కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. జెఫన్యా 2:9సుమారు క్రీ.పూ. 630

    కాబట్టి, నా జీవం తోడు, మోయాబు సొదొమలా, అమ్మోను గొమొర్రాలా అవుతుంది. కలుపు మొక్కలు ఉప్పు గుంటలతో, అవి ఎప్పటికీ బంజరు భూమిగానే ఉంటాయి. నా ప్రజల్లో శేషించినవారు వారిని దోచుకుంటారు; నా దేశంలో బ్రతికినవారు తమ దేశాన్ని స్వతంత్రించుకుంటారు” అని ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.

  2. జెఫన్యా 2:10సుమారు క్రీ.పూ. 630

    ఈ విధంగా వారు గర్వంతో, సైన్యాల యెహోవా ప్రజలను అవమానించినందుకు, ఎగతాళి చేసినందుకు ప్రతిఫలం పొందుతారు.

  3. జెఫన్యా 2:11సుమారు క్రీ.పూ. 630

    ఆయన భూమ్మీద ఉన్న దేవతలందరినీ నాశనం చేసినప్పుడు యెహోవా వారికి భయంకరంగా ఉంటాడు. ద్వీపాల్లో నివసించే జనులంతా తమ స్థలాల నుండి, ఆయనకు నమస్కారం చేస్తారు.

  4. జెఫన్యా 2:12సుమారు క్రీ.పూ. 630

    “కూషీయులారా, మీరు కూడా నా ఖడ్గం చేత చంపబడతారు.”

  5. జెఫన్యా 2:13సుమారు క్రీ.పూ. 630

    ఆయన తన చేయి ఉత్తరం వైపు చాచి అష్షూరును నాశనం చేస్తారు. నీనెవెను పూర్తిగా నిర్జనమై ఎడారిలా ఎండిపోయేలా చేస్తారు.

  6. జెఫన్యా 2:14సుమారు క్రీ.పూ. 630

    గొర్రెల మందలు, పశువుల మందలు, దేశంలోని అన్ని రకాల జీవులు అక్కడ పడుకుంటాయి. ఎడారి గుడ్లగూబ, పెద్ద గుడ్లగూబ దాని స్తంభాలపై కూర్చుంటాయి. వారి కూత కిటికీల గుండా ప్రతిధ్వనిస్తుంది, రాళ్లతో తలుపులు నిండిపోతాయి, దేవదారు దూలాలు నాశనమవుతాయి.

  7. జెఫన్యా 2:15సుమారు క్రీ.పూ. 630

    ఇది క్షేమకరమైన ఆనందకరమైన పట్టణము. ఆమె తనలో తాను, “నా వంటి పట్టణం మరొకటి లేదని అనుకున్నది. ఆమె ఎంతగా పాడైపోయింది,” క్రూరమృగాలకు గుహలా మారింది! ఆ దారి గుండా వెళ్లే వారందరూ ఎగతాళి చేస్తూ చేతులు ఆడిస్తున్నారు.

  8. జెఫన్యా 3:1సుమారు క్రీ.పూ. 630

    అణచివేత, తిరుగుబాటుతనం, అపవిత్రత నిండిన పట్టణానికి శ్రమ!

  9. జెఫన్యా 3:2సుమారు క్రీ.పూ. 630

    ఆమె ఎవరికీ లోబడదు, ఆమె దిద్దుబాటును అంగీకరించదు. ఆమె యెహోవా మీద నమ్మకముంచదు, ఆమె తన దేవున్ని సమీపించదు.

  10. జెఫన్యా 3:3సుమారు క్రీ.పూ. 630

    దానిలో ఉన్న అధికారులు గర్జించే సింహాలు; దాని పాలకులు రాత్రివేళ తిరుగుతూ, ఉదయానికి ఏమీ మిగల్చకుండా తినే తోడేళ్లు.

  11. జెఫన్యా 3:4సుమారు క్రీ.పూ. 630

    దాని ప్రవక్తలు నీతిలేనివారు; వారు నమ్మకద్రోహులు. దాని యాజకులు పరిశుద్ధస్థలాన్ని అపవిత్రం చేస్తారు ధర్మశాస్త్రాన్ని హింసిస్తారు.

  12. జెఫన్యా 3:5సుమారు క్రీ.పూ. 630

    అయితే యెహోవా నీతిమంతుడు; ఆయన తప్పు చేయరు. అనుదినం ఆయన మానకుండా, ఉదయాన్నే తన న్యాయాన్ని అమలుచేస్తారు, అయినప్పటికీ నీతిలేని వానికి సిగ్గు తెలియదు.

  13. జెఫన్యా 3:6సుమారు క్రీ.పూ. 630

    “నేను దేశాలను నాశనం చేశాను; వాటి కోటలు పడగొట్టబడ్డాయి. నేను వాటి వీధులను ఎడారిగా వదిలేశాను, ఎవరూ వాటి గుండా వెళ్లరు. వాటిలో ఎవరూ నివసించకుండా వారి పట్టణాలను నిర్జనంగా చేశాను.

  14. జెఫన్యా 3:7సుమారు క్రీ.పూ. 630

    నేను యెరూషలేము గురించి, ‘ఖచ్చితంగా నీవు నాకు భయపడి దిద్దుబాటును అంగీకరిస్తావు! అప్పుడు దాని ఆశ్రయ స్థలం నాశనం చేయబడదు, నా శిక్షలేవీ దాని మీదికి రావు’ అని అనుకున్నాను. కాని వారు అన్ని రకాల చెడుపనులు చేయాలని ఆతృతగా ఉన్నారు.

  15. జెఫన్యా 3:8సుమారు క్రీ.పూ. 630

    కాబట్టి నా కోసం వేచి ఉండండి,” అని యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు. “నేను సాక్ష్యం చెప్పడానికి నిలబడే రోజు కోసం వేచి ఉండండి. నేను దేశాలను పోగుచేయాలని, రాజ్యాలను సమకూర్చాలని వాటి మీద నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని కుమ్మరించాలని నిర్ణయించుకున్నాను. రోషంతో కూడిన నా కోపానికి లోకమంతా దహించబడుతుంది.

  16. జెఫన్యా 3:9సుమారు క్రీ.పూ. 630

    “నేను ప్రజల పెదవులను శుద్ధి చేస్తాను, అప్పుడు వారంతా యెహోవా నామానికి మొరపెట్టి ఏక మనసుతో ఆయనను సేవిస్తారు.

  17. జెఫన్యా 3:10సుమారు క్రీ.పూ. 630

    చెదిరిపోయిన నన్ను ఆరాధించే నా ప్రజలు కూషు నదుల అవతల నుండి నాకు అర్పణలు తెస్తారు.

  18. జెఫన్యా 3:11సుమారు క్రీ.పూ. 630

    ఆ దినాన యెరూషలేమా, నీవు నా మీద తిరుగబడి చేసిన పనుల గురించి నీవు సిగ్గుపడవు, ఎందుకంటే నీ గర్వాన్ని బట్టి సంతోషించేవారిని నేను నీలో నుండి తొలగిస్తాను. నా పరిశుద్ధ కొండపై ఇంకెప్పుడు నీవు గర్వపడవు.

  19. జెఫన్యా 3:12సుమారు క్రీ.పూ. 630

    అయితే నేను మీలో సాత్వికులను, దీనులను వదిలివేస్తాను. ఇశ్రాయేలులో మిగిలినవారు యెహోవా నామాన్ని నమ్ముతారు.

  20. జెఫన్యా 3:13సుమారు క్రీ.పూ. 630

    ఇశ్రాయేలులో మిగిలినవారు ఏ తప్పు చేయరు; వారు అబద్ధాలు చెప్పరు. మోసపూరిత నాలుక వారి నోళ్లలో ఉండదు. వారు తిని పడుకుంటారు వారికి ఎవరి భయం ఉండదు.”

  21. జెఫన్యా 3:14సుమారు క్రీ.పూ. 630

    సీయోను కుమారీ, పాట పాడు; ఇశ్రాయేలూ, బిగ్గరగా కేకవేయి! యెరూషలేము కుమారీ, నీ పూర్ణహృదయంతో సంతోషించి ఆనందించు!

  22. జెఫన్యా 3:15సుమారు క్రీ.పూ. 630

    యెహోవా నీ శిక్షను తొలగించారు, నీ శత్రువును తిప్పికొట్టారు. ఇశ్రాయేలు రాజైన యెహోవా నీకు తోడుగా ఉన్నారు; ఇంకెప్పుడు ఏ హానికి నీవు భయపడవు.

  23. జెఫన్యా 3:16సుమారు క్రీ.పూ. 630

    ఆ రోజున వారు యెరూషలేముతో, “సీయోనూ, భయపడకు; నీ చేతులను బలహీన పడనివ్వవద్దు.

  24. జెఫన్యా 3:17సుమారు క్రీ.పూ. 630

    నీ దేవుడైన యెహోవా, రక్షించే పరాక్రమశాలి నీకు తోడుగా ఉన్నారు. ఆయన నిన్ను చూసి చాలా సంతోషిస్తారు; ఆయన తన ప్రేమను బట్టి ఆయన ఇకపై నిన్ను గద్దించరు, పాడుతూ నిన్ను చూసి సంతోషిస్తారు.”

  25. జెఫన్యా 3:18సుమారు క్రీ.పూ. 630

    “నీ నియమించబడిన పండుగలకు రాలేక దుఃఖించే వారందరినీ నేను మీ మధ్య నుండి తొలగిస్తాను. వారు మీకు భారంగా నిందగా ఉన్నారు.