కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నహూము 1:5సుమారు క్రీ.పూ. 713

    ఆయన ముందు పర్వతాలు కంపిస్తాయి, కొండలు కరిగిపోతాయి. ఆయన సన్నిధిలో భూమి వణుకుతుంది, లోకం, దానిలో నివసించే వారందరూ వణుకుతారు.

  2. నహూము 1:6సుమారు క్రీ.పూ. 713

    ఆయన ఆగ్రహాన్ని ఎవరు తట్టుకోగలరు? ఆయన కోపాగ్నిని ఎవరు సహించగలరు? ఆయన ఉగ్రత అగ్నిలా బయటకు కుమ్మరించబడింది; ఆయన ముందు బండలు బద్దలయ్యాయి.

  3. నహూము 1:7సుమారు క్రీ.పూ. 713

    యెహోవా మంచివారు, ఆపద సమయాల్లో ఆశ్రయం ఇస్తారు. ఆయన మీద నమ్మకముంచే వారిపట్ల ఆయన శ్రద్ధ చూపుతారు.

  4. నహూము 1:8సుమారు క్రీ.పూ. 713

    అయితే పొంగిపొరలే వరదతో నీనెవెను అంతం చేస్తారు; ఆయన తన శత్రువులను చీకటిలోకి తరుముతారు.

  5. నహూము 1:9సుమారు క్రీ.పూ. 713

    వారు యెహోవాకు వ్యతిరేకంగా ఏ పన్నాగం పన్నినా, ఆపద రెండవసారి రాకుండ, ఆయన దానిని అంతం చేస్తారు.

  6. నహూము 1:10సుమారు క్రీ.పూ. 713

    వారు ముళ్ళపొదల్లో చిక్కుకొని తమ ద్రాక్షరసంతో మత్తులై ఎండిన చెత్తలా కాలిపోతారు.

  7. నహూము 1:11సుమారు క్రీ.పూ. 713

    నీనెవే, నీ నుండి యెహోవాకు వ్యతిరేకంగా చెడు పన్నాగాలు పన్నేవాడు, దుష్ట ప్రణాళికలు వేసే ఒకడు వచ్చాడు.

  8. నహూము 1:12సుమారు క్రీ.పూ. 713

    యెహోవా ఇలా చెప్తున్నారు: “వారికి ఎంతోమంది మిత్రులు ఉన్నప్పటికీ, వారు నాశనమై గతించిపోతారు. యూదా, నేను నిన్ను బాధించాను, ఇక నేను నిన్ను బాధించను.

  9. నహూము 1:13సుమారు క్రీ.పూ. 713

    నీ మెడ మీద ఉన్న వారి కాడిని నేను విరగ్గొట్టి, నీ సంకెళ్ళను తెంపివేస్తాను.”

  10. నహూము 1:14సుమారు క్రీ.పూ. 713

    నీనెవే, నీ గురించి యెహోవా ఇలా ఆజ్ఞాపించారు: “నీ పేరు పెట్టుకునే సంతతివారు ఎవరూ ఉండరు. నీ దేవతల గుడిలో ఉన్న ప్రతిమలను, విగ్రహాలను నాశనం చేస్తాను. నీవు నీచుడవు, కాబట్టి, నీ సమాధిని సిద్ధం చేస్తాను.”

  11. నహూము 1:15సుమారు క్రీ.పూ. 713

    చూడు, అక్కడ పర్వతాలమీద, సువార్తను ప్రకటించేవారి పాదాలు, వారు సమాధానాన్ని ప్రకటించేవారు! యూదా, నీ పండుగలు జరుపుకో, నీ మ్రొక్కుబడులను నెరవేర్చుకో. ఇకపై దుష్టులు నీపై దండెత్తరు; వారు పూర్తిగా నాశనం చేయబడతారు.

  12. నహూము 2:1సుమారు క్రీ.పూ. 713

    నీనెవే! దాడి చేసేవాడు నీ మీదికి వస్తున్నాడు. కోటకు కాపలా ఉండు, రహదారి మీద నిఘా వేయి, నడుము బిగించుకో, నీ బలమంతటిని కూడగట్టుకో!

  13. నహూము 2:2సుమారు క్రీ.పూ. 713

    దోపిడిదారులు యాకోబును దోచుకున్నప్పటికీ, వారి ద్రాక్షతీగెలను నాశనం చేసినప్పటికీ, యెహోవా ఇశ్రాయేలు వైభవంలా, యాకోబు వైభవాన్ని తిరిగి ఇస్తారు.

  14. నహూము 2:3సుమారు క్రీ.పూ. 713

    సైనికుల డాళ్లు ఎర్రగా ఉన్నాయి; యోధులు ఎరుపు దుస్తులు ధరించారు. వారు సిద్ధపడిన రోజున రథాలపై ఉన్న లోహం మెరుస్తుంది; సరళవృక్షంతో చేసిన ఈటెలు ఆడుతున్నాయి.

  15. నహూము 2:4సుమారు క్రీ.పూ. 713

    రథాలు వీధుల్లో దూసుకెళ్తాయి, రాజమార్గాల గుండా ఒకదాని వెనుక ఒకటి పరుగెడుతున్నాయి. అవి మండుతున్న జ్యోతుల్లా కనిపిస్తున్నాయి; అవి మెరుపులా వేగంగా వెళ్తున్నాయి.

  16. నహూము 2:5సుమారు క్రీ.పూ. 713

    నీనెవె తన అధికారులను పిలుస్తుంది, అయినా వారు తమ దారిలో తడబడతారు. వారు నగర గోడకు గుద్దుకుంటారు; రక్షణ కవచం సిద్ధం చేస్తారు.

  17. నహూము 2:6సుమారు క్రీ.పూ. 713

    నది ద్వారాలు తెరుస్తారు, రాజభవనాలు కూలిపోతాయి.

  18. నహూము 2:7సుమారు క్రీ.పూ. 713

    నీనెవెను బందీగా, తీసుకుపోవాలని శాసించబడింది. ఆమె దాసీలు పావురాల్లా మూలుగుతూ, తమ రొమ్ముల మీద కొట్టుకుంటారు.

  19. నహూము 2:8సుమారు క్రీ.పూ. 713

    నీనెవె నీరు పారుతున్న నీరు కొలనులా ఉంది. “ఆగు! ఆగు!” అని వారు ఏడుస్తారు, కానీ ఎవరూ వెనుకకు తిరుగరు.

  20. నహూము 2:9సుమారు క్రీ.పూ. 713

    వెండిని దోచుకో! బంగారాన్ని దోచుకో! ఆమె ఖజానాల్లో అంతులేని సంపదలు ఉన్నాయి!

  21. నహూము 2:10సుమారు క్రీ.పూ. 713

    ఆమె కొల్లగొట్టబడి దోచుకోబడి పాడుచేయబడుతుంది! హృదయాలు కరిగిపోతున్నాయి, మోకాళ్లు వణుకుతున్నాయి, శరీరాలు వణుకుతున్నాయి, ప్రతీ ముఖం పాలిపోతుంది.

  22. నహూము 2:11సుమారు క్రీ.పూ. 713

    సింహాల గుహ ఇప్పుడు ఎక్కడ? వాటి పిల్లల మేత స్థలం ఎక్కడ? సింహం, ఆడసింహం, సింహం కూనలు ఏ భయం లేకుండా తిరిగే చోటు ఏది?

  23. నహూము 2:12సుమారు క్రీ.పూ. 713

    సింహం తన కూనల కోసం కావలసినంత వేటాడుతూ, ఆడ సింహానికి ఆహారంగా జంతువుల మెడ కొరికి చంపుతూ, చంపిన వాటితో తన నివాస స్థలాలను, వేట మాంసంతో తన గుహలను నింపింది.

  24. నహూము 2:13సుమారు క్రీ.పూ. 713

    సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు “నేను నీకు వ్యతిరేకిని, నీ రథాల నుండి పొగ వచ్చేలా కాల్చివేస్తాను, ఖడ్గం నీ కొదమ సింహాలను చంపివేస్తుంది. నేను భూమ్మీద నీకు ఏ ఎర దొరక్కుండా చేస్తాను. నీ దూతల స్వరాలు ఇక వినబడవు.”

  25. నహూము 3:1సుమారు క్రీ.పూ. 713

    అబద్ధాలతో దోపిడీతో నిండి ఉన్న, హంతకుల పట్టణానికి శ్రమ! నిత్యం బాధితులు ఉండే, రక్తపు పట్టణానికి శ్రమ!