- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
ఈ కాలపు వచనాలు
- యెహెజ్కేలు 43:14సుమారు క్రీ.పూ. 574
నేల మీద ఉన్న అడుగుభాగం నుండి క్రింది గట్టు వరకు బలిపీఠం ఎత్తు రెండు మూరలు. వెడల్పు ఒక మూర. చిన్న గట్టు నుండి పెద్ద గట్టు వరకు దాని ఎత్తు నాలుగు మూరలు, వెడల్పు ఒక మూర.
- యెహెజ్కేలు 43:15సుమారు క్రీ.పూ. 574
బలిపీఠం పొయ్యి ఎత్తు నాలుగు మూరలు. ఆ పొయ్యి నుండి పైకి నాలుగు కొమ్మలు ఉన్నాయి.
- యెహెజ్కేలు 43:16సుమారు క్రీ.పూ. 574
ఆ పొయ్యి చతురస్రంగా ఉండి పొడవు పన్నెండు మూరలు వెడల్పు పన్నెండు మూరలు ఉంది.
- యెహెజ్కేలు 43:17సుమారు క్రీ.పూ. 574
దాని పైచూరు కూడా చతురస్రంగా ఉండి పొడవు పద్నాలుగు మూరలు వెడల్పు పద్నాలుగు మూరలు ఉంది. దాని చుట్టూ ఉన్న అంచు వెడల్పు ఒక జానెడు దాని అంచుకు అర మూరెడు చట్రం ఉంది. బలిపీఠానికి మెట్లు తూర్పు వైపుగా ఉన్నాయి.”
- యెహెజ్కేలు 43:18సుమారు క్రీ.పూ. 574
అప్పుడు అతడు నాతో ఇలా అన్నాడు, “మనుష్యకుమారుడా, యెహోవా చెప్తున్న మాట ఇదే: ఈ బలిపీఠం కట్టిన తర్వాత దాని మీద రక్తం చిలకరించి దహనబలులు అర్పించడానికి నియమాలు ఇవి:
- యెహెజ్కేలు 43:19సుమారు క్రీ.పూ. 574
నా సన్నిధిలో సేవ చేయడానికి వచ్చే సాదోకు కుటుంబీకులు లేవీయులైన యాజకులకు పాపపరిహారబలి అర్పించడానికి కోడెదూడను ఇవ్వాలని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
- యెహెజ్కేలు 43:20సుమారు క్రీ.పూ. 574
వారు దానిని పాపపరిహారబలిగా అర్పించి బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేసి దాన్ని శుద్ధీకరించడానికి ఆ దూడ రక్తంలో కొంత తీసుకుని బలిపీఠపు నాలుగు కొమ్ము మీద, పై గట్టు నాలుగు మూలల మీద, చుట్టూ ఉన్న అంచు మీద ఉంచాలి.
- యెహెజ్కేలు 43:21సుమారు క్రీ.పూ. 574
మీరు పాపపరిహారబలి కోసం ఎద్దును తీసుకెళ్లి, పరిశుద్ధాలయం బయట ఆలయ ప్రాంతంలోని నిర్ణయించబడిన భాగంలో కాల్చాలి.
- యెహెజ్కేలు 43:22సుమారు క్రీ.పూ. 574
“రెండవ రోజున పాపపరిహారబలిగా ఏ లోపం లేని మేకపోతును అర్పించాలి. కోడెతో బలిపీఠానికి పాపపరిహారం చేసినట్లే మేకపోతుతో కూడా బలిపీఠానికి పాపపరిహారం చేయాలి.
- యెహెజ్కేలు 43:23సుమారు క్రీ.పూ. 574
దానిని శుద్ధి చేయడం పూర్తి చేసిన తర్వాత ఏ దోషంలేని కోడెను, పొట్టేలును అర్పించాలి.
- యెహెజ్కేలు 43:24సుమారు క్రీ.పూ. 574
మీరు వాటిని యెహోవా సన్నిధికి తీసుకురావాలి అప్పుడు యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహనబలిగా యెహోవాకు అర్పిస్తారు.
- యెహెజ్కేలు 43:25సుమారు క్రీ.పూ. 574
“రోజుకు ఒకటి చొప్పున వరుసగా ఏడు రోజులు పాపపరిహారబలిగా మేకపోతులను సిద్ధం చేయాలి. అలాగే మందలో నుండి ఏ లోపం లేని కోడెను పొట్టేలును సిద్ధం చేయాలి.
- యెహెజ్కేలు 43:26సుమారు క్రీ.పూ. 574
ఏడు రోజులు యాజకులు బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేస్తూ దాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి. అలా వారు దానిని ప్రతిష్ఠించాలి.
- యెహెజ్కేలు 43:27సుమారు క్రీ.పూ. 574
ఈ రోజులన్నీ ముగిసిన తర్వాత ఎనిమిదో రోజు నుండి యాజకులు బలిపీఠం మీద మీ దహనబలులు మీ సమాధానబలులు అర్పిస్తారు. అప్పుడు నేను మిమ్మల్ని అంగీకరిస్తాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”
- యెహెజ్కేలు 44:1సుమారు క్రీ.పూ. 574
అతడు నన్ను తూర్పు వైపున ఉన్న పరిశుద్ధస్థలం బయటి ద్వారం దగ్గరికి తీసుకువచ్చాడు. అది మూసి ఉంది.
- యెహెజ్కేలు 44:2సుమారు క్రీ.పూ. 574
యెహోవా నాతో ఇలా అన్నారు, “అది మూసే ఉంటుంది. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ ద్వారం గుండా ప్రవేశించారు కాబట్టి అది మూసే ఉంటుంది. ఏ ఒక్కరూ దానిలో ప్రవేశించకుండా ఇక ఎన్నటికీ తెరవకుండా మూసే ఉంటుంది.
- యెహెజ్కేలు 44:3సుమారు క్రీ.పూ. 574
యువరాజైన ఒక్కడే యెహోవా సన్నిధిలో భోజనం చేయడానికి ద్వారం లోపల కూర్చోవచ్చును. అతడు మంటపం మార్గంలో లోపలికి వెళ్లి అదే దారిలో బయటకు వెళ్లాలి.”
- యెహెజ్కేలు 44:4సుమారు క్రీ.పూ. 574
అతడు నన్ను ఉత్తర ద్వారం గుండా మందిరం ముందుకు తీసుకువచ్చాడు. అప్పుడు నేను యెహోవా మహిమ ప్రకాశంతో యెహోవా మందిరం నిండిపోవడం చూసి నేను నేలపై పడ్డాను.
- యెహెజ్కేలు 44:5సుమారు క్రీ.పూ. 574
అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, యెహోవా ఆలయానికి సంబంధించిన అన్ని నియమాలు విధుల గురించి నేను నీకు చెప్పే ప్రతిదాన్ని జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని గ్రహించు. మందిరం లోపలికి వచ్చే మార్గాన్ని పరిశుద్ధస్థలం నుండి బయటకు వెళ్లే అన్ని మార్గాలను శ్రద్ధగా గమనించు.
- యెహెజ్కేలు 44:6సుమారు క్రీ.పూ. 574
తిరుగుబాటు చేసే ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఇశ్రాయేలు ప్రజలారా, ఇంతవరకు మీరు చేసిన అసహ్యమైన ఆచారాలు చాలు.
- యెహెజ్కేలు 44:7సుమారు క్రీ.పూ. 574
మీరు చేసిన అసహ్యమైన ఆచారాలతో పాటు హృదయానికి శరీరానికి సున్నతిలేని విదేశీయులను నా పరిశుద్ధ స్థలంలోనికి తీసుకువచ్చి మీరు నాకు ఆహారాన్ని క్రొవ్వును రక్తాన్ని అర్పించి నా మందిరాన్ని అపవిత్రపరచి నా నిబంధనను భంగం చేశారు.
- యెహెజ్కేలు 44:8సుమారు క్రీ.పూ. 574
మీకు అప్పగించిన నా పవిత్ర వస్తువుల బాధ్యతను మీరు నెరవేర్చకుండా నా పరిశుద్ధస్థలం యొక్క బాధ్యతను ఇతరులకు అప్పగించారు.
- యెహెజ్కేలు 44:9సుమారు క్రీ.పూ. 574
ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: హృదయానికి శరీరానికి సున్నతిలేని విదేశీయులుగా ఇశ్రాయేలీయుల మధ్య నివసించే వారిలో ఎవరూ నా పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించకూడదు.
- యెహెజ్కేలు 44:10సుమారు క్రీ.పూ. 574
“ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపెట్టి తమ విగ్రహాలను అనుసరించినప్పుడు వారితో పాటు నాకు దూరమైన లేవీయులు తమ దోషాన్ని భరించాలి.
- యెహెజ్కేలు 44:11సుమారు క్రీ.పూ. 574
వారు నా పరిశుద్ధ స్థలంలో సేవ చేశారు, ఆలయ ద్వారపాలకులుగా బాధ్యత వహించి సేవ చేశారు; వారు ప్రజల కోసం దహనబలులను బలులను వధించి ప్రజల ముందు నిలబడి వారికి సేవ చేశారు.