- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
ఈ కాలపు వచనాలు
- యెహెజ్కేలు 40:9సుమారు క్రీ.పూ. 574
ద్వారం వాకిలి ఎనిమిది మూరలు, దాని ద్వారబంధాలు రెండు మూరలు ఉన్నాయి; ద్వారపు మంటపం మందిరం లోపలి వైపుకు ఉంది.
- యెహెజ్కేలు 40:10సుమారు క్రీ.పూ. 574
తూర్పు ద్వారం లోపల ప్రతి వైపు మూడు కాపలా గదులు ఉన్నాయి; మూడింటికి ఒకే కొలతలు ఉన్నాయి; వాటి రెండు ప్రక్కల ఉన్న ద్వారబంధాలు కూడా ఒకే కొలతలు ఉన్నాయి.
- యెహెజ్కేలు 40:11సుమారు క్రీ.పూ. 574
అప్పుడు అతడు ద్వారాల వాకిళ్లను కొలిచినప్పుడు దాని వెడల్పు పది మూరలు, పొడవు పదమూడు మూరలు ఉన్నాయి.
- యెహెజ్కేలు 40:12సుమారు క్రీ.పూ. 574
ప్రతి కాపలా గదికి ఎదురుగా ఉన్న గోడ ఎత్తు ఒక మూర ఉంది. గదులైతే రెండు ప్రక్కలా ఆరు మూరల ఎత్తు ఉన్నాయి.
- యెహెజ్కేలు 40:13సుమారు క్రీ.పూ. 574
అప్పుడతడు ఒక గది పైకప్పు నుండి మరో గది పైకప్పు వరకు ద్వారాన్ని కొలిచినప్పుడు ఇరవై అయిదు మూరల దూరం ఉంది, రెండు వాకిళ్ల మధ్య కూడా అదే కొలత ఉంది.
- యెహెజ్కేలు 40:14సుమారు క్రీ.పూ. 574
అతడు ద్వారం లోపల భాగం చుట్టూ ఉన్న గోడల వెంబడి అరవై మూరలు కొలిచాడు. ఆ కొలత ఆవరణానికి ఎదురుగా ఉన్న ప్రాంగణం వరకు.
- యెహెజ్కేలు 40:15సుమారు క్రీ.పూ. 574
బయటి గుమ్మం నుండి లోపలి గుమ్మం ద్వారం యొక్క ఆవరణం వరకు యాభై మూరలు.
- యెహెజ్కేలు 40:16సుమారు క్రీ.పూ. 574
కాపలా గదులకు ద్వారం లోపల చుట్టూ ఉన్న గోడలకు ప్రక్క గదులకు మూసి ఉన్న కిటికీలు ఉన్నాయి. గోడలోని ద్వారబంధాలు కిటికీలు ఉన్నాయి. ప్రతి ద్వారబంధాన్ని ఖర్జూరం చెట్లతో అలంకరించారు.
- యెహెజ్కేలు 40:17సుమారు క్రీ.పూ. 574
తర్వాత నన్ను బయటి ఆవరణంలోకి తీసుకువచ్చాడు. అక్కడ నేను కొన్ని గదులు, ఆవరణం చుట్టూ నిర్మించబడిన ఒక కాలిబాటను చూశాను; కాలిబాట ప్రక్కగా ముప్పై గదులు ఉన్నాయి.
- యెహెజ్కేలు 40:18సుమారు క్రీ.పూ. 574
ఈ చప్టా ద్వారం వరకు ఉండి వాటి వెడల్పుకు సమానంగా ఉంది. ఇది క్రింది చప్టా.
- యెహెజ్కేలు 40:19సుమారు క్రీ.పూ. 574
అప్పుడు అతడు దిగువ ద్వారం లోపలి నుండి లోపలి ఆవరణం బయట వరకు కొలిచినప్పుడు అది తూర్పు వైపుకు వంద మూరలు ఉత్తరం వైపుకు వంద మూరలు ఉంది.
- యెహెజ్కేలు 40:20సుమారు క్రీ.పూ. 574
అప్పుడతడు బయటి ఆవరణానికి దారితీసే ఉత్తరం గుమ్మం పొడవు వెడల్పులను కొలిచాడు.
- యెహెజ్కేలు 40:21సుమారు క్రీ.పూ. 574
దానికి రెండు వైపులా ఉన్న మూడేసి కాపలా గదులను వాటి ద్వారబంధాలను వాటి మధ్య గోడలను కొలిచినప్పుడు వాటి కొలత, మొదటి ద్వారం కొలత ఒక్కటే. పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది.
- యెహెజ్కేలు 40:22సుమారు క్రీ.పూ. 574
వాటి కిటికీలు మధ్య గోడలు, ఖర్జూరం చెట్లతో అలంకరించిన ద్వారబంధాల కొలతలన్నీ తూర్పు గుమ్మం కొలతతో సమానంగా ఉన్నాయి. పైకి ఎక్కడానికి ఏడు మెట్లున్నాయి. వాటికి ఎదురుగా దాని మధ్య గోడలు ఉన్నాయి.
- యెహెజ్కేలు 40:23సుమారు క్రీ.పూ. 574
తూర్పు ద్వారంలా ఉత్తర ద్వారానికి ఎదురుగా లోపలి ఆవరణానికి దారితీసే ఒక గుమ్మం ఉంది. ఈ ద్వారం నుండి ఆ ద్వారం వరకు దూరం కొలిచినప్పుడు అది వంద మూరలు ఉంది.
- యెహెజ్కేలు 40:24సుమారు క్రీ.పూ. 574
అప్పుడతడు నన్ను దక్షిణం వైపుకు తీసుకెళ్లగా అక్కడ దక్షిణ ద్వారం కనిపించింది. దాని ద్వారబంధాలను మధ్య గోడలను కొలిచినప్పుడు దీని కొలత ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే.
- యెహెజ్కేలు 40:25సుమారు క్రీ.పూ. 574
వాటికి ఉన్నట్లుగానే దీనికి కూడా దీని మధ్యగోడలకు చుట్టూ కిటికీలు ఉన్నాయి. ద్వారం పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది.
- యెహెజ్కేలు 40:26సుమారు క్రీ.పూ. 574
పైకి ఎక్కడానికి ఏడు మెట్లున్నాయి. వాటికి ఎదురుగా దాని మధ్య గోడలు ఉన్నాయి. రెండు వైపులా ఖర్జూరం చెట్లతో అలంకరించిన ద్వారబంధాలు ఉన్నాయి.
- యెహెజ్కేలు 40:27సుమారు క్రీ.పూ. 574
అతడు ఈ ద్వారం నుండి దక్షిణం వైపున ఉన్న బయటి ద్వారం వరకు కొలిచినప్పుడు అది వంద మూరలు ఉంది.
- యెహెజ్కేలు 40:28సుమారు క్రీ.పూ. 574
అప్పుడతడు దక్షిణ ద్వారం గుండా లోపలి ఆవరణంలోకి నన్ను తీసుకువచ్చి దక్షిణ ద్వారాన్ని కొలిచాడు; దీని కొలతలు ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే.
- యెహెజ్కేలు 40:29సుమారు క్రీ.పూ. 574
దాని కాపలా గదులు ద్వారబంధాలు వాటి మధ్య గోడల కొలతలు మిగతా వాటి కొలతలు ఒక్కటే. దానికి చుట్టూ ఉన్న మధ్యగోడలకు కిటికీలు ఉన్నాయి. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది.
- యెహెజ్కేలు 40:30సుమారు క్రీ.పూ. 574
లోపలి ఆవరణం చుట్టూ ఉన్న మధ్య గోడల పొడవు ఇరవై అయిదు మూరలు వెడల్పు అయిదు మూరలు.
- యెహెజ్కేలు 40:31సుమారు క్రీ.పూ. 574
దాని మధ్య గోడలు బయటి ఆవరణానికి ఎదురుగా ఉన్నాయి; దాని ద్వారబంధాల మీద ఖర్జూరం చెట్లతో అలంకరించారు, పైకి ఎక్కడానికి ఎనిమిది మెట్లున్నాయి.
- యెహెజ్కేలు 40:32సుమారు క్రీ.పూ. 574
అప్పుడతడు నన్ను తూర్పు వైపున ఉన్న లోపలి ఆవరణం దగ్గరికి తీసుకువచ్చి దాని ద్వారాన్ని కొలిచాడు; దాని కొలతలు ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే.
- యెహెజ్కేలు 40:33సుమారు క్రీ.పూ. 574
దాని కాపలా గదులు ద్వారబంధాలు వాటి మధ్య గోడల కొలతలు మిగతా వాటి కొలతలు ఒక్కటే. దానికి చుట్టూ ఉన్న మధ్యగోడలకు కిటికీలు ఉన్నాయి. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది.