- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
ఈ కాలపు వచనాలు
- యెహెజ్కేలు 34:23సుమారు క్రీ.పూ. 587
వాటిని మేపడానికి నేను నా సేవకుడైన దావీదును కాపరిగా నియమిస్తాను. అతడు వాటిని కాస్తాడు; అతడు వాటిని మేపుతాడు, వాటికి కాపరిగా ఉంటాడు.
- యెహెజ్కేలు 34:24సుమారు క్రీ.పూ. 587
యెహోవానైన నేను వారికి దేవునిగా ఉంటాను, నా సేవకుడైన దావీదు వాటికి అధిపతిగా ఉంటాడు. యెహోవానైన నేను మాట చెప్పాను.
- యెహెజ్కేలు 34:25సుమారు క్రీ.పూ. 587
“ ‘అవి అరణ్యంలో క్షేమంగా నివసించి అడవుల్లో పడుకునేలా నేను వాటితో సమాధాన ఒడంబడిక చేసుకుంటాను, అలాగే అడవి మృగాలను దేశంలో లేకుండా చేస్తాను.
- యెహెజ్కేలు 34:26సుమారు క్రీ.పూ. 587
నేను వాటిని నా పర్వతం చుట్టుప్రక్కల ఉన్న స్థలాలను ఆశీర్వాదకరంగా చేస్తాను. రుతువుల ప్రకారం జల్లులు కురిపిస్తాను; ఆశీర్వాదకరమైన జల్లులు కురుస్తాయి.
- యెహెజ్కేలు 34:27సుమారు క్రీ.పూ. 587
చెట్లు తమ పండ్లను ఇస్తాయి, భూమి తన పంటను ఇస్తుంది; ప్రజలు తమ దేశంలో క్షేమంగా ఉంటారు. నేను వారి కాడిని విరగ్గొట్టి, వారిని బానిసలుగా చేసుకున్న వారి చేతుల్లో నుండి వారిని విడిపించినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.
- యెహెజ్కేలు 34:28సుమారు క్రీ.పూ. 587
వారు ఇకపై దేశాలచేత దోచుకోబడరు, అడవి మృగాలకు వారు ఆహారం కారు. వారు క్షేమంగా జీవిస్తారు, వారిని ఎవరూ భయపెట్టరు.
- యెహెజ్కేలు 34:29సుమారు క్రీ.పూ. 587
పంటలకు ప్రసిద్ధి చెందిన దేశాన్ని నేను వారికి ఇస్తాను, వారు ఇకపై దేశంలో కరువు బారిన పడరు, ఇతర దేశాల మధ్య అవమానాన్ని భరించే అవసరం ఉండదు.
- యెహెజ్కేలు 34:30సుమారు క్రీ.పూ. 587
అప్పుడు నేను వారి దేవుడనైన యెహోవాను వారికి తోడుగా ఉన్నానని, ఇశ్రాయేలీయులైన వారు నా ప్రజలని వారు తెలుసుకుంటారు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
- యెహెజ్కేలు 34:31సుమారు క్రీ.పూ. 587
మీరు నా గొర్రెలు, నా పచ్చిక బయళ్లలోని గొర్రెలు, మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
- యెహెజ్కేలు 35:1సుమారు క్రీ.పూ. 587
యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
- యెహెజ్కేలు 35:2సుమారు క్రీ.పూ. 587
“మనుష్యకుమారుడా, శేయీరు పర్వతం వైపు నీ ముఖం త్రిప్పి దానికి వ్యతిరేకంగా ప్రవచించి ఇలా చెప్పు:
- యెహెజ్కేలు 35:3సుమారు క్రీ.పూ. 587
‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఓ శేయీరు పర్వతమా, నేను నీకు వ్యతిరేకిని, నేను నీకు వ్యతిరేకంగా నా చేయి చాపి నిన్ను నిర్జనమై వ్యర్థంగా మిగిలిపోయేలా చేస్తాను.
- యెహెజ్కేలు 35:4సుమారు క్రీ.పూ. 587
నీ పట్టణాలను శిథిలాలుగా మారుస్తాను; నీవు నిర్జనమవుతావు. అప్పుడు నేనే యెహోవానని తెలుసుకుంటావు.
- యెహెజ్కేలు 35:5సుమారు క్రీ.పూ. 587
“ ‘నీవు ఇశ్రాయేలీయుల పట్ల ఎప్పుడూ పగతో ఉండి, వారి విపత్తు సమయంలో, వారి శిక్ష ముగింపుకు చేరుకున్న సమయంలో నీవు వారిని ఖడ్గానికి అప్పగించావు,
- యెహెజ్కేలు 35:6సుమారు క్రీ.పూ. 587
కాబట్టి నా జీవం తోడు, నేను నిన్ను రక్తపాతానికి అప్పగిస్తాను, అది నీ వెంటపడుతుంది. నీవు రక్తపాతాన్ని ద్వేషించలేదు కాబట్టి, రక్తపాతం నిన్ను వెంటాడుతుందని యెహోవా ప్రకటిస్తున్నారు.
- యెహెజ్కేలు 35:7సుమారు క్రీ.పూ. 587
నేను శేయీరు పర్వతాన్ని నిర్జనంగా వ్యర్థంగా చేస్తాను, వస్తూ వెళ్తూ ఉండేవారు అక్కడ లేకుండా చేస్తాను.
- యెహెజ్కేలు 35:8సుమారు క్రీ.పూ. 587
నీ పర్వతాలను శవాలతో నింపుతాను; ఖడ్గం చేత చచ్చినవారు నీ కొండలమీద, నీ లోయల్లో, నీ వాగుల్లో పడి ఉంటారు.
- యెహెజ్కేలు 35:9సుమారు క్రీ.పూ. 587
నేను నిన్ను శాశ్వతంగా పాడైపోయేలా చేస్తాను; నీ పట్టణాల్లో ఎవరూ నివసించరు. అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.
- యెహెజ్కేలు 35:10సుమారు క్రీ.పూ. 587
“ ‘యెహోవానైన నేను అక్కడ ఉన్నప్పటికీ, “ఈ రెండు జాతులు, దేశాలు మనవే; మనం వాటిని స్వాధీనం చేసుకుందాం” అని మీరు చెప్పారు.
- యెహెజ్కేలు 35:11సుమారు క్రీ.పూ. 587
కాబట్టి నా జీవం తోడు నీవు వారిమీద ద్వేషంతో నీవు వారికి చూపించిన కోపం అసూయను బట్టి నేను నీ పట్ల తగిన రీతిగా వ్యవహరిస్తాను. నేను నిన్ను శిక్షించినప్పుడు నన్ను నేను వారికి పరిచయం చేసుకుంటాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
- యెహెజ్కేలు 35:12సుమారు క్రీ.పూ. 587
“అవి పాడుచేయబడ్డాయి, మనకు ఆహారంగా ఇవ్వబడ్డాయి” అని నీవు ఇశ్రాయేలు పర్వతాలను దూషించిన మాటలన్నీ యెహోవానైన నేను విన్నానని నీవు తెలుసుకుంటావు.
- యెహెజ్కేలు 35:13సుమారు క్రీ.పూ. 587
మీరు ప్రగల్భాలు పలుకుతూ, ఏమాత్రం అదుపు లేకుండా నాకు వ్యతిరేకంగా మాట్లాడారు, అదంతా నేను విన్నాను.
- యెహెజ్కేలు 35:14సుమారు క్రీ.పూ. 587
ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఒకవైపు లోకమంతా సంతోషిస్తూ ఉంటే, నేను నిన్ను నాశనం చేస్తాను.
- యెహెజ్కేలు 35:15సుమారు క్రీ.పూ. 587
ఇశ్రాయేలీయుల వారసత్వం పాడైపోయినప్పుడు నీవు సంతోషించావు, కాబట్టి నేను నీతో అలాగే వ్యవహరిస్తాను. శేయీరు పర్వతమా, నీవూ నీతో పాటు ఎదోము అంతా పాడైపోతుంది. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”
- యెహెజ్కేలు 36:1సుమారు క్రీ.పూ. 587
“మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు పర్వతాల గురించి ప్రవచించి ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు పర్వతాల్లారా, యెహోవా మాట వినండి.