కంటెంట్‌కు వెళ్లండి

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహెజ్కేలు 38:11సుమారు క్రీ.పూ. 587

    దురాలోచనతో నీవు ఇలా అంటావు, “నేను గోడలులేని గ్రామాలున్న దేశంపై దాడి చేస్తాను; గోడలు ద్వారాలు అడ్డగడియలు లేని దేశంలో ప్రశాంతంగా క్షేమంగా నివసిస్తున్న ప్రజల మీద దాడి చేస్తాను.

  2. యెహెజ్కేలు 38:12సుమారు క్రీ.పూ. 587

    వారిని దోచుకుని సొమ్ము కొల్లగొట్టడానికి, గతంలో పాడుబడి ఉన్నా మళ్ళీ నివాసం ఉంటున్న స్థలాల మీద దాడి చేయడానికి, ఇతర జనాల్లో నుండి సమకూర్చబడి సమృద్ధిగా పశువులు సరుకులు కలిగి భూమి మధ్యభాగంలో నివసించే ప్రజలమీదికి వెళ్తాను.”

  3. యెహెజ్కేలు 38:13సుమారు క్రీ.పూ. 587

    షేబ వారు, దేదాను వారు, తర్షీషు వర్తకులు, దాని కొదమ సింహాల్లాంటి వారందరు నిన్ను చూసి, “దోచుకోవడానికి వచ్చావా? వెండి బంగారాలను, పశువులను సరుకులను కొల్లగొట్టుకొని తీసుకెళ్లడానికి, దోచుకోవడానికి నీ సైన్యాన్ని సమకూర్చుకున్నావా?” అని అంటారు.’

  4. యెహెజ్కేలు 38:14సుమారు క్రీ.పూ. 587

    “మనుష్యకుమారుడా, గోగుకు వ్యతిరేకంగా ప్రవచించి ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నా ప్రజలైన ఇశ్రాయేలీయులు నిర్భయంగా నివసించే రోజున నీవు ఇది గమనించలేదా?

  5. యెహెజ్కేలు 38:15సుమారు క్రీ.పూ. 587

    ఉత్తరాన దూరంగా ఉన్న నీ స్థలంలో నుండి నీవూ, నీతో పాటు అనేక జనాలు గుర్రాలపై స్వారీ చేస్తూ చాలా గొప్ప సైన్యంగా వస్తారు.

  6. యెహెజ్కేలు 38:16సుమారు క్రీ.పూ. 587

    దేశాన్ని మేఘం క్రమ్మినట్లు మీరంతా నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీదికి వస్తారు. రాబోయే రోజుల్లో అది జరుగుతుంది; నీ ద్వారా ఇతర ప్రజల ఎదుట నేను పరిశుద్ధుడను అని కనుపరిచినప్పుడు వారు నన్ను తెలుసుకునేలా గోగూ, నేను నిన్ను నా దేశం మీదికి రప్పిస్తాను.

  7. యెహెజ్కేలు 38:17సుమారు క్రీ.పూ. 587

    “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: పూర్వకాలంలో నా సేవకులైన ఇశ్రాయేలు ప్రవక్తల ద్వారా నేను మాట్లాడింది నీ గురించే. నేను నిన్ను వారికి వ్యతిరేకంగా తీసుకువస్తానని అనేక సంవత్సరాలుగా వారు ప్రవచించారు.

  8. యెహెజ్కేలు 38:18సుమారు క్రీ.పూ. 587

    ఆ రోజున గోగు ఇశ్రాయేలు దేశం మీదికి దండెత్తి వచ్చేటప్పుడు నా కోపం తీవ్రంగా ఉంటుంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

  9. యెహెజ్కేలు 38:19సుమారు క్రీ.పూ. 587

    నేను రోషంతో, కోపోద్రేకంతో ఏమని ప్రకటించానంటే, ఆ సమయంలో ఇశ్రాయేలు దేశంలో భయంకరమైన భూకంపం వస్తుంది.

  10. యెహెజ్కేలు 38:20సుమారు క్రీ.పూ. 587

    అప్పుడు సముద్రంలోని చేపలు, ఆకాశపక్షులు, భూజంతువులు, భూమి మీద ప్రాకే పురుగులు, భూమి మీద ఉన్న మనుష్యులందరు నా ఎదుట వణుకుతారు. పర్వతాలు కూలిపోతాయి, కొండచరియలు విరిగిపోతాయి, ప్రతి గోడ నేలమట్టం అవుతుంది.

  11. యెహెజ్కేలు 38:21సుమారు క్రీ.పూ. 587

    నేను నా పర్వతాలన్నిటిపైన గోగుకు వ్యతిరేకంగా ఖడ్గాన్ని రప్పిస్తాను. ప్రతి ఒక్కని ఖడ్గం తన సోదరుని మీద పడుతుంది అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  12. యెహెజ్కేలు 38:22సుమారు క్రీ.పూ. 587

    తెగులుతో రక్తపాతంతో అతని మీద తీర్పు తీరుస్తాను; అతనిపై అతని సైన్యం మీద అతనితో పాటు ఉన్న అనేక దేశాలపై నేను కుండపోత వర్షాన్ని, వడగండ్లను అగ్నిగంధకాలను కురిపిస్తాను.

  13. యెహెజ్కేలు 38:23సుమారు క్రీ.పూ. 587

    నేను నా గొప్పతనాన్ని, పరిశుద్ధతను చూపించి ఇతర జనుల ఎదుట నన్ను నేను ప్రత్యక్ష్యపరచుకుంటాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’

  14. యెహెజ్కేలు 39:1సుమారు క్రీ.పూ. 587

    “మనుష్యకుమారుడా, గోగు గురించి ప్రవచించి ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మెషెకుకు తుబాలుకు అధిపతియైన గోగూ, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను.

  15. యెహెజ్కేలు 39:2సుమారు క్రీ.పూ. 587

    నేను నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి, దూరంగా ఉన్న ఉత్తర దిక్కునుండి రప్పించి ఇశ్రాయేలు పర్వతాల మీదికి పంపుతాను.

  16. యెహెజ్కేలు 39:3సుమారు క్రీ.పూ. 587

    అప్పుడు నేను నీ ఎడమచేతి నుండి నీ విల్లు, నీ కుడిచేతి నుండి నీ బాణాలు క్రింద పడేలా చేస్తాను.

  17. యెహెజ్కేలు 39:4సుమారు క్రీ.పూ. 587

    నీవు నీ సైన్యం నీతో పాటు ఉన్న అనేక జనులు ఇశ్రాయేలు పర్వతాలమీద కూలిపోతారు. వేటాడే రకరకాల క్రూర పక్షులకు, అడవి మృగాలకు నిన్ను ఆహారంగా చేస్తాను.

  18. యెహెజ్కేలు 39:5సుమారు క్రీ.పూ. 587

    నీవు పొలంలో పడిపోతావు; నేను మాట ఇచ్చాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  19. యెహెజ్కేలు 39:6సుమారు క్రీ.పూ. 587

    నేను మాగోగు మీదికి, సముద్ర తీర ప్రాంతాల్లో క్షేమంగా నివసించేవారి మీదికి అగ్ని పంపిస్తాను, అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.

  20. యెహెజ్కేలు 39:7సుమారు క్రీ.పూ. 587

    “ ‘నా పరిశుద్ధ నామాన్ని నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య వెల్లడి చేస్తాను. ఇకపై నా పరిశుద్ధ నామం అవమానానికి గురి కానివ్వను, అప్పుడు నేనే యెహోవానని ఇశ్రాయేలులో పరిశుద్ధుడనని ఇతర దేశాల ప్రజలు తెలుసుకుంటారు.

  21. యెహెజ్కేలు 39:8సుమారు క్రీ.పూ. 587

    ఆ సమయం వస్తుంది! అది ఖచ్చితంగా జరుగుతుంది అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  22. యెహెజ్కేలు 39:9సుమారు క్రీ.పూ. 587

    “ ‘అప్పుడు ఇశ్రాయేలు పట్టణాల్లో నివసించేవారు బయటకు వెళ్లి, ఆ ఆయుధాలను చిన్న పెద్ద డాళ్లు, విల్లులు బాణాలు, యుద్ధ దండాలు ఈటెలను తీసుకుని పొయ్యిలో ఇంధనంగా ఉపయోగిస్తారు. ఏడేళ్లపాటు వాటిని ఇంధనంగా వినియోగించనున్నారు.

  23. యెహెజ్కేలు 39:10సుమారు క్రీ.పూ. 587

    వారు పొలంలో కట్టెలు ఏరుకోకుండా అడవిలో చెట్లు నరకకుండా ఆయుధాలను పొయ్యిలో కాలుస్తారు. వారు తమను దోచుకున్న వారిని తిరిగి దోచుకుంటారు. తమను కొల్లగొట్టిన వారిని తిరిగి కొల్లగొడతారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

  24. యెహెజ్కేలు 39:11సుమారు క్రీ.పూ. 587

    “ ‘ఆ రోజున నేను సముద్రానికి తూర్పుగా ప్రయాణికులు వెళ్లే లోయలో ఇశ్రాయేలు దేశంలో గోగును, అల్లరిమూకలను పాతిపెట్టడానికి స్థలం ఇస్తాను. అక్కడ గోగును, అతని అల్లరిమూకలన్ని పాతిపెట్టిన తర్వాత ప్రయాణికులు వెళ్లడానికి వీలుపడదు. ఆ లోయకు హమోన్ గోగు అనే పేరు వస్తుంది.

  25. యెహెజ్కేలు 39:12సుమారు క్రీ.పూ. 587

    “ ‘దేశాన్ని పవిత్రపరచడానికి ఇశ్రాయేలీయులు ఏడు నెలలు వారిని పాతిపెడతారు.