- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
ఈ కాలపు వచనాలు
- యెహెజ్కేలు 39:13సుమారు క్రీ.పూ. 587
దేశంలోని ప్రజలందరూ వారిని పాతిపెడతారు, నేను ఘనత పొందిన ఆ రోజు వారికి ఘనత కలుగుతుంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
- యెహెజ్కేలు 39:14సుమారు క్రీ.పూ. 587
దేశాన్ని పవిత్రపరచడానికి కొంతమంది మనుష్యులను నియమిస్తారు. వారు ఇతరులతో కలిసి దేశమంతా తిరుగుతూ నేల మీద పడివున్న శవాలను పాతిపెడతారు. “ ‘ఏడు నెల తర్వాత వారు దేశాన్ని పూర్తిగా తనిఖీ చేస్తారు.
- యెహెజ్కేలు 39:15సుమారు క్రీ.పూ. 587
దేశమంతా తిరుగుతున్నప్పుడు వారిలో ఎవరికైనా మనిషి ఎముక కనబడితే పాతి పెట్టేవారు దానిని తీసుకెళ్లి హమోన్ గోగు లోయలో పాతిపెట్టే వరకు దాని దగ్గర ఒక గుర్తు ఉంచుతారు.
- యెహెజ్కేలు 39:16సుమారు క్రీ.పూ. 587
ఆ లోయ దగ్గర హమోనా అనే పేరున్న పట్టణం ఉంది. ఈ విధంగా వారు దేశాన్ని పవిత్ర పరుస్తారు.’
- యెహెజ్కేలు 39:17సుమారు క్రీ.పూ. 587
“మనుష్యకుమారుడా, ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నీవు అన్ని రకాల పక్షులకు అడవి మృగాలకు ఇలా చెప్పు: ‘నేను మీ కోసం సిద్ధపరుస్తున్న బలికి అనగా ఇశ్రాయేలు పర్వతాలమీద జరుగబోయే గొప్ప బలి దగ్గరకు నలువైపుల నుండి తరలి రండి, అక్కడ మీరు మాంసాన్ని తిని రక్తాన్ని త్రాగుతారు.
- యెహెజ్కేలు 39:18సుమారు క్రీ.పూ. 587
కోడెల రక్తం త్రాగుతారు. మీరు అక్కడ బలవంతుల మాంసాన్ని తింటారు; భూ రాజుల రక్తాన్ని బాషానులో బలిసిన పొట్టేళ్ల, గొర్రెపిల్లల, మేకల, కోడెల రక్తంలా త్రాగుతారు. అవన్నీ బాషానుకు చెందిన క్రొవ్విన జంతువులే.
- యెహెజ్కేలు 39:19సుమారు క్రీ.పూ. 587
నేను మీ కోసం సిద్ధపరుస్తున్న బలి దగ్గర కడుపునిండా ఆ క్రొవ్వును తింటారు. మత్తు ఎక్కేవరకు రక్తం త్రాగుతారు.
- యెహెజ్కేలు 39:20సుమారు క్రీ.పూ. 587
నేను ఏర్పరచిన బల్ల దగ్గర గుర్రాలను, రౌతులను బలవంతులను, సైనికులందరిని కడుపారా తింటారు.’ ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
- యెహెజ్కేలు 39:21సుమారు క్రీ.పూ. 587
“నా మహిమను ఇతర ప్రజలమధ్య చూపుతాను. ఇతర ప్రజలందరు నేను విధించిన శిక్షను నేను వారిపై ఉంచిన చేతిని చూస్తారు.
- యెహెజ్కేలు 39:22సుమారు క్రీ.పూ. 587
ఆ రోజు నుండి ఇశ్రాయేలు ప్రజలు నేనే వారి దేవుడైన యెహోవానని తెలుసుకుంటారు.
- యెహెజ్కేలు 39:23సుమారు క్రీ.పూ. 587
ఇశ్రాయేలీయులు పాపం చేసిన కారణంగా బందీలుగా వెళ్లవలసి వచ్చిందని, నా పట్ల నమ్మకద్రోహులుగా ఉన్నారు నేను వారికి నా ముఖం దాచి వేసి వారంతా కత్తివేటుకు కూలిపోయేలా వారి శత్రువులకు అప్పగించానని ఇతర ప్రజలు తెలుసుకుంటారు.
- యెహెజ్కేలు 39:24సుమారు క్రీ.పూ. 587
వారి అపవిత్రత తిరుగుబాటుతనం బట్టి నేను వారికి విరోధినై వారికి తగిన ప్రతీకారం చేశాను.
- యెహెజ్కేలు 39:25సుమారు క్రీ.పూ. 587
“కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నేను నా పరిశుద్ధ నామాన్ని బట్టి రోషం కలిగి యాకోబు సంతతిని చెరలో నుండి రప్పిస్తాను. ఇశ్రాయేలు ప్రజలందరినీ కనికరిస్తాను.
- యెహెజ్కేలు 39:26సుమారు క్రీ.పూ. 587
ఎవరినుండి భయం లేకుండా వారు తమ స్వదేశంలో క్షేమంగా నివసిస్తున్నప్పుడు వారు నాకు చేసిన నమ్మకద్రోహాన్ని, దానివల్ల వారు పొందిన అవమానాన్ని మర్చిపోతారు.
- యెహెజ్కేలు 39:27సుమారు క్రీ.పూ. 587
నేను వారిని ఇతర జనాల్లో నుండి బయటకు తీసుకువచ్చి శత్రు దేశాల నుండి వారిని సమకూర్చినప్పుడు వారి ద్వారా అనేక జనుల మధ్యలో నన్ను నేను పరిశుద్ధునిగా కనుపరచుకుంటాను.
- యెహెజ్కేలు 39:28సుమారు క్రీ.పూ. 587
నేను వారిని ఇతర ప్రజల మధ్యలోనికి బందీలుగా పంపి, ఎవరినీ విడిచిపెట్టకుండా వారందరిని వారి స్వదేశానికి సమకూరుస్తాను. అప్పుడు వారు నేనే యెహోవానని వారి దేవుడనని తెలుసుకుంటారు.
- యెహెజ్కేలు 39:29సుమారు క్రీ.పూ. 587
అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను, కాబట్టి వారికిక నా ముఖాన్ని దాచను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.”
- యెహెజ్కేలు 40:1సుమారు క్రీ.పూ. 574
అప్పటికి మేము బందీలుగా వచ్చిన ఇరవై అయిదవ సంవత్సరంలోని మొదటి నెల పదవ రోజున, అనగా పట్టణం నాశనమైన పద్నాలుగవ సంవత్సరంలో ఆ రోజునే యెహోవా హస్తం నా మీదికి వచ్చి ఆయన నన్ను పట్టణానికి తీసుకెళ్లారు.
- యెహెజ్కేలు 40:2సుమారు క్రీ.పూ. 574
దేవుని దర్శనంలో ఆయన నన్ను ఇశ్రాయేలు దేశానికి తీసుకెళ్లి చాలా ఎత్తైన పర్వతం మీద నన్ను ఉంచారు. దాని మీద దక్షిణం వైపున ఒక పట్టణం లాంటిది నాకు కనిపించింది.
- యెహెజ్కేలు 40:3సుమారు క్రీ.పూ. 574
ఆయన నన్ను అక్కడికి తీసుకెళ్లగా మెరుస్తున్న ఇత్తడిలా ఉన్న ఒక వ్యక్తిని నేను చూశాను. అతడు తన చేతిలో నార దారం, కొలిచే కర్ర పట్టుకుని పట్టణ ద్వారంలో నిలబడి ఉన్నాడు.
- యెహెజ్కేలు 40:4సుమారు క్రీ.పూ. 574
ఆ వ్యక్తి నాతో ఇలా అన్నాడు, “మనుష్యకుమారుడా, నేను నీకు చూపించబోయే ప్రతిదాన్ని జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని మనస్సులో ఉంచుకో. వాటిని నీకు చూపించడానికే నేను నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను. నీవు చూసిన ప్రతిదాన్ని ఇశ్రాయేలీయులకు తెలియజేయి.”
- యెహెజ్కేలు 40:5సుమారు క్రీ.పూ. 574
ఆలయ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టిన గోడను నేను చూశాను. ఆ వ్యక్తి చేతిలోని ఉన్న కొలిచే కడ్డీ పొడవు ఆరు మూరలు, ఒక్కొక్కటి ఒక మూర ఒక బెత్తెడు వెడల్పు ఉంది. అతడు గోడను కొలిచాడు; అది ఆ కొలిచే కడ్డీ అంత వెడల్పు, ఆ కడ్డీ అంత ఎత్తు ఉంది.
- యెహెజ్కేలు 40:6సుమారు క్రీ.పూ. 574
అప్పుడతడు తూర్పు వైపున ఉన్న ద్వారం దగ్గరికి వెళ్లి దాని మెట్లెక్కి దాని గుమ్మపు గడపను కొలిచినప్పుడు అది ఒక కొలిచే కర్ర పొడవు ఉంది.
- యెహెజ్కేలు 40:7సుమారు క్రీ.పూ. 574
కావలివారి గది పొడవు వెడల్పులు కొలిచే కర్రంత ఉన్నాయి. ఆ గదులకు మధ్య ఉన్న గోడలు అయిదు మూరల మందంగా ఉన్నాయి. ద్వారం ప్రక్క నుండి ఆలయానికి ఎదురుగా ఉన్న మంటపానికి ఒక కొలిచే కర్ర లోతు ఉంది.
- యెహెజ్కేలు 40:8సుమారు క్రీ.పూ. 574
అతడు ద్వారపు మంటపం మధ్య కొలిచాడు;