కంటెంట్‌కు వెళ్లండి

circa 930–586 BC

The Divided Kingdom

The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.

1,722 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 దినవృత్తాంతములు 32:20సుమారు క్రీ.పూ. 710

    రాజైన హిజ్కియా, ఆమోజు కుమారుడును, ప్రవక్తయునైన యెషయా ఈ విషయం గురించి ప్రార్థించి ఆకాశం వైపు మొరపెట్టారు.

  2. 2 దినవృత్తాంతములు 32:21సుమారు క్రీ.పూ. 710

    యెహోవా ఒక దూతను పంపారు. అతడు అష్షూరు రాజు శిబిరంలో ఉన్న పోరాట యోధులందరినీ, అధిపతులను, అధికారులందరినీ నాశనం చేశాడు. కాబట్టి అష్షూరురాజు అవమానంతో తన దేశానికి వెళ్లిపోయాడు. అతడు తన దేవుని గుడిలోకి వెళ్లినప్పుడు, అతని కుమారులలో కొందరు ఖడ్గంతో అతన్ని నరికివేశారు.

  3. 2 దినవృత్తాంతములు 32:22సుమారు క్రీ.పూ. 710

    కాబట్టి యెహోవా హిజ్కియాను, యెరూషలేము ప్రజలను అష్షూరు రాజు సన్హెరీబు చేతి నుండి ఇతరులందరి చేతిలో నుండి రక్షించారు. ఆయన అన్ని వైపుల నుండి వారిని కాపాడారు.

  4. 2 దినవృత్తాంతములు 32:23సుమారు క్రీ.పూ. 710

    చాలామంది యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు విలువైన వస్తువులు తెచ్చారు. అందువల్ల అతడు అప్పటినుండి అన్ని రాజ్యాల దృష్టిలో ఘనత పొందాడు.

  5. 2 దినవృత్తాంతములు 32:24సుమారు క్రీ.పూ. 710

    ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బుచేసి మరణానికి దగ్గరలో ఉన్నాడు. అతడు యెహోవాకు ప్రార్థించగా ఆయన అతనితో మాట్లాడి, అతనికి ఒక అద్భుతమైన సూచన ఇచ్చాడు.

  6. 2 దినవృత్తాంతములు 32:25సుమారు క్రీ.పూ. 710

    అయితే హిజ్కియా గర్వించి తన పట్ల చూపిన దయకు తగినట్లు ప్రవర్తించలేదు. కాబట్టి అతని మీదికీ యూదా యెరూషలేము మీదికీ యెహోవా కోపం వచ్చింది.

  7. 2 దినవృత్తాంతములు 32:26సుమారు క్రీ.పూ. 710

    అయితే చివరకు హిజ్కియా తన హృదయ గర్వాన్ని విడిచిపెట్టి తాను యెరూషలేము నివాసులు తమను తాము తగ్గించుకున్నారు. కాబట్టి హిజ్కియా రోజుల్లో యెహోవా కోపం ప్రజలమీదికి రాలేదు.

  8. 2 దినవృత్తాంతములు 32:27సుమారు క్రీ.పూ. 726

    హిజ్కియాకు గొప్ప సంపదలు ఘనత లభించాయి. వెండి, బంగారం, ప్రశస్తమైన రాళ్లు, సుగంధద్రవ్యాలు, డాళ్లు, అన్ని రకాల విలువైన వస్తువులు భద్రం చేయడానికి గదులు కట్టించాడు.

  9. 2 దినవృత్తాంతములు 32:28సుమారు క్రీ.పూ. 726

    ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, నూనె నిల్వ ఉంచడానికి గిడ్డంగులు కట్టించాడు. వివిధ రకాల పశువులకు శాలలు, మందలకు దొడ్లు కట్టించాడు.

  10. 2 దినవృత్తాంతములు 32:29సుమారు క్రీ.పూ. 726

    దేవుడు అతనికి అతివిస్తారమైన సంపద ఇచ్చారు కాబట్టి అతడు పట్టణాలను కూడా కట్టించుకున్నాడు. ఎన్నో గొర్రెల మందలు పశువుల మందలు అతడు సంపాదించాడు.

  11. 2 దినవృత్తాంతములు 32:30సుమారు క్రీ.పూ. 726

    ఈ హిజ్కియా గిహోను ఊట కాలువకు ఎగువన ఆనకట్ట వేయించి దావీదు పట్టణపు పడమరగా దాన్ని మళ్ళించాడు. హిజ్కియా జరిగించిన ప్రతి పనిలోను వర్ధిల్లాడు.

  12. 2 దినవృత్తాంతములు 32:31సుమారు క్రీ.పూ. 712

    అయితే, అతని దేశంలో జరిగిన అద్భుతమైన ప్రగతి గురించి తెలుసుకోవడానికి బబులోను పాలకులు అతని దగ్గరకు రాయబారులను పంపారు. అతని హృదయంలో ఉన్నదంతా తెలుసుకోవాలని దేవుడు అతన్ని పరీక్షకు విడిచిపెట్టారు.

  13. 2 దినవృత్తాంతములు 32:32సుమారు క్రీ.పూ. 726

    హిజ్కియా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, భక్తితో అతడు చేసిన పనులు ఆమోజు కుమారుడు ప్రవక్తయైన యెషయాకు కలిగిన దర్శనాల గ్రంథంలోనూ యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథంలోనూ వ్రాయబడ్డాయి.

  14. 2 దినవృత్తాంతములు 32:33సుమారు క్రీ.పూ. 726

    హిజ్కియా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. ప్రజలు దావీదు వారసుల శ్మశానభూమిలోని పై భాగంలో అతన్ని పాతిపెట్టారు. అతడు చనిపోయినప్పుడు యూదా వారంతా యెరూషలేము నివాసులంతా అతని అంత్యక్రియలు ఘనంగా జరిగించారు. అతని తర్వాత అతని కుమారుడు మనష్షే రాజయ్యాడు.

  15. 2 దినవృత్తాంతములు 33:1సుమారు క్రీ.పూ. 693

    మనష్షే రాజైనప్పుడు అతని వయస్సు పన్నెండేళ్ళు. అతడు యెరూషలేములో యాభై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు.

  16. 2 దినవృత్తాంతములు 33:2సుమారు క్రీ.పూ. 693

    అతడు యెహోవా దృష్టికి చెడుగా ప్రవర్తించాడు, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్లగొట్టిన జనాలు చేసే హేయక్రియలు చేశాడు.

  17. 2 దినవృత్తాంతములు 33:3సుమారు క్రీ.పూ. 693

    తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన క్షేత్రాలను అతడు తిరిగి కట్టించాడు. బయలు దేవతకు బలిపీఠాలను కట్టించాడు. అషేరా స్తంభాలను నిలిపాడు. అతడు ఆకాశనక్షత్రాలకు మ్రొక్కి వాటిని పూజించాడు.

  18. 2 దినవృత్తాంతములు 33:4సుమారు క్రీ.పూ. 693

    యెహోవా తన మందిరాన్ని ఉద్దేశించి, “యెరూషలేములో నా పేరు నిత్యం ఉంటుంది” అని చెప్పిన ఆ యెహోవా మందిరంలో అతడు బలిపీఠాలను కట్టించాడు.

  19. 2 దినవృత్తాంతములు 33:5సుమారు క్రీ.పూ. 693

    యెహోవా మందిరంలో ఉన్న రెండు ఆవరణాల్లో నక్షత్ర సమూహమంతటికి అతడు బలిపీఠాలు కట్టించాడు.

  20. 2 దినవృత్తాంతములు 33:6సుమారు క్రీ.పూ. 693

    అతడు తన పిల్లలను బెన్ హిన్నోము లోయలో అగ్నిలో బలి ఇచ్చాడు, భవిష్యవాణిని, చేతబడిని ఆచరించాడు, శకునాలను కోరాడు, మృతులతో మాట్లాడేవారిని ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదించాడు. అతడు యెహోవా దృష్టిలో చాలా చెడుగా ప్రవర్తిస్తూ, ఆయనకు కోపం రేపాడు.

  21. 2 దినవృత్తాంతములు 33:7సుమారు క్రీ.పూ. 693

    అతడు చెక్కించిన విగ్రహాన్ని ఆ ఆలయంలో నిలిపాడు. ఆ ఆలయం గురించి యెహోవా దావీదుకు, అతని కుమారుడైన సొలొమోనుకు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నేను ఎన్నుకున్న యెరూషలేములో, ఈ దేవాలయంలో నా పేరు నిత్యం ఉంచుతాను.

  22. 2 దినవృత్తాంతములు 33:8సుమారు క్రీ.పూ. 693

    నేను ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా ఇచ్చిన చట్టాలు, శాసనాలు, నిబంధనలను గురించి నేను వారికి ఆజ్ఞాపించినదంతా జాగ్రత్తగా వారు పాటిస్తే, నేను మీ పూర్వికులకు నియమించిన దేశంలో నుండి ఇశ్రాయేలీయుల పాదాలను తిరిగి వెళ్లనివ్వను” అని చెప్పారు.

  23. 2 దినవృత్తాంతములు 33:9సుమారు క్రీ.పూ. 693

    కానీ మనష్షే యూదా వారిని, యెరూషలేము ప్రజలను తప్పుదారి పట్టించాడు, కాబట్టి ఇశ్రాయేలీయుల ఎదుట యెహోవా నాశనం చేసిన దేశాల కంటే ఎక్కువ చెడు చేశారు.

  24. 2 దినవృత్తాంతములు 33:10సుమారు క్రీ.పూ. 693

    యెహోవా మనష్షేతో, అతని ప్రజలతో మాట్లాడారు గాని వారు పెడచెవిని పెట్టారు.

  25. 2 దినవృత్తాంతములు 33:11సుమారు క్రీ.పూ. 677

    అందువల్ల యెహోవా అష్షూరు రాజు సైన్యాధిపతులను వారి మీదికి రప్పించారు. వారు మనష్షేను బందీగా పట్టుకుని, అతని ముక్కుకు గాలం తగిలించి, ఇత్తడి గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకెళ్లారు.