కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నహూము 3:2సుమారు క్రీ.పూ. 713

    కొరడాల ధ్వని, చక్రాల మోత, పరుగెడుతున్న గుర్రపు డెక్కల శబ్దం వేగంగా పరుగెడుతున్న రథాల ధ్వని వినబడుతుంది!

  2. నహూము 3:3సుమారు క్రీ.పూ. 713

    రౌతులు ముందుకు దూసుకువెళ్తుండగా, వారి ఖడ్గాలు మెరుస్తున్నాయి, వారి ఈటెలు తళతళ మెరుస్తున్నాయి! ఎంతో ప్రాణనష్టం జరుగుతుంది, మృతులు కుప్పలుగా పడి ఉన్నారు, మృతదేహాలకు లెక్క లేదు, మృతదేహాలు తగిలి ప్రజలు తడబడుతున్నారు.

  3. నహూము 3:4సుమారు క్రీ.పూ. 713

    తన మంత్రవిద్య ద్వారా ప్రజలను, తన వ్యభిచారం ద్వారా దేశాలను బానిసలుగా మార్చిన వేశ్య; మంత్రగత్తెల యజమానురాలు ఇదంతా చేసింది.

  4. నహూము 3:5సుమారు క్రీ.పూ. 713

    సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “నేను నీకు వ్యతిరేకిని, నేను నీ వస్త్రాలను నీ ముఖం మీదుగా ఎత్తి, దేశాలకు నీ నగ్నత్వాన్ని రాజ్యాలకు నీ అవమానాన్ని చూపిస్తాను.

  5. నహూము 3:6సుమారు క్రీ.పూ. 713

    నీ మీదికి హేయమైనది విసిరి, అందరి ముందు, నిన్ను అవమానిస్తాను.

  6. నహూము 3:7సుమారు క్రీ.పూ. 713

    నిన్ను చూసేవారందరూ నీ నుండి పారిపోయి, ‘నీనెవె శిథిలావస్థలో ఉంది, ఆమె కోసం ఎవరు దుఃఖిస్తారు?’ నిన్ను ఓదార్చేవారిని నేను ఎక్కడి నుండి తీసుకురాగలం?” అని అంటారు.

  7. నహూము 3:8సుమారు క్రీ.పూ. 713

    నైలు నది దగ్గర ఉండి, చుట్టూ నీళ్లు ఉన్న, తేబేసు కంటే మేలైనదానివా? ఆ నది ఆమెకు రక్షణ, ఆ నీళ్లు ఆమెకు గోడ.

  8. నహూము 3:9సుమారు క్రీ.పూ. 713

    కూషు, ఈజిప్టు ఆమెకు అపరిమితమైన బలం; పూతు, లిబియా ఆమెకు మిత్రరాజ్యాలు.

  9. నహూము 3:10సుమారు క్రీ.పూ. 713

    అయినప్పటికీ ఆమెను బందీగా తీసుకెళ్లారు. ప్రతి వీధి మూలలో దాని పసిపిల్లల్ని ముక్కలు చేశారు. దాని అధిపతుల కోసం చీట్లు వేశారు, దాని ఘనులందరిని సంకెళ్ళతో బంధించారు.

  10. నహూము 3:11సుమారు క్రీ.పూ. 713

    నీకు కూడా మత్తు ఎక్కుతుంది; నీవు వెళ్లి దాక్కుని శత్రువు నుండి కాపాడుకోడానికి ఆశ్రయాన్ని వెదకుతావు.

  11. నహూము 3:12సుమారు క్రీ.పూ. 713

    నీ కోటలన్నీ మొదట పండిన పండ్లతో ఉన్న అంజూరపు చెట్లలా ఉన్నాయి; అవి కదిలించబడినప్పుడు, తినే వారి నోటిలో అంజూరపు పండ్లు పడతాయి.

  12. నహూము 3:13సుమారు క్రీ.పూ. 713

    నీ సైన్యాన్ని చూడు, వారంతా బలహీనులు. నీ దేశపు ద్వారాలు నీ శత్రువులకు విశాలంగా తెరిచి ఉన్నాయి; అగ్ని నీ ద్వారబంధాలను కాల్చివేసింది.

  13. నహూము 3:14సుమారు క్రీ.పూ. 713

    ముట్టడివేసే సమయానికి నీళ్లు తోడుకో, నీ కోటలను బలపరచుకో! బురదలోకి దిగు, ఇటుకలు తయారుచేయడానికి బురదను త్రొక్కు, ఇటుక బట్టీలను సిద్ధపరచు.

  14. నహూము 3:15సుమారు క్రీ.పూ. 713

    అక్కడ అగ్ని నిన్ను కాల్చివేస్తుంది; ఖడ్గం నిన్ను నరికివేస్తుంది, మిడతల గుంపులా అవి నిన్ను మ్రింగివేస్తాయి. గొంగళిపురుగుల్లా విస్తరించు, మిడతలంత విస్తారంగా నీ సంఖ్యను పెంచుకో!

  15. నహూము 3:16సుమారు క్రీ.పూ. 713

    ఆకాశంలోని నక్షత్రాల కంటే మీ వ్యాపారుల సంఖ్యను ఎక్కువగా ఉన్నప్పటికీ, మిడతల్లా వారు దేశాన్ని దోచుకుని ఎగిరిపోతారు.

  16. నహూము 3:17సుమారు క్రీ.పూ. 713

    మీ కావలివారు మిడతల్లా ఉన్నారు, మీ అధికారులు మిడతల గుంపులా ఉన్నారు. అవి చలికాలంలో గోడల మీద ఉండి ఎండ రాగానే ఎగిరిపోతాయి. అవి ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు.

  17. నహూము 3:18సుమారు క్రీ.పూ. 713

    అష్షూరు రాజా, మీ కాపరులు నిద్రపోతున్నారు; మీ అధిపతులు విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్నారు. మీ ప్రజలు పర్వతాలమీద చెదరిపోయారు.

  18. నహూము 3:19సుమారు క్రీ.పూ. 713

    ఏదీ నిన్ను స్వస్థపరచలేదు; మీ గాయం ప్రాణాంతకమైనది. మీ గురించిన వార్త విన్నవారందరు మీ పతనాన్ని చూసి చప్పట్లు కొడతారు, ఎందుకంటే ప్రజలందరూ మీ అంతులేని క్రూరత్వాన్ని నీ క్రూరమైన హింసను అనుభవించిన వారే.

  19. హబక్కూకు 1:1సుమారు క్రీ.పూ. 626

    ఇది ప్రవక్తయైన హబక్కూకు ఒక దర్శనంలో పొందుకున్న ప్రవచనము.

  20. హబక్కూకు 1:2సుమారు క్రీ.పూ. 626

    యెహోవా, సహాయం కోసం నేను మొరపెట్టినా, ఎంతకాలం వినకుండా ఉంటావు? “హింస!” జరుగుతుందని నీకు మొరపెట్టినా ఎంతకాలం రక్షించకుండ ఉంటావు?

  21. హబక్కూకు 1:3సుమారు క్రీ.పూ. 626

    నన్నెందుకు దుష్టత్వాన్ని చూసేలా చేస్తున్నావు? తప్పు చేయడాన్ని నీవెందుకు సహిస్తున్నావు? నాశనం హింస నా ముందే ఉన్నాయి; కలహాలు ఘర్షణలు చెలరేగుతున్నాయి.

  22. హబక్కూకు 1:4సుమారు క్రీ.పూ. 626

    అందుకే ధర్మశాస్త్రం కుంటుపడింది, ఎప్పుడూ న్యాయం జరగడం లేదు. దుర్మార్గులు నీతిమంతులను చుట్టుముడుతున్నారు, న్యాయం చెడిపోతుంది.

  23. హబక్కూకు 1:5సుమారు క్రీ.పూ. 626

    “దేశాల వైపు గమనించి చూసి, నిర్ఘాంతపోయి ఆశ్చర్యపడండి: ఎందుకంటే మీ కాలంలో నేనొక కార్యాన్ని చేయబోతున్నాను, దాని గురించి ఎవరైనా మీకు చెప్పినా మీరు దాన్ని నమ్మరు.

  24. హబక్కూకు 1:6సుమారు క్రీ.పూ. 626

    తమవి కాని నివాస స్థలాలను ఆక్రమించుకోడానికి, భూమి అంచుల వరకు తిరిగే క్రూరులును, ఆవేశపరులునైన బబులోను ప్రజలను నేను రేపుతున్నాను.

  25. హబక్కూకు 1:7సుమారు క్రీ.పూ. 626

    వారు అత్యంత భయంకరమైన ప్రజలు; వారు తమకు ఇష్టం వచ్చినట్లు చట్టాలు చేసుకుని అధికారం చెలాయిస్తారు.