- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
ఈ కాలపు వచనాలు
- యెహెజ్కేలు 37:14సుమారు క్రీ.పూ. 587
మీరు బ్రతికేలా మీలో నా ఆత్మను ఉంచి మీ స్వదేశంలో మీరు నివసించేలా చేస్తాను. అప్పుడు యెహోవానైన నేను మాట ఇచ్చాను, దానిని నెరవేర్చానని మీరు తెలుసుకుంటారని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
- యెహెజ్కేలు 37:15సుమారు క్రీ.పూ. 587
యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
- యెహెజ్కేలు 37:16సుమారు క్రీ.పూ. 587
“మనుష్యకుమారుడా, ఒక కర్ర తీసుకుని, దానిపై ‘ఇది యూదాకు, అతని సహచరులైన ఇశ్రాయేలీయులకు చెందినది’ అని వ్రాయి, తర్వాత మరొక కర్ర తీసుకుని, దానిపై, ‘యోసేపు (అంటే, ఎఫ్రాయిం) అతని సహచరులైన ఇశ్రాయేలీయులందరికి చెందినది’ అని వ్రాయి.
- యెహెజ్కేలు 37:17సుమారు క్రీ.పూ. 587
ఆ రెండింటిని నీ చేతిలో ఒకే కర్రలా ఉండేలా జతచేయి.
- యెహెజ్కేలు 37:18సుమారు క్రీ.పూ. 587
“ ‘దీని భావమేమిటో మాకు చెప్పవా?’ అని నీ ప్రజలు నిన్ను అడిగినప్పుడు,
- యెహెజ్కేలు 37:19సుమారు క్రీ.పూ. 587
వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేను ఎఫ్రాయిం చేతిలో ఉన్న యోసేపు కర్రను, అతనితో సంబంధం ఉన్న ఇశ్రాయేలీయుల గోత్రాలను తీసుకుని యూదా కర్రకు జతచేయబోతున్నాను. నేను వాటిని ఒకే కర్రలా చేస్తాను, అవి నా చేతిలో ఒకటిగా అవుతాయి.’
- యెహెజ్కేలు 37:20సుమారు క్రీ.పూ. 587
నీవు ఏ కర్రల మీదైతే వ్రాసావో వాటిని వారి కళ్లముందు పట్టుకుని,
- యెహెజ్కేలు 37:21సుమారు క్రీ.పూ. 587
వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలీయులు చెదరిపోయిన దేశాల నుండి నేను వారిని బయటకి తీసుకువస్తాను. వారిని చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి సమకూర్చి వారి స్వదేశానికి తిరిగి రప్పిస్తాను.
- యెహెజ్కేలు 37:22సుమారు క్రీ.పూ. 587
వారు ఇక ఎన్నటికీ రెండు జాతులుగా గాని రెండు రాజ్యాలుగా విడిపోకుండ నేను వారిని ఇశ్రాయేలు పర్వతాలమీద, ఒకే దేశంగా చేస్తాను. వారందరికి ఒకే రాజు ఉంటాడు.
- యెహెజ్కేలు 37:23సుమారు క్రీ.పూ. 587
వారు ఇకపై తమ విగ్రహాలతో, నీచమైన చిత్రాలతో గాని వారి నేరాలతో గాని తమను తాము అపవిత్రం చేసుకోరు, ఎందుకంటే వారు పాపాలు చేస్తూ నివసించిన ప్రతి స్థలం నుండి నేను వారిని రక్షించి, వారిని శుద్ధి చేస్తాను. వారు నా ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను.
- యెహెజ్కేలు 37:24సుమారు క్రీ.పూ. 587
“ ‘నా సేవకుడైన దావీదు వారికి రాజు. వారందరికి ఒకే కాపరి ఉంటాడు. వారు నా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ, నా శాసనాలను పాటించే విషయంలో వారు జాగ్రత్త వహిస్తారు.
- యెహెజ్కేలు 37:25సుమారు క్రీ.పూ. 587
నా సేవకుడైన యాకోబుకు నేనిచ్చిన దేశంలో అనగా మీ పూర్వికులు నివసించిన దేశంలో వారు నివసిస్తారు. వారు వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు అక్కడ నిత్యం నివసిస్తారు. నా సేవకుడైన దావీదు వారికి శాశ్వతమైన అధిపతిగా ఉంటాడు.
- యెహెజ్కేలు 37:26సుమారు క్రీ.పూ. 587
నేను వారితో సమాధాన ఒప్పందాన్ని చేస్తాను; అది నాకు వారికి మధ్య శాశ్వత నిబంధనగా ఉంటుంది. నేను వారిని స్థిరపరచి వారిని విస్తరింపచేస్తాను, వారి మధ్య నా పరిశుద్ధాలయాన్ని ఎప్పటికీ ఉండేలా చేస్తాను.
- యెహెజ్కేలు 37:27సుమారు క్రీ.పూ. 587
నా నివాసస్థలం వారితో ఉంటుంది; నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు.
- యెహెజ్కేలు 37:28సుమారు క్రీ.పూ. 587
వారి మధ్య నా పరిశుద్ధాలయం నిత్యం ఉండడం చూసి ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచే యెహోవాను నేనే అని ఇతర ప్రజలు తెలుసుకుంటారు.’ ”
- యెహెజ్కేలు 38:1సుమారు క్రీ.పూ. 587
యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
- యెహెజ్కేలు 38:2సుమారు క్రీ.పూ. 587
“మనుష్యకుమారుడా, మాగోగు దేశానికి చెందిన గోగు వైపు అనగా మెషెకుకు తుబాలుకు రోషుకు అధిపతియైన వానివైపు నీ ముఖాన్ని త్రిప్పి, అతనికి వ్యతిరేకంగా ప్రవచించి ఇలా చెప్పుమని ఆజ్ఞాపించింది:
- యెహెజ్కేలు 38:3సుమారు క్రీ.పూ. 587
ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మెషెకుకు తుబాలుకు ముఖ్య అధిపతియైన గోగూ, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను.
- యెహెజ్కేలు 38:4సుమారు క్రీ.పూ. 587
నేను నిన్ను వెనక్కు త్రిప్పి, నీ దవడలకు కొక్కేలు తగిలించి, నిన్ను సైన్యమంతటితో పాటు, నీ గుర్రాలను, సంపూర్ణ సాయుధులైన నీ రౌతులను, పెద్ద చిన్న డాళ్లను ధరించి, వారంతా ఖడ్గాలు ఆడిస్తూ పట్టుకున్న యోధులను బయటకు తీసుకువస్తాను.
- యెహెజ్కేలు 38:5సుమారు క్రీ.పూ. 587
పర్షియా, కూషు, పూతు వారందరు డాళ్లు, శిరస్త్రాణాలు ధరించి వారితో పాటు వస్తారు.
- యెహెజ్కేలు 38:6సుమారు క్రీ.పూ. 587
అలాగే గోమెరు అతని సైన్యం, ఉత్తరాన దూరంగా ఉన్న తోగర్మా అతని సైన్యం, ఇంకా అనేక జాతులవారు నీతో వస్తారు.
- యెహెజ్కేలు 38:7సుమారు క్రీ.పూ. 587
“ ‘సిద్ధంగా ఉండు; నీవు నీతో పాటు చేరిన సమూహమంతటితో కలిసి సిద్ధంగా ఉండు, నీవే వారికి నాయకునిగా ఉండు.
- యెహెజ్కేలు 38:8సుమారు క్రీ.పూ. 587
చాలా రోజుల తర్వాత నీవు పిలువబడతావు. రాబోయే సంవత్సరాల్లో మీరు యుద్ధం నుండి కోలుకున్న దేశం మీద, చాలాకాలంగా నిర్జనంగా ఉన్న ఇశ్రాయేలు పర్వతాలమీద నివసించడానికి వివిధ దేశాల నుండి సమకూర్చబడి దాని ప్రజల మీద దాడి చేస్తారు. వారు చెదిరిపోయిన దేశాల నుండి సమకూర్చబడి ఇప్పుడు నిర్భయంగా జీవిస్తున్నారు.
- యెహెజ్కేలు 38:9సుమారు క్రీ.పూ. 587
అయితే నీవు గాలి తుఫాను వచ్చినట్లుగా వస్తావు; నీవు, నీ సైన్యం, నీ పక్షాన ఉన్న అనేకమంది ప్రజలు కలిసి దేశం మీద మేఘంలా కమ్ముకుంటారు.
- యెహెజ్కేలు 38:10సుమారు క్రీ.పూ. 587
“ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఆ రోజు నీ మనస్సులో చెడు ఆలోచనలు పుడతాయి. నీవు చెడు పన్నాగం పన్ని,