- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
ఈ కాలపు వచనాలు
- యెహెజ్కేలు 44:12సుమారు క్రీ.పూ. 574
కానీ వారు తమ విగ్రహాల సమక్షంలో వారికి సేవ చేసి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారణమయ్యారు కాబట్టి వారు తమ పాప దోషాన్ని భరించేలా నేను వారికి వ్యతిరేకంగా నా చేయెత్తాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
- యెహెజ్కేలు 44:13సుమారు క్రీ.పూ. 574
వారు నాకు యాజకులుగా సేవ చేయడానికి నా సన్నిధికి రాకూడదు, నా పరిశుద్ధ వస్తువుల దగ్గరకు గాని అతి పరిశుద్ధ అర్పణల దగ్గరకు గాని రాకూడదు. వారు చేసిన అసహ్యమైన పనులకు వారు అవమానాన్ని భరించాలి.
- యెహెజ్కేలు 44:14సుమారు క్రీ.పూ. 574
అయితే మందిరంలో చేయవలసిన పనులన్నిటికి నేను వారిని కాపలాగా నియమిస్తాను.
- యెహెజ్కేలు 44:15సుమారు క్రీ.పూ. 574
“ఇశ్రాయేలు ప్రజలు నన్ను విడిచిపెట్టినప్పుడు నా పరిశుద్ధ స్థలానికి కాపలాగా ఉన్న సాదోకు వంశస్థులై లేవీయులైన యాజకులు సేవ చేయడానికి నా సన్నిధికి వస్తారు. వారు నా ఎదుట నిలబడి క్రొవ్వును రక్తాన్ని నాకు అర్పిస్తారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
- యెహెజ్కేలు 44:16సుమారు క్రీ.పూ. 574
వారే నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారు; వారే నా బల్ల దగ్గరికి వచ్చి సేవ చేస్తారు. వారే నేను అప్పగించిన దాన్ని కాపాడతారు.
- యెహెజ్కేలు 44:17సుమారు క్రీ.పూ. 574
“ ‘వారు లోపలి ఆవరణపు గుమ్మాల్లోకి ప్రవేశించినప్పుడు వారు నారబట్టలు ధరించాలి; లోపలి ఆవరణపు గుమ్మాల్లో గాని మందిరం లోపల గాని సేవ చేసేటప్పుడు వారు ఉన్ని బట్టలు వేసుకోకూడదు.
- యెహెజ్కేలు 44:18సుమారు క్రీ.పూ. 574
తలకు నార తలపాగా ధరించి నడుముకు నారబట్ట కట్టుకోవాలి. చెమట పుట్టించేదీ ఏదీ వారు ధరించకూడదు.
- యెహెజ్కేలు 44:19సుమారు క్రీ.పూ. 574
ప్రజలు ఉండే బయటి ఆవరణంలోకి వారు వెళ్లేటప్పుడు వారి వస్త్రాలతో తాకి ప్రజలు ప్రతిష్ఠించకుండా ఉండడానికి తమ సేవ వస్త్రాలను తీసివేసి వాటిని పవిత్రమైన గదుల్లో ఉంచి వేరే బట్టలు వేసుకుని వెళ్లాలి.
- యెహెజ్కేలు 44:20సుమారు క్రీ.పూ. 574
“ ‘వారు తమ తలలు క్షౌరం చేయించుకోకూడదు, తలవెంట్రుకలు పొడవుగా పెరగకుండ వాటిని కత్తిరించాలి.
- యెహెజ్కేలు 44:21సుమారు క్రీ.పూ. 574
లోపలి ఆవరణంలో ప్రవేశించేటప్పుడు ఏ యాజకుడు ద్రాక్షరసం త్రాగకూడదు.
- యెహెజ్కేలు 44:22సుమారు క్రీ.పూ. 574
యాజకులు విధవరాండ్రను గాని, విడాకులు తీసుకున్న స్త్రీని గాని పెళ్ళి చేసుకోకూడదు. వారు కేవలం ఇశ్రాయేలు కన్యలను గాని యాజకులకు భార్యలై విధవరాండ్రుగా ఉన్నవారిని గాని పెళ్ళి చేసుకోవచ్చు.
- యెహెజ్కేలు 44:23సుమారు క్రీ.పూ. 574
అంతేగాక వారు నా ప్రజలకు పవిత్రమైన వాటికి సాధారణమైన వాటి మధ్య భేదాన్ని బోధిస్తారు; పవిత్రమైన దానికి, అపవిత్రమైన దానికి మధ్య తేడా ఏమిటో వారికి చూపిస్తారు.
- యెహెజ్కేలు 44:24సుమారు క్రీ.పూ. 574
“ ‘ఏదైనా వివాదం ఉన్నప్పుడు యాజకులు న్యాయమూర్తులుగా వ్యవహరించి నా శాసనాల ప్రకారం తీర్పు ఇవ్వాలి. నా నియమించబడిన పండుగలన్నిటిలో వారు నా ధర్మశాస్త్రాన్ని శాసనాలను పాటించాలి, వారు నా విశ్రాంతి దినాలను పవిత్రంగా ఆచరించాలి.
- యెహెజ్కేలు 44:25సుమారు క్రీ.పూ. 574
“ ‘యాజకుడు చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్లి తనను తాను అపవిత్రం చేసుకోకూడదు; చనిపోయిన వ్యక్తి తన తండ్రి తల్లి కుమారుడు కుమార్తె సోదరుడు లేదా పెళ్ళికాని సోదరి అయితే శవాన్ని ముట్టుకొని అతడు అపవిత్రం కావచ్చు.
- యెహెజ్కేలు 44:26సుమారు క్రీ.పూ. 574
అయితే అతడు శుద్ధి చేయబడిన తర్వాత, అతడు ఏడు రోజులు వేచి ఉండాలి.
- యెహెజ్కేలు 44:27సుమారు క్రీ.పూ. 574
పరిశుద్ధాలయంలో సేవ చేయడానికి పరిశుద్ధాలయం లోపలి ఆవరణంలోనికి వెళ్లినప్పుడు అతడు పాపపరిహారబలి అర్పించాలి, అని ప్రభువైన యెహోవా ప్రకటించారు.
- యెహెజ్కేలు 44:28సుమారు క్రీ.పూ. 574
“ ‘యాజకులకు ఉన్న ఏకైన వారసత్వం నేనే. నీవు వారికి ఇశ్రాయేలులో స్వాస్థ్యం ఇవ్వకూడదు; నేనే వారికి స్వాస్థ్యంగా ఉంటాను.
- యెహెజ్కేలు 44:29సుమారు క్రీ.పూ. 574
వారు భోజనార్పణలు, పాపపరిహార బలులు, అపరాధబలులు తింటారు. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించినవన్నీ వారివే అవుతాయి.
- యెహెజ్కేలు 44:30సుమారు క్రీ.పూ. 574
మీ ప్రథమ ఫలాల్లో మీ ప్రత్యేక కానుకలన్నిటిలో శ్రేష్ఠమైనవి యాజకులకు చెందుతాయి. మీ కుటుంబం మీద ఆశీర్వాదం ఉండేలా మీరు మొదట పిసికిన పిండిముద్దను యాజకులకు ఇవ్వాలి.
- యెహెజ్కేలు 44:31సుమారు క్రీ.పూ. 574
పక్షుల్లో పశువుల్లో సహజంగా చచ్చిన వాటిని గాని మృగాలు చీల్చిన వాటిని గాని యాజకులు తినకూడదు.
- యెహెజ్కేలు 45:1సుమారు క్రీ.పూ. 574
“ ‘మీరు భూమిని వారసత్వంగా కేటాయిస్తున్నప్పుడు, మీరు భూమి నుండి ఒక భాగాన్ని యెహోవాకు ప్రతిష్ఠించాలి. ఆ భాగం పొడవు 25,000 మూరలు, వెడల్పు 20,000 మూరలు ఉండాలి; ఆ స్థలమంతా ప్రతిష్ఠితమవుతుంది.
- యెహెజ్కేలు 45:2సుమారు క్రీ.పూ. 574
దానిలో పరిశుద్ధస్థలం కోసం 500 మూరల చతురస్రాకార స్థలాన్ని కేటాయించాలి దాని చుట్టూ అన్నివైపులా 50 మూరల మైదానం ఉండాలి.
- యెహెజ్కేలు 45:3సుమారు క్రీ.పూ. 574
ఈ స్థలం నుండి 25,000 మూరల పొడవు 10,000 మూరల వెడల్పు గల భూమి కొలవాలి. దానిలో అతి పరిశుద్ధ స్థలమైన పరిశుద్ధస్థలం ఉంటుంది.
- యెహెజ్కేలు 45:4సుమారు క్రీ.పూ. 574
యెహోవాకు పరిచర్య చేయడానికి ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేసే యాజకులకు కేటాయించిన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలమవుతుంది. అది వారి ఇళ్ళకు స్థలంగా పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలంగా ఉంటుంది.
- యెహెజ్కేలు 45:5సుమారు క్రీ.పూ. 574
25,000 మూరల పొడవు 10,000 మూర వెడల్పు గల స్థలం మందిరంలో సేవచేసే లేవీయులకు స్వాస్థ్యంగా ఇరవై గదులు ఉన్న వారి నివాస స్థలంగా ఉంటుంది.