- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
ఈ కాలపు వచనాలు
- యెహెజ్కేలు 41:10సుమారు క్రీ.పూ. 574
ఆలయానికి అన్ని వైపుల నుండి ఇరవై మూరల దూరంలో యాజకుల గదులు ఉన్నాయి.
- యెహెజ్కేలు 41:11సుమారు క్రీ.పూ. 574
ఆ ప్రక్క గదుల గుమ్మాలు ఖాళీ స్థలం వైపుకు ఉన్నాయి. ఒక గుమ్మం ఉత్తరం వైపుకు మరొకటి దక్షిణం వైపుకు ఉంది. ఖాళీ స్థలం అన్ని వైపుల నుండి అయిదు మూరలు ఉంది.
- యెహెజ్కేలు 41:12సుమారు క్రీ.పూ. 574
పడమటి వైపున ఆలయ ఆవరణానికి ఎదురుగా ఉన్న భవనం డెబ్బై మూరల వెడల్పుతో ఉంది. దాని గోడ మందం అయిదు మూరలు పొడవు తొంభై మూరలు.
- యెహెజ్కేలు 41:13సుమారు క్రీ.పూ. 574
తర్వాత అతడు మందిరాన్ని కొలిచినప్పుడు అది వంద మూరల పొడవు ఉంది. ఆలయ ఆవరణాన్ని దానికి ఎదురుగా ఉన్న భవనాన్ని దాని గోడలను కొలిచినప్పుడు అది వంద మూరలు ఉంది.
- యెహెజ్కేలు 41:14సుమారు క్రీ.పూ. 574
తూర్పు వైపు ఆలయ ప్రాంగణాన్ని ఆలయ ముందు భాగాన్ని కొలిచినప్పుడు అది వంద మూరలు ఉంది.
- యెహెజ్కేలు 41:15సుమారు క్రీ.పూ. 574
మందిరం వెనుక భాగంలో ఉన్న ఆవరణానికి ఎదురుగా ఉన్న భవనాన్ని దానికి రెండు వైపులా ఉన్న వసారాలను అతడు కొలిచినప్పుడు వంద మూరలు ఉంది. ప్రధాన ప్రాంగణం, గర్భాలయం, ఆవరణానికి ఎదురుగా ఉన్న మంటపం,
- యెహెజ్కేలు 41:16సుమారు క్రీ.పూ. 574
గడపలు, కమ్ములు ఉన్న కిటికీలు మూడు అంతస్తుల చుట్టూ ఉన్న వసారాలను చెక్కతో కప్పి ఉన్న గడపలతో సహా ప్రతిదాన్ని అతడు కొలిచాడు. నేల, కిటికీల వరకు ఉన్న గోడ, కిటికీలు చెక్కతో కప్పబడి ఉన్నాయి.
- యెహెజ్కేలు 41:17సుమారు క్రీ.పూ. 574
వాకిలికి పై భాగంలో గర్భాలయం బయట, లోపల ఉన్న గోడలు, మందిరం చుట్టూ ఉన్న బయటి గోడలు లోపలి గోడలు కొలత ప్రకారం కట్టి ఉన్నాయి.
- యెహెజ్కేలు 41:18సుమారు క్రీ.పూ. 574
వాటిపై కెరూబులు ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి. రెండు కెరూబుల మధ్యలో ఒక ఖర్జూరపు చెట్టు ఉంది. ప్రతి కెరూబుకు రెండు ముఖాలు ఉన్నాయి.
- యెహెజ్కేలు 41:19సుమారు క్రీ.పూ. 574
ఒక ప్రక్కన ఉన్న ఖర్జూరపు చెట్టు వైపు నరుని ముఖం, రెండవ ప్రక్కన ఉన్న ఖర్జూరపు చెట్టు వైపు సింహ ముఖం ఉన్నాయి. ఆలయమంతా అవి చెక్కి ఉన్నాయి.
- యెహెజ్కేలు 41:20సుమారు క్రీ.పూ. 574
నేల నుండి వాకిలి పైభాగం వరకు ప్రధాన మందిరపు గోడలపై కెరూబులు ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి.
- యెహెజ్కేలు 41:21సుమారు క్రీ.పూ. 574
ప్రధాన మందిరానికి ద్వారబంధం దీర్ఘచతురస్రాకారంలో ఉంది. అతి పరిశుద్ధ స్థలం ద్వారబంధం కూడా అలాంటిదే.
- యెహెజ్కేలు 41:22సుమారు క్రీ.పూ. 574
అక్కడ చెక్కతో చేయబడి ఉన్న బలిపీఠం ఎత్తు మూడు మూరలు పొడవు రెండు మూరలు. దాని మూలలు అడుగుభాగం ప్రక్క భాగం కర్రతో చేయబడ్డాయి. “ఇది యెహోవా ఎదుట ఉండే బల్ల” అని అతడు నాతో చెప్పాడు.
- యెహెజ్కేలు 41:23సుమారు క్రీ.పూ. 574
ప్రధాన మందిరానికి అతి పరిశుద్ధ స్థలానికి రెండు తలుపులు ఉన్నాయి.
- యెహెజ్కేలు 41:24సుమారు క్రీ.పూ. 574
ప్రతి తలుపుకు మడత బందులు ఉన్న రెండు రెక్కలు ఉన్నాయి.
- యెహెజ్కేలు 41:25సుమారు క్రీ.పూ. 574
గోడ మీద ఉన్నట్లే ప్రధాన ప్రాంగణం తలుపులపై కెరూబులు ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి. బయటి మంటపానికి కర్రతో చేసిన పందిరి ఉంది.
- యెహెజ్కేలు 41:26సుమారు క్రీ.పూ. 574
ఆవరణ ప్రక్క గోడలలో ఇరుకైన కిటికీలు ఉన్నాయి, ప్రతి వైపున ఖర్జూర చెట్లతో చెక్కబడ్డాయి. ఆలయ ప్రక్క గదులకు కూడా కప్పులు ఉండేవి.
- యెహెజ్కేలు 42:1సుమారు క్రీ.పూ. 574
అతడు ఉత్తరం వైపుగా బయటి ఆవరణంలోకి నన్ను నడిపించి ఆలయ ప్రాంగణానికి ఉత్తరాన ఉన్న బయటి గోడకు ఎదురుగా ఉన్న గదుల దగ్గరికి తీసుకువచ్చాడు.
- యెహెజ్కేలు 42:2సుమారు క్రీ.పూ. 574
ఉత్తరం వైపు తలుపు ఉన్న ఆ భవనం పొడవు వంద మూరలు, వెడల్పు యాభై మూరలు.
- యెహెజ్కేలు 42:3సుమారు క్రీ.పూ. 574
లోపలి ఆవరణం నుండి ఇరవై మూరల భాగంలో బయటి ఆవరణం కాలిబాట ఎదురుగా ఉన్న భాగంలో, వసారా మూడు అంతస్తుల వసారాలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి.
- యెహెజ్కేలు 42:4సుమారు క్రీ.పూ. 574
ఆ గదుల ముందు పది మూరల వెడల్పు, వంద మూరల పొడవు ఉన్న లోపలి మార్గం ఉంది. వాటి తలుపులు ఉత్తరం వైపు ఉన్నాయి.
- యెహెజ్కేలు 42:5సుమారు క్రీ.పూ. 574
ఆ భవనంలోని క్రింది అలాగే మధ్య అంతస్తులలో ఉన్న గదుల కన్నా పై అంతస్తులో వసారాలు ఎక్కువ స్థలం ఆక్రమించడం వలన పై గదులు ఇరుకుగా ఉన్నాయి.
- యెహెజ్కేలు 42:6సుమారు క్రీ.పూ. 574
పై అంతస్తులో ఉన్న గదులకు ఆవరణంలో ఉన్నట్లుగా స్తంభాలు లేవు; కాబట్టి అవి క్రింది, మధ్య అంతస్తుల కంటే చిన్నవిగా ఉన్నాయి.
- యెహెజ్కేలు 42:7సుమారు క్రీ.పూ. 574
గదులకు, బయటి ఆవరణానికి సమాంతరంగా బయటి గోడ ఉంది; అది యాభై మూరల వరకు గదుల ముందు విస్తరించి ఉంది.
- యెహెజ్కేలు 42:8సుమారు క్రీ.పూ. 574
బయటి ఆవరణ ప్రక్కన ఉన్న గదుల వరుస యాభై మూరల పొడవు ఉండగా, గర్భాలయానికి సమీపంలో ఉన్న వరుస వంద మూరల పొడవు ఉంది.