కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. హబక్కూకు 2:16సుమారు క్రీ.పూ. 626

    కీర్తికి బదులుగా నీకు అవమానం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు నీ వంతు! నీవు కూడా త్రాగి నీ నగ్నత్వాన్ని చూపించుకుంటావు. యెహోవా కుడిచేతిలోని పాత్ర నీ దగ్గరకు వస్తోంది, అవమానం నీ కీర్తిని కప్పివేస్తుంది.

  2. హబక్కూకు 2:17సుమారు క్రీ.పూ. 626

    లెబానోనుపై నీవు చేసిన హింస నీ మీదికే వస్తుంది, పశువులను నాశనం చేసినందుకు నీ మీదికి భయంకరమైన తీర్పు వస్తుంది. నీవు మనుష్యులను హత్య చేసినందుకు, దేశాలను పట్టణాలను వాటి నివాసులను నాశనం చేసినందుకు ఇలా జరుగుతుంది.

  3. హబక్కూకు 2:18సుమారు క్రీ.పూ. 626

    “శిల్పి చెక్కిన ఒక విగ్రహం వలన ప్రయోజనమేంటి? అబద్ధాలు బోధించే ప్రతిమ వలన ప్రయోజనమేంటి? ఒకడు మాట్లాడలేని విగ్రహాలను చేసిన తాను రూపం ఇచ్చిన వాటిపైనే నమ్మకం ఉంచడం వలన ప్రయోజనమేంటి?

  4. హబక్కూకు 2:19సుమారు క్రీ.పూ. 626

    చెక్కను చూసి, ‘ప్రాణం తెచ్చుకో’ అని నిర్జీవమైన రాయితో, ‘మేలుకో’ అని చెప్పేవానికి శ్రమ! అది దారి చూపించగలదా? అది బంగారం వెండితో పూత వేయబడింది; దానిలో శ్వాస లేదు.”

  5. హబక్కూకు 2:20సుమారు క్రీ.పూ. 626

    కాని, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నారు; ఆయన ఎదుట లోకమంతా మౌనం వహించాలి.

  6. హబక్కూకు 3:1సుమారు క్రీ.పూ. 626

    ప్రవక్తయైన హబక్కూకు చేసిన ప్రార్థన. షిగియోనోతు.

  7. హబక్కూకు 3:2సుమారు క్రీ.పూ. 626

    యెహోవా, నీ కీర్తి గురించి విన్నాను; యెహోవా, నీ క్రియలకు నేను భయపడుతున్నాను. మా దినాల్లో వాటిని మళ్ళీ చేయండి, మా కాలంలో వాటిని తెలియజేయండి; ఉగ్రతలో కరుణించడం జ్ఞాపకముంచుకోండి.

  8. హబక్కూకు 3:3సుమారు క్రీ.పూ. 626

    దేవుడు తేమాను నుండి వచ్చాడు, పరిశుద్ధుడు పారాను పర్వతం నుండి వచ్చాడు. సెలా ఆయన మహా వైభవం ఆకాశాలను కప్పివేసింది భూమి ఆయన స్తుతితో నిండింది.

  9. హబక్కూకు 3:4సుమారు క్రీ.పూ. 626

    ఆయన తేజస్సు సూర్యకాంతిలా ఉంది; ఆయన చేతిలో నుండి కిరణాలు బయలువెళ్తున్నాయి, అక్కడ ఆయన శక్తి దాగి ఉంది.

  10. హబక్కూకు 3:5సుమారు క్రీ.పూ. 626

    ఆయనకు ముందుగా తెగులు వెళ్లింది; అంటువ్యాధి ఆయన పాదాలను అనుసరించింది.

  11. హబక్కూకు 3:6సుమారు క్రీ.పూ. 626

    ఆయన నిలబడగా భూమి కంపించింది; ఆయన చూడగా దేశాలు వణికాయి. పురాతన పర్వతాలు కూలిపోయాయి పురాతన కొండలు అణగిపోయాయి కానీ ఆయన మార్గాలు శాశ్వతమైనవి.

  12. హబక్కూకు 3:7సుమారు క్రీ.పూ. 626

    భయంలో ఉన్న కూషీయుల గుడారాలను, వేదనలో ఉన్న మిద్యానువాసుల నివాసాలను నేను చూశాను.

  13. హబక్కూకు 3:8సుమారు క్రీ.పూ. 626

    యెహోవా, నీవు నదులపై కోపంగా ఉన్నావా? ప్రవాహాల మీద నీ ఉగ్రత ఉందా? సముద్రంపై కోపం వచ్చిందా? అందుకే నీవు నీ గుర్రాల మీద స్వారీ చేస్తూ నీ విజయ రథాలను ఎక్కి వస్తున్నావా?

  14. హబక్కూకు 3:9సుమారు క్రీ.పూ. 626

    వరలో నుండి నీ విల్లు తీసావు, నీ వాక్కుతోడని ప్రమాణం చేసి నీ బాణాలను సిద్ధం చేశావు. సెలా నీవు భూమిని చీల్చి నదులను ప్రవహింపజేశావు;

  15. హబక్కూకు 3:10సుమారు క్రీ.పూ. 626

    పర్వతాలు నిన్ను చూసి వణికాయి. నీళ్లు ప్రవాహాలుగా ప్రవహిస్తాయి; అగాధం ఘోషిస్తూ తన అలలను పైకి లేపుతుంది.

  16. హబక్కూకు 3:11సుమారు క్రీ.పూ. 626

    ఎగిరే నీ బాణాల కాంతికి నీ ఈటె తళతళ మెరుపుకు సూర్యచంద్రులు తమ ఆకాశంలో స్థానాల్లో నిలిచిపోతాయి.

  17. హబక్కూకు 3:12సుమారు క్రీ.పూ. 626

    ఉగ్రతతో నీవు భూమిమీద తిరుగుతున్నావు ఆగ్రహంతో దేశాలను అణగద్రొక్కుతున్నావు.

  18. హబక్కూకు 3:13సుమారు క్రీ.పూ. 626

    నీ ప్రజలను విడిపించడానికి, నీ అభిషిక్తుని రక్షించడానికి నీవు బయలుదేరుతున్నావు. దుర్మార్గపు దేశపు నాయకుడిని నీవు కూలద్రోసి, తల నుండి పాదం ఖండించి నిర్మూలం చేస్తున్నావు. సెలా

  19. హబక్కూకు 3:14సుమారు క్రీ.పూ. 626

    దాక్కున్న దౌర్భాగ్యులను మ్రింగివేసేందుకు ఉవ్విళ్లూరుతూ, మనల్ని చెదరగొట్టడానికి అతని యోధులు దూసుకుని వచ్చినప్పుడు, అతని తలలో మీరు అతని ఈటెనే గుచ్చారు.

  20. హబక్కూకు 3:15సుమారు క్రీ.పూ. 626

    నీవు నీ గుర్రాలతో సముద్రాన్ని త్రొక్కించావు, గొప్ప జలాలను చిలుకుతున్నావు.

  21. హబక్కూకు 3:16సుమారు క్రీ.పూ. 626

    నేను వినగా నా గుండె కొట్టుకుంది, ఆ శబ్దానికి నా పెదవులు వణుకుతున్నాయి; నా ఎముకలు కుళ్లిపోతున్నాయి, నా కాళ్లు వణికాయి. అయినా మనపై దాడి చేస్తున్న దేశం మీదికి విపత్తు సంభవించే దినం వచ్చేవరకు నేను ఎదురుచూస్తూ ఉంటాను.

  22. హబక్కూకు 3:17సుమారు క్రీ.పూ. 626

    అంజూరపు చెట్టు పూత పూయకపోయినా ద్రాక్షచెట్టుకు పండ్లు లేకపోయినా, ఒలీవచెట్లు కాపు కాయకపోయినా పొలాలు పంట ఇవ్వకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా శాలలో పశువులు లేకపోయినా,

  23. హబక్కూకు 3:18సుమారు క్రీ.పూ. 626

    నేను యెహోవాయందు ఆనందిస్తాను, నా రక్షకుడైన దేవునియందు నేను సంతోషిస్తాను.

  24. హబక్కూకు 3:19సుమారు క్రీ.పూ. 626

    ప్రభువైన యెహోవాయే నా బలం; ఆయన నా కాళ్లను లేడికాళ్లలా చేస్తాడు, ఎత్తైన స్థలాల మీద ఆయన నన్ను నడిపిస్తారు. సంగీత దర్శకుని కోసము. తంతి వాయిద్యాలపై పాడదగినది.

  25. జెఫన్యా 1:1సుమారు క్రీ.పూ. 630

    ఇది యూదా రాజైన ఆమోను కుమారుడు యోషీయా పాలనలో జెఫన్యాకు యెహోవా నుండి వచ్చిన వాక్కు. జెఫన్యా కూషీ కుమారుడు, కూషీ గెదల్యా కుమారుడు, గెదల్యా అమర్యా కుమారుడు, అమర్యా హిజ్కియాకు కుమారుడు.