్పుడు నా ఎదుట కొలమానం పట్టుకున్న వ్యక్తి కనబడ్డాడు.
- జెకర్యా 2:2సుమారు క్రీ.పూ. 519
“నీవు ఎక్కడికి వెళ్తున్నావు?” అని నేను అడిగాను. అందుకతడు, “యెరూషలేము పొడవు, వెడల్పు ఎంత ఉందో కొలిచి తెలుసుకోవడానికి వెళ్తున్నాను” అన్నాడు.
- జెకర్యా 2:3సుమారు క్రీ.పూ. 519
అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత వెళ్లిపోతుండగా, మరొక దూత అతన్ని కలుసుకోడానికి వచ్చి,
- జెకర్యా 2:4సుమారు క్రీ.పూ. 519
అతనితో ఇలా అన్నాడు: “నీవు ఆ యువకుని దగ్గరికి పరుగెత్తుకొని వెళ్లి ఇలా చెప్పు, ‘యెరూషలేములో మనుష్యులు పశువులు విస్తారంగా ఉన్నందుకు, అది గోడలులేని పట్టణంలా ఉంటుంది.
- జెకర్యా 2:5సుమారు క్రీ.పూ. 519
నేనే దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను, దాని మధ్యలో నివసించి దానికి ఘనతగా ఉంటాను’ అని యెహోవా చెప్తున్నారు.
- జెకర్యా 2:6సుమారు క్రీ.పూ. 519
“రండి! ఉత్తర దేశం నుండి తప్పించుకుని రండి, ఆకాశం నాలుగు దిక్కులకు వీచే గాలిలా నేను మిమ్మల్ని చెదరగొట్టాను” అని యెహోవా చెప్తున్నారు.
- జెకర్యా 2:7సుమారు క్రీ.పూ. 519
“సీయోను ప్రజలారా, రండి! బబులోను దేశంలో నివసిస్తున్న మీరు తప్పించుకుని రండి!”
- జెకర్యా 2:8సుమారు క్రీ.పూ. 519
సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “మిమ్మల్ని ముట్టుకున్న వారు యెహోవా కనుగుడ్డును ముట్టినట్లే అని తలంచి తనకు ఘనత కలిగేలా మహిమాన్వితుడు మిమ్మల్ని దోచుకున్న దేశాల మీదికి నన్ను పంపించారు.
- జెకర్యా 2:9సుమారు క్రీ.పూ. 519
నేను వారి మీద నా చేయి ఎత్తుతాను అప్పుడు వారి బానిసలు వారిని దోచుకుంటారు. అప్పుడు సైన్యాల యెహోవా నన్ను పంపారని మీరు తెలుసుకుంటారు.
- జెకర్యా 2:10సుమారు క్రీ.పూ. 519
“సీయోను కుమార్తె, కేకవేయి, సంతోషించు. నేను వస్తున్నాను, మీ మధ్య నివసిస్తాను” అని యెహోవా చెప్తున్నారు.
- జెకర్యా 2:11సుమారు క్రీ.పూ. 519
“ఆ రోజున అనేక దేశాలు యెహోవా దగ్గరకు చేరి నా ప్రజలవుతారు. నేను మీ మధ్య నివసిస్తాను, అప్పుడు సైన్యాల యెహోవా నన్ను పంపారని మీరు తెలుసుకుంటారు.
- జెకర్యా 2:12సుమారు క్రీ.పూ. 519
పరిశుద్ధ దేశంలో యెహోవా యూదాను తన స్వాస్థ్యంగా సొంతం చేసుకుంటారు, యెరూషలేమును మళ్ళీ ఎన్నుకుంటారు.
- జెకర్యా 2:13సుమారు క్రీ.పూ. 519
సర్వజనులారా, యెహోవా తన పరిశుద్ధ నివాసం విడిచి వస్తున్నారు కాబట్టి ఆయన ఎదుట మౌనంగా ఉండండి.”
- జెకర్యా 3:1సుమారు క్రీ.పూ. 519
అప్పుడు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండడం, అతన్ని నిందించడానికి సాతాను అతని కుడి ప్రక్కన నిలబడి ఉండడం అతడు నాకు చూపించాడు.