కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీకా 5:6సుమారు క్రీ.పూ. 710

    వీరు ఖడ్గంతో అష్షూరు దేశాన్ని, దూసిన ఖడ్గంతో నిమ్రోదు దేశాన్ని పరిపాలిస్తారు. అష్షూరు వారు దండెత్తి మన సరిహద్దులను దాటి, మన దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఆయన మనల్ని రక్షిస్తారు.

  2. మీకా 5:7సుమారు క్రీ.పూ. 710

    యాకోబు సంతానంలో మిగిలినవారు, అనేక జనాల మధ్యలో, యెహోవా కురిపించే మంచులా, ఎవరి కోసం ఎదురుచూడకుండ ఏ మనిషి మీద ఆధారపడకుండా గడ్డి మీద కురిసే వానజల్లులా ఉంటారు.

  3. మీకా 5:8సుమారు క్రీ.పూ. 710

    యాకోబు సంతానంలో మిగిలినవారు దేశాల మధ్య, అనేక జనాల మధ్య, అడవి మృగాలలో సింహంలా, గొర్రెల మందలలో దూరి, ఎవ్వరూ విడిపించలేనంతగా వాటిని త్రొక్కి చీల్చే కొదమసింహంలా ఉంటారు.

  4. మీకా 5:9సుమారు క్రీ.పూ. 710

    మీ హస్తం మీ విరోధుల మీద విజయం సాధిస్తుంది, మీ శత్రువులందరూ నాశనమవుతారు.

  5. మీకా 5:10సుమారు క్రీ.పూ. 710

    యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఆ దినాన” “నేను మీ మధ్య నుండి మీ గుర్రాలను నాశనం చేస్తాను, మీ రథాలను ధ్వంసం చేస్తాను.

  6. మీకా 5:11సుమారు క్రీ.పూ. 710

    మీ దేశంలోని పట్టణాలను నాశనం చేస్తాను మీ కోటలను పడగొడతాను,

  7. మీకా 5:12సుమారు క్రీ.పూ. 710

    మీ మధ్య మంత్రవిద్య లేకుండా నాశనం చేస్తాను ఇక ఎన్నడూ మీరు సోదె చెప్పరు.

  8. మీకా 5:13సుమారు క్రీ.పూ. 710

    నేను మీ విగ్రహాలను, మీ పవిత్ర రాళ్లను మీ మధ్య నుండి నిర్మూలిస్తాను; ఇకపై మీరు ఎన్నడు మీ చేతి పనులకు మ్రొక్కరు.

  9. మీకా 5:14సుమారు క్రీ.పూ. 710

    నేను మీ పట్టణాలను పడగొట్టినప్పుడు, మీ మధ్య నుండి అషేరా స్తంభాలను పెళ్లగిస్తాను.

  10. మీకా 5:15సుమారు క్రీ.పూ. 710

    నా మాట వినని దేశాల మీద కోపంతో, క్రోధంతో ప్రతీకారం తీసుకుంటాను.”

  11. మీకా 6:1సుమారు క్రీ.పూ. 710

    యెహోవా చెప్పేది వినండి: “మీరు నిలబడి, పర్వతాల ఎదుట నా వాదన వినిపించండి; కొండలు మీరు చెప్పేది వినాలి.

  12. మీకా 6:2సుమారు క్రీ.పూ. 710

    “పర్వతాల్లారా, యెహోవా చేసిన నేరారోపణ వినండి; భూమికి నిత్యమైన పునాదుల్లారా, ఆలకించండి. యెహోవా తన ప్రజలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తున్నారు; ఆయన ఇశ్రాయేలుపై అభియోగం మోపుతున్నారు.

  13. మీకా 6:3సుమారు క్రీ.పూ. 710

    “నా ప్రజలారా! నేను మీకేం చేశాను? నేను మిమ్మల్ని ఎలా కష్టపెట్టాను? నాకు జవాబివ్వండి.

  14. మీకా 6:4సుమారు క్రీ.పూ. 710

    నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి తీసుకువచ్చాను మిమ్మల్ని దాస్యంలో ఉంచిన ఆ దేశం నుండి విడిపించాను. మీకు దారి చూపడానికి మోషే అహరోను మిర్యాములను పంపించాను.

  15. మీకా 6:5సుమారు క్రీ.పూ. 710

    నా ప్రజలారా! మోయాబు రాజైన బాలాకు ఎలా కుట్ర చేశాడో, బెయోరు కుమారుడైన బిలాము అతనికి ఎలా జవాబిచ్చాడో జ్ఞాపకం చేసుకోండి. యెహోవా నీతి క్రియలు మీరు గ్రహించేలా షిత్తీము నుండి గిల్గాలు వరకు జరిగిన మీ ప్రయాణం జ్ఞాపకం చేసుకోండి.”

  16. మీకా 6:6సుమారు క్రీ.పూ. 710

    ఏమి తీసుకుని నేను యెహోవా సన్నిధిలోకి రావాలి, మహోన్నతుడైన దేవుని ఎదుట నమస్కరించాలి? నేను దహనబలులను, ఏడాది దూడలను ఆయన సన్నిధికి తీసుకురావాలా?

  17. మీకా 6:7సుమారు క్రీ.పూ. 710

    వేల కొలది పొట్టేళ్ళూ, పదివేల నదులంత నూనెను అర్పిస్తే యెహోవా సంతోషిస్తారా? నా అతిక్రమం కోసం నా జ్యేష్ఠ కుమారున్ని, నా పాపం కోసం నా గర్భఫలాన్ని అర్పించాలా?

  18. మీకా 6:8సుమారు క్రీ.పూ. 710

    ఓ మనుష్యుడా, ఏది మంచిదో ఆయన నీకు చూపించారు. యెహోవా నీ నుండి కోరేదేంటి? న్యాయంగా ప్రవర్తించడం, కరుణను ప్రేమించడం, వినయం కలిగి నీ దేవునితో కలిసి నడవడమే కదా.

  19. మీకా 6:9సుమారు క్రీ.పూ. 710

    వినండి! యెహోవా పట్టణానికి ఇలా ప్రకటన చేస్తున్నారు: మీ నామానికి భయపడడమే జ్ఞానం, “శిక్షను, దానిని విధించేవాని మాటలు వినండి.

  20. మీకా 6:10సుమారు క్రీ.పూ. 710

    దుర్మార్గపు ఇల్లా, మీ అక్రమ సంపాదనలు, అసహ్యకరమైన మీ తప్పుడు కొలతలు ఇంకా ఉన్నాయి కదా?

  21. మీకా 6:11సుమారు క్రీ.పూ. 710

    తప్పుడు త్రాసు, మోసపు తూనిక రాళ్లున్న సంచి కలిగిన వారిని నిర్దోషి అని నేను తీర్పు ఇవ్వాలా?

  22. మీకా 6:12సుమారు క్రీ.పూ. 710

    మీ ధనవంతులు దౌర్జన్యం చేస్తున్నారు; మీ నివాసులు అబద్ధికులు వారి నాలుకలు కపటంగా మాట్లాడతాయి.

  23. మీకా 6:13సుమారు క్రీ.పూ. 710

    కాబట్టి మీ పాపాల కారణంగా నేను మిమ్మల్ని నాశనం చేసి నిర్మూలిస్తాను.

  24. మీకా 6:14సుమారు క్రీ.పూ. 710

    మీరు తింటారు కాని తృప్తి చెందరు; మీ కడుపులు ఇంకా ఖాళీగా ఉంటాయి. మీరు కూడబెట్టుకుంటారు కాని ఏమి కాపాడుకోలేరు, ఎందుకంటే మీరు భద్రపరచుకుంది నేను ఖడ్గానికి అప్పగిస్తాను.

  25. మీకా 6:15సుమారు క్రీ.పూ. 710

    మీరు నాటుతారు కాని పంట కోయరు; మీరు ఒలీవపండ్లను త్రొక్కుతారు కాని ఆ నూనెను వాడరు; ద్రాక్షలను త్రొక్కుతారు కాని ద్రాక్షరసం త్రాగరు.