కంటెంట్‌కు వెళ్లండి

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహెజ్కేలు 40:34సుమారు క్రీ.పూ. 574

    దాని ద్వారబంధాలు బయట ఆవరణానికి ఎదురుగా ఉన్నాయి; దాని ద్వారబంధాల మీద రెండు వైపులా ఖర్జూరం చెట్లతో అలంకరించారు, పైకి ఎక్కడానికి ఎనిమిది మెట్లున్నాయి.

  2. యెహెజ్కేలు 40:35సుమారు క్రీ.పూ. 574

    అప్పుడతడు నన్ను ఉత్తర ద్వారం దగ్గరికి తీసుకువచ్చి దానిని కొలిచాడు; దాని కొలతలు ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే.

  3. యెహెజ్కేలు 40:36సుమారు క్రీ.పూ. 574

    అలాగే కాపలా గదులు ద్వారబంధాలు వాటి మధ్య గోడల కొలతలు మిగతా వాటి కొలతలు ఒక్కటే. దానికి చుట్టూ ఉన్న మధ్యగోడలకు కిటికీలు ఉన్నాయి. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది.

  4. యెహెజ్కేలు 40:37సుమారు క్రీ.పూ. 574

    దాని ద్వారబంధాలు బయట ఆవరణానికి ఎదురుగా ఉన్నాయి; దాని ద్వారబంధాల మీద రెండు వైపులా ఖర్జూరం చెట్లతో అలంకరించారు, పైకి ఎక్కడానికి ఎనిమిది మెట్లున్నాయి.

  5. యెహెజ్కేలు 40:38సుమారు క్రీ.పూ. 574

    ప్రతి లోపలి ద్వారంలో మంటపం దగ్గర ద్వారం ఉన్న గది ఉంది, ఇక్కడ దహనబలుల మాంసం కడుగుతారు.

  6. యెహెజ్కేలు 40:39సుమారు క్రీ.పూ. 574

    ద్వారపు మంటపానికి రెండు వైపులా రెండు బల్లలు ఉన్నాయి; వాటిపై దహనబలులు, పాపపరిహార బలులు, అపరాధబలులను వధిస్తారు.

  7. యెహెజ్కేలు 40:40సుమారు క్రీ.పూ. 574

    ద్వారం యొక్క బయటి మంటపం దగ్గర ఉత్తర ద్వారం మెట్లు ఎక్కే చోట రెండు బల్లలు, మెట్లకు అవతలి వైపు రెండు బల్లలు ఉన్నాయి.

  8. యెహెజ్కేలు 40:41సుమారు క్రీ.పూ. 574

    ద్వారానికి ఒక్కో వైపు నాలుగు చొప్పున రెండు వైపులా ఎనిమిది బల్లలు ఉన్నాయి; వాటిపై బలులు వధిస్తారు.

  9. యెహెజ్కేలు 40:42సుమారు క్రీ.పూ. 574

    అంతే కాకుండా దహనబలుల కోసం చెక్కిన రాతితో చేసిన నాలుగు బల్లలు ఉన్నాయి; వాటి పొడవు మూరన్నర వెడల్పు మూరన్నర ఎత్తు ఒక మూర. దహనబలులు ఇతర బలులు వధించడానికి ఉపయోగించే పాత్రలు వాటిపై ఉంచారు.

  10. యెహెజ్కేలు 40:43సుమారు క్రీ.పూ. 574

    చుట్టూ ఉన్న గోడకు ఒక బెత్తెడు పొడవు ఉన్న మేకులు తగిలించి ఉన్నాయి. అర్పణల మాంసాన్ని ఆ బల్లల మీద ఉంచుతారు.

  11. యెహెజ్కేలు 40:44సుమారు క్రీ.పూ. 574

    లోపలి ఆవరణంలో లోపలి ద్వారం బయట రెండు గదులు ఉన్నాయి. ఒకటి ఉత్తర ద్వారం దగ్గర దక్షిణం వైపుగా ఒకటి, తూర్పు ద్వారం దగ్గర ఉత్తరం వైపుగా ఒకటి ఉన్నాయి.

  12. యెహెజ్కేలు 40:45సుమారు క్రీ.పూ. 574

    అతడు నాతో ఇలా అన్నాడు, “దక్షిణం వైపుగా ఉన్న గది మందిరాన్ని కాపలా కాసే యాజకుల కోసము.

  13. యెహెజ్కేలు 40:46సుమారు క్రీ.పూ. 574

    ఉత్తరం వైపుగా ఉన్న గది బలిపీఠాన్ని కాపలా కాసే యాజకుల కోసము. లేవీయులలో సాదోకు వారసులైన వీరు యెహోవా సన్నిధిలో సేవ చేయటానికి వస్తారు.”

  14. యెహెజ్కేలు 40:47సుమారు క్రీ.పూ. 574

    అప్పుడతడు ఆవరణాన్ని కొలిచినప్పుడు అది చతురస్రాకారంలో ఉండి పొడవు వెడల్పులు వంద మూరలు ఉన్నాయి. ఆలయానికి ఎదురుగా బలిపీఠం ఉంది.

  15. యెహెజ్కేలు 40:48సుమారు క్రీ.పూ. 574

    అప్పుడతడు ఆలయ మంటపంలోకి నన్ను తీసుకెళ్లి దాని స్తంభాలను కొలిచాడు; రెండు వైపులా వాటి వెడల్పు అయిదు మూరలు. దాని ద్వారం వెడల్పు పద్నాలుగు మూరలు ఉంది, దానికి రెండు వైపులా ఉన్న గోడ మందం మూడు మూరలు.

  16. యెహెజ్కేలు 40:49సుమారు క్రీ.పూ. 574

    మంటపం పొడవు ఇరవై మూరలు. వెడల్పు పన్నెండు మూరలు. దానిపైకి ఎక్కడానికి మెట్లున్నాయి, దాని ద్వారబంధాలకు రెండు వైపులా స్తంభాలు ఉన్నాయి.

  17. యెహెజ్కేలు 41:1సుమారు క్రీ.పూ. 574

    అప్పుడతడు నన్ను ప్రధాన ప్రాంగణంలోనికి తీసుకువచ్చి ద్వారబంధాలను కొలిచాడు, వాటి వెడల్పు రెండు వైపులా ఆరు మూరలు ఉంది.

  18. యెహెజ్కేలు 41:2సుమారు క్రీ.పూ. 574

    వాకిలి వెడల్పు పది మూరలు. దానికి రెండు వైపులా ఉన్న గోడల వెడల్పు అయిదు మూరలు ఉంది. దానిని కొలిచినప్పుడు పొడవు నలభై మూరలు వెడల్పు ఇరవై మూరలు ఉంది.

  19. యెహెజ్కేలు 41:3సుమారు క్రీ.పూ. 574

    అప్పుడతడు గర్భాలయం లోపలికి వెళ్లి వాకిలి ద్వారబంధాలను కొలిచినప్పుడు వాటి వెడల్పు రెండు మూరలు, వాకిలి ఆరు మూరలు దానికి రెండు వైపులా ఉన్న గోడల వెడల్పు ఏడు మూరలు ఉంది.

  20. యెహెజ్కేలు 41:4సుమారు క్రీ.పూ. 574

    అతడు గర్భాలయాన్ని కొలిచినప్పుడు దాని పొడవు ఇరవై మూరలు, ప్రధాన మందిరానికి దానికి మధ్య ఉన్న వెడల్పు ఇరవై మూరలు ఉంది. “అది అతి పరిశుద్ధ స్థలం” అని అతడు నాతో చెప్పాడు.

  21. యెహెజ్కేలు 41:5సుమారు క్రీ.పూ. 574

    తర్వాత అతడు ఆలయ గోడలను కొలిచినప్పుడు వాటి మందం ఆరు మూరలు, ఆలయానికి రెండు వైపులా ఉన్న గదుల వెడల్పు నాలుగేసి మూరల ఉంది.

  22. యెహెజ్కేలు 41:6సుమారు క్రీ.పూ. 574

    ప్రక్కన ఉన్న ఆ గదులకు మూడంతస్థులు ఉన్నాయి. ప్రతి అంతస్తులో ముప్పై గదులున్నాయి. అవి ఆలయ గోడకు ఆనుకుని ఉండకుండా ప్రక్క గదులకు ఆనుకుని ఉండేలా ఆలయ గోడ చుట్టూ వరసగా ఉన్నాయి.

  23. యెహెజ్కేలు 41:7సుమారు క్రీ.పూ. 574

    మందిరం చుట్టూ ఉన్న ఈ ప్రక్క గదులు పైకి వెళ్లే కొలది వాటి వెడల్పు ఎక్కువవుతుంది. మందిరం చుట్టూ ఉన్న గదులు క్రింది నుండి పైకి వెళ్లే కొలది ఎక్కువ వెడల్పుగా ఉండేలా అవి నిర్మించబడ్డాయి. క్రింది అంతస్తు నుండి మధ్య అంతస్తు ద్వారా పై అంతస్తు వరకు మెట్లు ఉన్నాయి.

  24. యెహెజ్కేలు 41:8సుమారు క్రీ.పూ. 574

    నేను చూసినప్పుడు మందిరం చుట్టూ మేడ గదులకు ఎత్తుగా ఉన్న పునాది కనిపించింది. దాని పొడవు కొలిచే కర్రంత అనగా ఆరు మూరలు.

  25. యెహెజ్కేలు 41:9సుమారు క్రీ.పూ. 574

    ఆ ప్రక్క గదుల బయటి గోడల మందం అయిదు మూరలు. ఆలయపు ప్రక్క గదుల మధ్యలో ఖాళీ స్థలం ఉంది.