కంటెంట్‌కు వెళ్లండి

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహెజ్కేలు 36:2సుమారు క్రీ.పూ. 587

    ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ఆహా! ప్రాచీనమైన ఉన్నత స్థలాలు మా స్వాధీనమయ్యాయి” అని శత్రువులు నీ గురించి అన్నారు.’

  2. యెహెజ్కేలు 36:3సుమారు క్రీ.పూ. 587

    కాబట్టి ప్రవచించి ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు మిగిలిన ఇతర దేశాల వారికి స్వాధీనమయ్యేలా, ప్రజల మధ్యలో మీరు ఎగతాళిచేయబడి హేళన చెందేలా, వారు అన్ని వైపుల నుండి మిమ్మల్ని ధ్వంసం చేసి అణచివేశారు.

  3. యెహెజ్కేలు 36:4సుమారు క్రీ.పూ. 587

    కాబట్టి, ఇశ్రాయేలు పర్వతాల్లారా, ప్రభువైన యెహోవా మాట వినండి: ప్రభువైన యెహోవా పర్వతాలతో, కొండలతో, కనుమలతో, లోయలతో, నిర్జనమైన శిథిలాలతో, మీ చుట్టూ ఉన్న మిగిలిన ఇతర జాతులచేత దోచుకోబడి అపహాస్యం చేయబడిన పాడైన పట్టణాలతో మాట్లాడుతూ,

  4. యెహెజ్కేలు 36:5సుమారు క్రీ.పూ. 587

    ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: చుట్టూ ఉన్న దేశాలు, ఎదోము వారంతా ద్వేషంతో, ఆనందంతో ఉప్పొంగుతూ నా దేశాన్ని దోపుడు సొమ్ముగా తీసుకున్నారు, కాబట్టి నేను తీవ్రమైన రోషంలో నేను వారికి వ్యతిరేకంగా మాట్లాడాను.’

  5. యెహెజ్కేలు 36:6సుమారు క్రీ.పూ. 587

    కాబట్టి ఇశ్రాయేలు దేశం గురించి ప్రవచించి పర్వతాలతో, కొండలతో, కనుమలతో, లోయలతో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు దేశాల మధ్య అవమానించబడ్డారు, కాబట్టి నేను నా రోషంలో ఉగ్రతలో మాట్లాడుతున్నాను.

  6. యెహెజ్కేలు 36:7సుమారు క్రీ.పూ. 587

    కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నీ చుట్టూ ఉన్న దేశాలు కూడా అవమానం పాలవుతాయని నా చేయి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను.

  7. యెహెజ్కేలు 36:8సుమారు క్రీ.పూ. 587

    “ ‘కాని ఇశ్రాయేలు పర్వతాల్లారా, త్వరలో నా ప్రజలైన ఇశ్రాయేలీయులు తమ ఇంటికి తిరిగి వస్తారు, కాబట్టి మీరు కొమ్మలుగా ఎదిగి వారి కోసం పండ్లు ఇవ్వాలి.

  8. యెహెజ్కేలు 36:9సుమారు క్రీ.పూ. 587

    నేను మీ పక్షంగా ఉండి మీమీద దయ చూపిస్తాను; మీరు దున్నబడి, విత్తబడతారు.

  9. యెహెజ్కేలు 36:10సుమారు క్రీ.పూ. 587

    మీమీద మనుష్యజాతిని అంటే ఇశ్రాయేలీయులందరు నివసించేలా చేస్తాను. నా పట్టణాల్లో మళ్ళీ నివాసులు ఉంటారు, శిథిలాలు మళ్ళీ కట్టబడతాయి.

  10. యెహెజ్కేలు 36:11సుమారు క్రీ.పూ. 587

    మీమీద నివసించే మనుష్యులను పశువులను నేను విస్తరింపజేస్తాను, వారు ఫలించి విస్తరిస్తారు. గతంలో ఉన్నట్లే మీమీద ప్రజలను స్థిరపరచి, అంతకుముందు కన్నా అధికంగా అభివృద్ధి కలిగిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.

  11. యెహెజ్కేలు 36:12సుమారు క్రీ.పూ. 587

    నేను మనుష్యజాతిని అనగా నా ప్రజలైన ఇశ్రాయేలీయులను మీమీద నివసించేలా చేస్తాను. వారు మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటారు, మీరు వారికి స్వాస్థ్యంగా ఉంటారు; ఇక ఎప్పటికీ మీరు వారిని పిల్లలు లేనివారిగా చేయరు.

  12. యెహెజ్కేలు 36:13సుమారు క్రీ.పూ. 587

    “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “నీవు మనుష్యులను చంపుతూ, నీ దేశంలో పిల్లలు లేకుండా చేస్తున్నావు” అని కొందరు నీ గురించి చెప్పుకుంటున్నారు.

  13. యెహెజ్కేలు 36:14సుమారు క్రీ.పూ. 587

    కాబట్టి నీవు ఇకపై మనుష్యులను చంపవు, నీ దేశాన్ని పిల్లలు లేనిదిగా చేయవు, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  14. యెహెజ్కేలు 36:15సుమారు క్రీ.పూ. 587

    ఇకపై మిమ్మల్ని దేశాలు దూషించడం మీరు వినరు, ఇకపై మిమ్మల్ని జనాంగాల అవమానించవు, మీ జాతిని పతనమయ్యేలా చేయరు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”

  15. యెహెజ్కేలు 36:16సుమారు క్రీ.పూ. 587

    మరోసారి యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  16. యెహెజ్కేలు 36:17సుమారు క్రీ.పూ. 587

    “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయులు తమ స్వదేశంలో నివసిస్తున్నప్పుడు, వారు తమ ప్రవర్తనతో తమ చేష్టలతో దానిని అపవిత్రం చేశారు. నా దృష్టికి వారి ప్రవర్తన నెలసరిలో ఉన్న స్త్రీ అపవిత్రతలా ఉంది.

  17. యెహెజ్కేలు 36:18సుమారు క్రీ.పూ. 587

    కాబట్టి వారు దేశంలో రక్తం చిందించినందుకు, తమ విగ్రహాలతో దానిని అపవిత్రం చేసినందుకు నేను వారిపై నా ఉగ్రత క్రుమ్మరించాను.

  18. యెహెజ్కేలు 36:19సుమారు క్రీ.పూ. 587

    నేను వారిని జాతుల మధ్యకు చెదరగొట్టాను, వారు వివిధ దేశాలకు చెదిరిపోయారు; వారి ప్రవర్తన, వారి చేష్టలకు తగినట్టుగా నేను వారికి తీర్పు తీర్చాను.

  19. యెహెజ్కేలు 36:20సుమారు క్రీ.పూ. 587

    వారు ఏ దేశాల మధ్యకు వెళ్లినా నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేశారు, ఎలా అంటే, ‘వారు యెహోవా ప్రజలే అయినప్పటికీ వారు ఆయన దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది’ అని వారి గురించి చెప్తారు.

  20. యెహెజ్కేలు 36:21సుమారు క్రీ.పూ. 587

    నా పరిశుద్ధ నామం గురించి నాకు చింత ఉంది, దానిని ఇశ్రాయేలీయులు తాము వెళ్లిన దేశాల్లో అపవిత్రం చేశారు.

  21. యెహెజ్కేలు 36:22సుమారు క్రీ.పూ. 587

    “కాబట్టి ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలు ప్రజలారా, నేను చేయబోయేది మీ కోసం కాదు, ఇతర ప్రజల్లో మీ వలన అవమానానికి గురియైన నా పరిశుద్ధ నామం కోసమే చేస్తాను.

  22. యెహెజ్కేలు 36:23సుమారు క్రీ.పూ. 587

    మీ మూలంగా ఇతర ప్రజల్లో అవమానపరచబడుతున్న నా గొప్ప పేరు ఎంత పరిశుద్ధమైనదో మీకు చూపిస్తాను. వారి కళ్ళెదుట మీ ద్వారా నా పరిశుద్ధతను వెల్లడి చేసినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  23. యెహెజ్కేలు 36:24సుమారు క్రీ.పూ. 587

    “ ‘నేను మిమ్మల్ని ఇతర ప్రజల్లో నుండి బయటకు తీసుకువస్తాను; దేశాలన్నిటి నుండి మిమ్మల్ని సమకూర్చి మీ స్వదేశానికి తిరిగి తీసుకువస్తాను.

  24. యెహెజ్కేలు 36:25సుమారు క్రీ.పూ. 587

    నేను మీమీద శుద్ధ జలాన్ని చిలకరిస్తాను, మీరు శుద్ధులవుతారు; మీ విగ్రహాల నుండి, అపవిత్రతలన్నిటి నుండి నేను మిమ్మల్ని శుద్ధి చేస్తాను.

  25. యెహెజ్కేలు 36:26సుమారు క్రీ.పూ. 587

    నేను మీకు నూతన హృదయాన్ని ఇచ్చి, మీలో నూతనమైన ఆత్మను ఉంచుతాను. మీలోని రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను పెడతాను.