కంటెంట్‌కు వెళ్లండి

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహెజ్కేలు 33:31సుమారు క్రీ.పూ. 587

    నా ప్రజలు ఎప్పుడూ వచ్చినట్లే నీ దగ్గరకు వచ్చి మీ మాటలు వినడానికి నీ ఎదుట కూర్చుంటారు, కాని వారు వాటిని పాటించరు. వారి నోళ్ళు ప్రేమ గురించి మాట్లాడతాయి, కాని వారి హృదయాలు అన్యాయపు లాభాన్ని ఆశిస్తాయి.

  2. యెహెజ్కేలు 33:32సుమారు క్రీ.పూ. 587

    నిజానికి, వారికి నీవు అందమైన స్వరంతో ప్రేమ పాటలు పాడే వాడివి, వాయిద్యాన్ని చక్కగా వాయించే వాడివి తప్ప మరేమీ కాదు, ఎందుకంటే వారు మీ మాటలు వింటారు కానీ వాటిని పాటించరు.

  3. యెహెజ్కేలు 33:33సుమారు క్రీ.పూ. 587

    “ఇవన్నీ నిజమైతే! ఖచ్చితంగా నిజమవుతాయి. అప్పుడు తమ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకుంటారు.”

  4. యెహెజ్కేలు 34:1సుమారు క్రీ.పూ. 587

    యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  5. యెహెజ్కేలు 34:2సుమారు క్రీ.పూ. 587

    “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు కాపరులకు వ్యతిరేకంగా ప్రవచించు; ప్రవచించి వారితో ఇలా చెప్పు: ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మిమ్మల్ని మీరు మాత్రమే చూసుకునే ఇశ్రాయేలు కాపరులారా మీకు శ్రమ! కాపరులు తమ గొర్రెల మందను జాగ్రత్తగా చూసుకోవాలి కదా?

  6. యెహెజ్కేలు 34:3సుమారు క్రీ.పూ. 587

    మీరు క్రొవ్విన వాటిని తింటారు, ఉన్నితో బట్టలు వేసుకుంటారు, ఎంపిక చేసిన జంతువులను వధిస్తారు, కానీ మందను మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోరు.

  7. యెహెజ్కేలు 34:4సుమారు క్రీ.పూ. 587

    మీరు బలహీనమైన వాటిని బలపరచలేదు, రోగంతో ఉన్నవాటిని స్వస్థపరచలేదు, గాయపడిన వాటికి కట్టు కట్టలేదు. మీరు దారితప్పిన వాటిని తిరిగి తీసుకురాలేదు, తప్పిపోయిన వాటికోసం వెదకలేదు. మీరు వాటిని కఠినంగా, క్రూరంగా పాలించారు.

  8. యెహెజ్కేలు 34:5సుమారు క్రీ.పూ. 587

    కాపరి లేనందున అవి చెదిరిపోయాయి, అవి చెదిరిపోయి అడవి జంతువులన్నిటికి ఆహారమయ్యాయి.

  9. యెహెజ్కేలు 34:6సుమారు క్రీ.పూ. 587

    నా గొర్రెలు పర్వతాలన్నిటి మీదా, ఎత్తైన ప్రతి కొండ మీదా సంచరించాయి. వారు భూమి అంతటా చెల్లాచెదురుగా ఉన్నారు, ఎవరూ వాటిని వెదకలేదు, వాటికోసం చూడలేదు.

  10. యెహెజ్కేలు 34:7సుమారు క్రీ.పూ. 587

    “ ‘కాబట్టి కాపరులారా, యెహోవా మాట వినండి:

  11. యెహెజ్కేలు 34:8సుమారు క్రీ.పూ. 587

    నా జీవం తోడు కాపరులు లేని నా గొర్రెలు దోచుకోబడ్డాయి, అడవి మృగాలన్నిటికి ఆహారమయ్యాయి, నా కాపరులు నా గొర్రెలను వెదకలేదు, నా గొర్రెలను జాగ్రత్తగా చూసుకోకుండా వారు తమ గురించి మాత్రమే చూసుకున్నారు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  12. యెహెజ్కేలు 34:9సుమారు క్రీ.పూ. 587

    కాబట్టి కాపరులారా, యెహోవా మాట వినండి:

  13. యెహెజ్కేలు 34:10సుమారు క్రీ.పూ. 587

    ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేను ఆ కాపరులకు వ్యతిరేకిని, నా మంద గురించి నేను వారిని లెక్క అడుగుతాను. గొర్రెల కాపరులు ఇకపై మందను మేపకుండ నేను వారిని తొలగిస్తాను, తద్వార వారు తమను తాము పోషించుకోలేరు. వారి నోటి నుండి నేను నా మందను విడిపిస్తాను, ఇకపై అది వారికి ఆహారంగా ఉండదు.

  14. యెహెజ్కేలు 34:11సుమారు క్రీ.పూ. 587

    “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేనే స్వయంగా నా గొర్రెలను వెదికి వాటిని చూసుకుంటాను.

  15. యెహెజ్కేలు 34:12సుమారు క్రీ.పూ. 587

    గొర్రెల కాపరి చెదిరిపోయిన తన మందను వెదకినట్లు నేను నా గొర్రెలను వెదకుతాను. మేఘాలు కమ్మి చీకటిగా ఉన్న రోజున, అవి ఎక్కడెక్కడ చెదిరిపోయాయో అక్కడ నుండి నేను వాటిని రక్షిస్తాను.

  16. యెహెజ్కేలు 34:13సుమారు క్రీ.పూ. 587

    నేను వాటిని ఇతర జాతుల నుండి బయటకు రప్పించి, దేశాల నుండి వాటిని సమకూర్చి, నేను వాటిని వారి స్వదేశానికి తీసుకువస్తాను. నేను వాటిని ఇశ్రాయేలు పర్వతాలమీద, కనుమలలో, దేశంలోని అన్ని నివాస స్థలాల్లో మేపుతాను.

  17. యెహెజ్కేలు 34:14సుమారు క్రీ.పూ. 587

    మంచి పచ్చిక ఉన్నచోట వాటిని మేపుతాను, ఇశ్రాయేలీయుల ఎత్తైన పర్వతాలు వాటికి పచ్చికబయళ్లుగా ఉంటాయి. అందులో అవి హాయిగా పడుకుంటాయి. ఇశ్రాయేలు పర్వతాలమీద శ్రేష్ఠమైన మేత ఉన్న స్థలాల్లో అవి మేస్తాయి.

  18. యెహెజ్కేలు 34:15సుమారు క్రీ.పూ. 587

    నేనే స్వయంగా నా గొర్రెలను మేపి వాటిని పడుకోబెడతాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  19. యెహెజ్కేలు 34:16సుమారు క్రీ.పూ. 587

    నేను తప్పిపోయిన వాటిని వెదికి, తోలివేసిన వాటిని తిరిగి తోలుకు వస్తాను. నేను గాయపడిన వాటికి కట్టుకడతాను. బలహీనమైన వాటిని బలపరుస్తాను. క్రొవ్విన వాటిని బలిసిన వాటిని నాశనం చేస్తాను. మందను న్యాయంగా మేపుతాను.

  20. యెహెజ్కేలు 34:17సుమారు క్రీ.పూ. 587

    “ ‘నా మందా, నీ గురించి ప్రభువైన యెహోవా చెప్తున్నారు: నేను గొర్రెకు మధ్య, పొట్టేళ్లకు మేకపోతులకూ మధ్య తీర్పు తీరుస్తాను.

  21. యెహెజ్కేలు 34:18సుమారు క్రీ.పూ. 587

    మంచి పచ్చికబయళ్లను తింటే సరిపోదా? మిగిలిన పచ్చికబయళ్లను కాళ్లతో త్రొక్కాలా? మీరూ స్వచ్ఛమైన నీరు త్రాగితే సరిపోదా? మీ పాదాలతో మిగిలిన నీటిని బురదమయం చేయాలా?

  22. యెహెజ్కేలు 34:19సుమారు క్రీ.పూ. 587

    మీ కాళ్లతో త్రొక్కింది నా మంద మేయాలా? కాళ్లతో బురద చేసిన నీళ్లను నా గొర్రెలు త్రాగాలా?

  23. యెహెజ్కేలు 34:20సుమారు క్రీ.పూ. 587

    “ ‘ప్రభువైన యెహోవా వారికి చెబుతున్న మాట ఇదే: క్రొవ్విన గొర్రెలకు బక్కచిక్కిన గొర్రెలకు మధ్య నేనే తీర్పు తీరుస్తాను.

  24. యెహెజ్కేలు 34:21సుమారు క్రీ.పూ. 587

    మీరు కొమ్ములతో పొడుస్తూ, భుజంతో ప్రక్కలతో తోస్తూ బలహీనమైన గొర్రెలన్నిటిని తరిమికొడుతున్నారు కాబట్టి,

  25. యెహెజ్కేలు 34:22సుమారు క్రీ.పూ. 587

    నేను నా గొర్రెలను కాపాడతాను, ఇకపై అవి దోచుకోబడవు. గొర్రెకు మధ్య నేను తీర్పు తీరుస్తాను.