- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- జెఫన్యా 1:2సుమారు క్రీ.పూ. 630
“భూమి మీద ఏమీ మిగలకుండా నేను సమస్తాన్ని తుడిచివేస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
- జెఫన్యా 1:3సుమారు క్రీ.పూ. 630
“మనుష్యులను మృగాలను తుడిచివేస్తాను; ఆకాశంలో ఎగిరే పక్షులను, సముద్రంలోని చేపలను తుడిచివేస్తాను, దుర్మార్గులను పడిపోయేలా చేసే విగ్రహాలను తుడిచివేస్తాను.” “నేను మానవజాతి అంతటిని భూమి మీద ఉండకుండా చేస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
- జెఫన్యా 1:4సుమారు క్రీ.పూ. 630
“యూదా వారి మీద, యెరూషలేములో నివసిస్తున్న వారందరి మీద నా చేయి చాపుతాను. ఈ స్థలంలో మిగిలి ఉన్న బయలు దేవత ఆరాధికులను ఆ విగ్రహాన్ని పూజించేవారి పూజారుల పేర్లతో సహా నిర్మూలిస్తాను.
- జెఫన్యా 1:5సుమారు క్రీ.పూ. 630
మిద్దెమీద ఎక్కి ఆకాశ నక్షత్ర సమూహాన్ని పూజించేవారిని, యెహోవా పేర మోలెకు దేవత పేర మొక్కి ఒట్టు వేసుకునేవారిని నేను నాశనం చేస్తాను.
- జెఫన్యా 1:6సుమారు క్రీ.పూ. 630
యెహోవాను అనుసరించకుండా ప్రక్కకు తిరిగినవారిని ఆయనను వెదకకుండ, ఆయన దగ్గర విచారణ చేయనివారిని నాశనం చేస్తాను.”
- జెఫన్యా 1:7సుమారు క్రీ.పూ. 630
ప్రభువైన యెహోవా దినం సమీపించింది, కాబట్టి ఆయన సన్నిధిలో మౌనంగా ఉండండి. యెహోవా బలి సిద్ధం చేశారు; తాను ఆహ్వానించిన వారిని ఆయన పవిత్రపరిచారు.
- జెఫన్యా 1:8సుమారు క్రీ.పూ. 630
“యెహోవా ఏర్పరచిన బలి దినాన నేను అధికారులను, రాజకుమారులను, విదేశీయుల్లా దుస్తులు వేసుకున్నవారందరిని శిక్షిస్తాను.
- జెఫన్యా 1:9సుమారు క్రీ.పూ. 630
ఆ రోజున, ఇంటి గుమ్మం దాటివచ్చి, తమ దేవతల మందిరాన్ని హింసతో మోసంతో నింపేవారందరినీ నేను శిక్షిస్తాను.
- జెఫన్యా 1:10సుమారు క్రీ.పూ. 630
“ఆ దినాన యెరూషలేములో ఉన్న చేప ద్వారం నుండి ఏడుపు, పట్టణ దిగువ భాగం నుండి రోదన, కొండల దిక్కునుండి గొప్ప నాశనం వస్తుంది, అని యెహోవా ప్రకటిస్తున్నారు.
- జెఫన్యా 1:11సుమారు క్రీ.పూ. 630
వర్తక ప్రాంతంలో నివసించేవారలారా! రోదించండి; నీ వర్తకులంతా తుడిచివేయబడతారు, వెండితో వ్యాపారం చేసేవారంతా నాశనం చేయబడతారు.
- జెఫన్యా 1:12సుమారు క్రీ.పూ. 630
ఆ కాలంలో నేను దీపాలు పట్టుకుని యెరూషలేమును సోదా చేస్తాను, మడ్డి మీద నిలిచిన ద్రాక్షరసం లాంటివారై ‘యెహోవా మేలు గాని కీడు గాని ఏదీ చేయడు’ అనుకుంటూ, ఆత్మసంతృప్తితో ఉన్నవారిని నేను శిక్షిస్తాను.
- జెఫన్యా 1:13సుమారు క్రీ.పూ. 630
వారి ధనం దోపిడి అవుతుంది, వారి ఇల్లు పాడవుతాయి. వారు ఇళ్ళు కట్టుకున్నా వాటిలో నివసించలేరు; వారు ద్రాక్షతోటలు నాటినా వాటి ద్రాక్షరసం త్రాగలేరు.”
- జెఫన్యా 1:14సుమారు క్రీ.పూ. 630
యెహోవా మహాదినం సమీపంగా ఉంది, అది ఆసన్నమై త్వరగా రాబోతుంది. యెహోవా దినాన ఏడ్పు భయంకరంగా ఉంటుంది; ఆ దినాన బలాఢ్యులు ఘోరంగా ఏడుస్తారు.
- జెఫన్యా 1:15సుమారు క్రీ.పూ. 630
ఆ దినం ఉగ్రత దినం; బాధ, వేదన కలుగుతుంది. అది నాశనం, ధ్వంసం, చీకటి అంధకారం కమ్మే దినం, మబ్బులు, గాఢాంధకారం కమ్మే రోజు.
- జెఫన్యా 1:16సుమారు క్రీ.పూ. 630
ప్రాకార పట్టణాల దగ్గర ఎత్తైన గోపురాల దగ్గర యుద్ధఘోష, బాకానాదం వినబడే రోజు.
- జెఫన్యా 1:17సుమారు క్రీ.పూ. 630
“ప్రజలు యెహోవాకు విరోధంగా పాపం చేశారు, కాబట్టి మనుష్యులందరి మీదికి నేను బాధను రప్పించగా వారు గ్రుడ్డివారిలా తడుముకుంటారు. వారి రక్తం దుమ్ములా, వారి మాంసం పెంటలా పారవేయబడుతుంది.
- జెఫన్యా 1:18సుమారు క్రీ.పూ. 630
యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని తప్పించలేవు.” ఆయన రోషాగ్ని చేత లోకమంతా దగ్దమవుతుంది, ఆయన హఠాత్తుగా భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోతున్నారు.
- జెఫన్యా 2:1సుమారు క్రీ.పూ. 630
సిగ్గుమాలిన దేశమా, సమకూడండి, మిమ్మల్ని మీరు సమకూర్చుకొండి
- జెఫన్యా 2:2సుమారు క్రీ.పూ. 630
శాసనం అమలులోకి రాకముందే ఆ దినం గాలికి కొట్టుకుపోయే పొట్టులా కనుమరుగు కాక ముందే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకముందే, యెహోవా ఉగ్రత దినం మీ మీదికి రాకముందే సమకూడండి.
- జెఫన్యా 2:3సుమారు క్రీ.పూ. 630
దేశంలోని సమస్త దీనులారా, ఆయన ఆజ్ఞను పాటించేవారలారా, యెహోవాను వెదకండి. నీతిని వెదకండి, దీనత్వాన్ని వెదకండి; యెహోవా కోప్పడే దినాన బహుశ మీకు ఆశ్రయం దొరకవచ్చు.
- జెఫన్యా 2:4సుమారు క్రీ.పూ. 630
గాజా విడిచిపెట్టబడుతుంది, అష్కెలోను పాడైపోతుంది. మధ్యాహ్న సమయంలో అష్డోదు ఖాళీ చేయబడుతుంది, ఎక్రోను పట్టణం పెళ్ళగించబడుతుంది.
- జెఫన్యా 2:5సుమారు క్రీ.పూ. 630
సముద్రతీరాన కాపురమున్న కెరేతీయులారా! మీకు శ్రమ. ఫిలిష్తీయ ప్రజలు కాపురమున్న కనాను దేశమా! యెహోవా వాక్కు నీకు వ్యతిరేకంగా ఉంది, “నీలో ఎవరూ మిగలకుండా నేను నిన్ను నాశనం చేస్తాను” అని ఆయన అంటున్నారు.
- జెఫన్యా 2:6సుమారు క్రీ.పూ. 630
సముద్రతీరాన ఉన్న దేశం, గొర్రెల కాపరులకు పచ్చికబయళ్లుగా అవుతుంది; బావులు, మందల కోసం దొడ్లు ఉంటాయి.
- జెఫన్యా 2:7సుమారు క్రీ.పూ. 630
ఆ ప్రాంతం యూదా వంశంలో మిగిలిన వారికి స్వాధీనం అవుతుంది. వారి దేవుడు యెహోవా వారి పట్ల శ్రద్ధ చూపిస్తారు, వారు బందీలుగా వెళ్లిన స్థలాల నుండి ఆయన వారిని రప్పిస్తారు. వారు ఆ ప్రాంతంలో తమ మందలు మేపుతారు. సాయంకాల సమయంలో అష్కెలోను ఇళ్ళలో పడుకుంటారు.
- జెఫన్యా 2:8సుమారు క్రీ.పూ. 630
“నా ప్రజల ప్రాంతంలోకి ప్రవేశించి వారిని దూషించిన, మోయాబు వారు చేసిన అవమానాల గురించి, అమ్మోనీయుల దూషణల గురించి నేను విన్నాను.