కంటెంట్‌కు వెళ్లండి

circa 930–586 BC

The Divided Kingdom

The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.

1,722 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 దినవృత్తాంతములు 30:18సుమారు క్రీ.పూ. 726

    ఎఫ్రాయిం మనష్షే, ఇశ్శాఖారు, జెబూలూను ప్రదేశాల నుండి వచ్చిన వారిలో చాలామంది తమను పవిత్రం చేసుకోలేదు. అయినా లేఖనాలకు విరుద్ధంగా వారు పస్కాను తిన్నారు. వారి కోసం హిజ్కియా ఇలా ప్రార్థన చేశాడు: “మంచివారైన యెహోవా, ప్రతి ఒక్కరిని క్షమించును గాక!

  2. 2 దినవృత్తాంతములు 30:19సుమారు క్రీ.పూ. 726

    పరిశుద్ధాలయ నియమాల ప్రకారం అపవిత్రంగా ఉన్నప్పటికీ, తమ పూర్వికుల దేవుడైన యెహోవాను వెదికితే అలాంటి వారందరినీ యెహోవా క్షమించును గాక.”

  3. 2 దినవృత్తాంతములు 30:20సుమారు క్రీ.పూ. 726

    యెహోవా హిజ్కియా ప్రార్థన విని ప్రజలను బాగుచేశారు.

  4. 2 దినవృత్తాంతములు 30:21సుమారు క్రీ.పూ. 726

    యెరూషలేములో హాజరైన ఇశ్రాయేలు వారు మహానందంతో పులియని రొట్టె పండుగ ఏడు రోజులు ఆచరించారు. ప్రతిరోజు లేవీయులు, యాజకులు యెహోవాకు పాటలు పాడారు. యెహోవాను స్తుతిస్తూ వాయిద్యాలు వాయించారు.

  5. 2 దినవృత్తాంతములు 30:22సుమారు క్రీ.పూ. 726

    యెహోవా సేవ విషయంలో మంచి తెలివితేటలు చూపిన లేవీయులందరితో హిజ్కియా ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడాడు. ఏడు రోజులు వారు తమ నియమిత భాగాలు తింటూ, సమాధానబలులు అర్పిస్తూ, తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు స్తుతులు చెల్లించారు.

  6. 2 దినవృత్తాంతములు 30:23సుమారు క్రీ.పూ. 726

    సమాజమంతా మరో ఏడు రోజులు పండుగ జరుపుకోవాలని నిశ్చయించుకొని మరో ఏడు రోజులు ఆనందంగా జరుపుకున్నారు.

  7. 2 దినవృత్తాంతములు 30:24సుమారు క్రీ.పూ. 726

    యూదా రాజైన హిజ్కియా సభకు 1,000 కోడెలను 7,000 గొర్రెలను మేకలను అందించాడు, అధికారులు వారికి 1,000 ఎద్దులను 10,000 గొర్రెలు మేకలను అందించారు. పెద్ద సంఖ్యలో యాజకులు తమను తాము పవిత్రం చేసుకున్నారు.

  8. 2 దినవృత్తాంతములు 30:25సుమారు క్రీ.పూ. 726

    అప్పుడు యాజకులు, లేవీయులు, యూదావారిలో నుండి ఇశ్రాయేలీయులలో నుండి వచ్చిన సమాజపువారందరు, ఇశ్రాయేలు దేశం నుండి వచ్చి యూదాలో నివసిస్తున్న విదేశీయులు కూడా సంతోషించారు.

  9. 2 దినవృత్తాంతములు 30:26సుమారు క్రీ.పూ. 726

    యెరూషలేమంతా ఎంతో సంతోషంగా ఉంది. ఇశ్రాయేలు రాజైన దావీదు కుమారుడైన సొలొమోను కాలం నుండి అంతవరకు యెరూషలేములో ఇలాంటిది జరుగలేదు.

  10. 2 దినవృత్తాంతములు 30:27సుమారు క్రీ.పూ. 726

    లేవీయులైన యాజకులు లేచి ప్రజలను దీవించారు. వారి ప్రార్థన దేవుడు పవిత్ర నివాసమైన పరలోకానికి చేరింది. ఆయన వారి ప్రార్థన విన్నారు.

  11. 2 దినవృత్తాంతములు 31:1సుమారు క్రీ.పూ. 726

    ఇదంతా ముగిసిన తర్వాత అక్కడున్న ఇశ్రాయేలీయులు యూదా పట్టణాలకు వెళ్లి పవిత్ర రాళ్లను పగులగొట్టి, అషేరా స్తంభాలను పడగొట్టారు. వారు యూదా, బెన్యామీను, ఎఫ్రాయిం, మనష్షేలలో ఉన్న క్షేత్రాలను బలిపీఠాలను నాశనం చేశారు. వాటన్నిటినీ నాశనం చేసిన తర్వాత, ఇశ్రాయేలీయులు తమ సొంత పట్టణాలకు వారి సొంత స్వాస్థ్యాలకు తిరిగి వచ్చారు.

  12. 2 దినవృత్తాంతములు 31:2సుమారు క్రీ.పూ. 726

    హిజ్కియా ఎవరి సేవలను వారు జరిగించడానికి యాజకులను లేవీయులను వారి వారి వరుసల ప్రకారంగా నియమించాడు; దహనబలులు సమాధానబలులు అర్పించడానికి, ఇతర సేవలు జరిగించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, యెహోవా నివాసస్థలం యొక్క ద్వారాల దగ్గర స్తుతులు చెల్లించడానికి హిజ్కియా యాజకులను లేవీయులను నియమించాడు.

  13. 2 దినవృత్తాంతములు 31:3సుమారు క్రీ.పూ. 726

    యెహోవా ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం ఉదయం, సాయంకాలం అర్పించిన వలసిన దహనబలుల కోసం, సబ్బాతు దినాలు అమావాస్య రోజులు నియమించబడిన పండుగ కాలాలు అర్పించవలసిన దహనబలుల కోసం రాజు తన ఆస్తినుండి ఇచ్చాడు.

  14. 2 దినవృత్తాంతములు 31:4సుమారు క్రీ.పూ. 726

    యాజకులు, లేవీయులు యెహోవా ధర్మశాస్త్రంలో వ్రాసియున్న సేవ శ్రద్ధగా జరిగించేటట్టు, వారికి చెందవలసిన భాగం ఇవ్వాలని రాజు యెరూషలేము నగరవాసులను ఆదేశించాడు.

  15. 2 దినవృత్తాంతములు 31:5సుమారు క్రీ.పూ. 726

    అలా ఆజ్ఞ జారీచేయడంతోనే ఇశ్రాయేలు ప్రజలు కానుకలు ధారాళంగా ఇచ్చారు. ధాన్యంలో మొదటి పంట, క్రొత్త ద్రాక్షరసంలో, నూనెలో, తేనెలో, పొలంలో పండే వాటిలో, కలిగిన వాటన్నిటిలో పదవ భాగాన్ని వారు తెచ్చారు. అది చాలా పెద్ద మొత్తము.

  16. 2 దినవృత్తాంతములు 31:6సుమారు క్రీ.పూ. 726

    యూదా పట్టణాల్లో కాపురం ఉంటున్న యూదా వారు, ఇశ్రాయేలీయులు తమ పశువుల మందలో నుండి, గొర్రెల, మేకలమందలలో నుండి పదవ భాగాన్ని తెచ్చారు. తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠించిన పవిత్ర వస్తువులలో నుండి కూడా పదవ భాగాన్ని తెచ్చారు. వాటిని కుప్పలుగా పేర్చారు.

  17. 2 దినవృత్తాంతములు 31:7సుమారు క్రీ.పూ. 726

    ఈ విధంగా చేయడం వారు మూడవ నెలలో ఆరంభించారు. ఏడవ నెలలో ముగించారు.

  18. 2 దినవృత్తాంతములు 31:8సుమారు క్రీ.పూ. 726

    హిజ్కియా, అతని అధికారులు వచ్చి ఆ కుప్పలు చూసి యెహోవాను స్తుతించి ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను దీవించారు.

  19. 2 దినవృత్తాంతములు 31:9సుమారు క్రీ.పూ. 726

    హిజ్కియా యాజకులను, లేవీయులను ఆ కుప్పలను గురించి అడిగాడు.

  20. 2 దినవృత్తాంతములు 31:10సుమారు క్రీ.పూ. 726

    సాదోకు సంతతివాడు ముఖ్య యాజకుడైన అజర్యా అతనికి ఇలా జవాబిచ్చాడు, “యెహోవా తన ప్రజలను ఆశీర్వదించారు కాబట్టి ఇంత పెద్ద మొత్తం మిగిలిపోయింది, అవే ఈ కుప్పలు.”

  21. 2 దినవృత్తాంతములు 31:11సుమారు క్రీ.పూ. 726

    అప్పుడు యెహోవా మందిరంలో గిడ్డంగులు కట్టాలని హిజ్కియా ఆదేశించాడు. వారు అలాగే చేశారు.

  22. 2 దినవృత్తాంతములు 31:12సుమారు క్రీ.పూ. 726

    ఆ తర్వాత కానుకలను, పదవ భాగాలను, ప్రతిష్ఠచేసిన వస్తువులను నమ్మకంగా లోపలికి తెచ్చారు. వాటి మీద లేవీయుడైన కొనన్యా అధికారిగా ఉన్నాడు. అతని సోదరుడైన షిమీ అతని తర్వాత స్థానంలో ఉన్నాడు.

  23. 2 దినవృత్తాంతములు 31:13సుమారు క్రీ.పూ. 726

    కొనన్యా చేతి క్రింద, అతని సోదరుడు షిమీ చేతి క్రింద తనిఖీ చేసేవారిగా యెహీయేలు అజజ్యాహు, నహతు, అశాహేలు యెరీమోతు యోజాబాదు ఎలీయేలు ఇస్మక్యాహు మహతు బెనాయా అనే వారున్నారు. వీరిని రాజైన హిజ్కియా, దేవుని మందిరానికి అధికారియైన అజర్యా నియమించారు.

  24. 2 దినవృత్తాంతములు 31:14సుమారు క్రీ.పూ. 726

    ఇమ్నా కుమారుడైన కోరే అనే లేవీయుడు తూర్పు ద్వారానికి పాలకుడు. ప్రజలు దేవునికి స్వేచ్ఛగా అర్పించిన అర్పణ మీద అతడు అధికారిగా ఉన్నాడు. ప్రజలు యెహోవాకు తెచ్చిన కానుకలను, అతిపరిశుద్ధమైనవాటిని పంచిపెట్టడం అతని పని.

  25. 2 దినవృత్తాంతములు 31:15సుమారు క్రీ.పూ. 726

    అతని చేతి క్రింద ఏదెను, మిన్యామీను, యెషూవ, షెమయా, అమర్యా, షెకన్యా అనే నమ్మకమైనవారు ఉన్నారు. యాజకుల పట్టణాల్లో తమ సాటి యాజకులని పెద్దలని పిన్నలని భేదం చూపకుండ వారి వారి వరసక్రమాల ప్రకారం వారి భాగాలను నమ్మకంగా పంచిపెట్టారు.