కంటెంట్‌కు వెళ్లండి

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహెజ్కేలు 46:6సుమారు క్రీ.పూ. 574

    అమావాస్య నాడు అతడు ఒక కోడెను, ఆరు గొర్రెపిల్లలను, ఒక పొట్టేలును లోపం లేనివాటిని అర్పించాలి.

  2. యెహెజ్కేలు 46:7సుమారు క్రీ.పూ. 574

    అతడు భోజనార్పణగా ఎద్దుతో పాటు ఒక ఏఫా పిండిని, పొట్టేలుతో పాటు ఒక ఏఫా పిండిని, గొర్రెపిల్లలతో పాటు తన శక్తికొలది పిండిని అర్పించాలి. ప్రతి ఏఫా పిండితో పాటు ఒక హిన్ నూనె అర్పించాలి.

  3. యెహెజ్కేలు 46:8సుమారు క్రీ.పూ. 574

    యువరాజు ప్రవేశించినప్పుడు, అతడు మంటప గుమ్మం ద్వారా లోపలికి వెళ్లాలి అదే దారిలో బయటకు రావాలి.

  4. యెహెజ్కేలు 46:9సుమారు క్రీ.పూ. 574

    “ ‘దేశ ప్రజలు నియమించబడిన పండుగల్లో యెహోవా సన్నిధికి ఆరాధించడానికి వచ్చినప్పుడు, ఉత్తర ద్వారం నుండి వచ్చేవారు దక్షిణ ద్వారం నుండి బయటకు వెళ్లాలి; దక్షిణ ద్వారం నుండి వచ్చేవారు ఉత్తర ద్వారం నుండి బయటకు వెళ్లాలి. ఎవరూ తాము వచ్చిన ద్వారం గుండా తిరిగి వెళ్లకుండా ప్రతిఒక్కరు తిన్నగా బయటకు వెళ్లాలి.

  5. యెహెజ్కేలు 46:10సుమారు క్రీ.పూ. 574

    యువరాజు వారి మధ్య ఉండి, లోపలికి వెళ్లి వారితో పాటు బయటకు వెళ్లాలి.

  6. యెహెజ్కేలు 46:11సుమారు క్రీ.పూ. 574

    పండుగల్లో, నియమించబడిన సమయాల్లో, భోజనార్పణగా ఎద్దుతో పాటు ఒక ఏఫా పిండిని, పొట్టేలుతో పాటు ఒక ఏఫా పిండిని, గొర్రెపిల్లలతో పాటు తన శక్తికొలది పిండిని అర్పించాలి. ప్రతి ఏఫా పిండితో పాటు ఒక హిన్ నూనె అర్పించాలి.

  7. యెహెజ్కేలు 46:12సుమారు క్రీ.పూ. 574

    “ ‘యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహనబలి గాని, సమాధానబలి గాని యువరాజు అర్పించేటప్పుడు అతని కోసం తూర్పు వైపు ద్వారం తలుపులు తెరవాలి. సబ్బాతు దినాన అర్పించునట్లుగానే దహనబలిని సమాధానబలిని అర్పించి వెళ్లిపోవాలి. అతడు వెళ్లిన తర్వాత ద్వారం తలుపులు మూసివేయాలి.

  8. యెహెజ్కేలు 46:13సుమారు క్రీ.పూ. 574

    “ ‘ప్రతిరోజు మీరు యెహోవాకు దహనబలిగా ఏ లోపం లేని ఒక సంవత్సరం వయస్సున్న గొర్రెపిల్లను అందించాలి. ప్రతి ఉదయం మీరు దానిని ఏర్పాటు చేయాలి.

  9. యెహెజ్కేలు 46:14సుమారు క్రీ.పూ. 574

    మీరు దానితో ప్రతి ఉదయం భోజనార్పణను ఏర్పాటు చేయాలి, పిండిని తేమగా ఉంచడానికి ఒక ఏఫాలో ఆరవ వంతు నూనెతో పాటు, ఒక హిన్‌లో మూడింట ఒక వంతు నూనె ఉంటుంది. ఈ భోజనార్పణను యెహోవాకు సమర్పించడమనేది నిత్య కట్టుబాటుగా ఉంటుంది.

  10. యెహెజ్కేలు 46:15సుమారు క్రీ.పూ. 574

    కాబట్టి ప్రతిరోజు ఉదయం క్రమమైన దహనబలి కోసం గొర్రెపిల్లను, భోజనార్పణను, నూనెను అందించాలి.

  11. యెహెజ్కేలు 46:16సుమారు క్రీ.పూ. 574

    “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అధిపతి వారసత్వంగా పొందిన భూమిలో ఒక భాగం తన కొడుక్కు ఇస్తే అది అతనికే సంక్రమిస్తుంది. ఇది వారసత్వ నియమము.

  12. యెహెజ్కేలు 46:17సుమారు క్రీ.పూ. 574

    ఒకవేళ సేవకునికి ఇస్తే అది విడుద సంవత్సరం వరకే సేవకుని ఆధీనంలో ఉంటుంది. అప్పుడది తిరిగి అధిపతికే వస్తుంది. అది పతి వారసత్వం భూమి అతని సంతతి వారిదే!

  13. యెహెజ్కేలు 46:18సుమారు క్రీ.పూ. 574

    ప్రజలను వారి స్వాస్థ్యంలో నుండి బయటకు వెళ్లగొట్టి, వారి వారసత్వంలో నుండి అధిపతి ఏదీ తీసుకోకూడదు. అధిపతి తన భూమిలో నుండి తన కుమారునికి భాగాలివ్వాలి. దేవుని ప్రజల్లో ఎవరూ తమ భూములను విడిచి చెదరిపోకూడదు.’ ”

  14. యెహెజ్కేలు 46:19సుమారు క్రీ.పూ. 574

    ఉత్తర వైపుగా ఉన్న యాజకుల పవిత్ర గదుల్లోకి ఆయన నన్ను తీసుకెళ్లి అక్కడ వెనక వైపు పశ్చిమదిక్కున ఒక స్థలం నాకు చూపించారు.

  15. యెహెజ్కేలు 46:20సుమారు క్రీ.పూ. 574

    అతడు నాతో ఇలా అన్నారు: “అపరాధ పరిహారార్థబలి, పాపపరిహారబలి వండి, భోజనార్పణ కాల్చడానికి, బయటి ఆవరణంలోనికి వాటిని తీసుకురాకుండా, ప్రజలను పవిత్రం చేయడానికి యాజకులు ఉండే స్థలం ఇది.”

  16. యెహెజ్కేలు 46:21సుమారు క్రీ.పూ. 574

    అప్పుడు అతడు నన్ను బయటి ఆవరణానికి తీసుకువచ్చి దాని నాలుగు మూలలకు నన్ను నడిపించాడు, నేను ప్రతి మూలలో మరొక ఆవరణాన్ని చూశాను.

  17. యెహెజ్కేలు 46:22సుమారు క్రీ.పూ. 574

    బయటి ఆవరణం యొక్క నాలుగు మూలల్లో నలభై మూరల పొడవు, ముప్పై మూరల వెడల్పు ఉన్న ఆవరణాలు ఉన్నాయి; నాలుగు మూలల్లో ఒక్కో ఆవరణం ఒకే పరిమాణంలో ఉంది.

  18. యెహెజ్కేలు 46:23సుమారు క్రీ.పూ. 574

    నాలుగు ఆవరణాల ప్రతి లోపలి భాగంలో ఒక రాతి గట్టు ఉంది, దాని చుట్టూ గట్టు క్రింద పొయ్యిలున్నాయి.

  19. యెహెజ్కేలు 46:24సుమారు క్రీ.పూ. 574

    ఆయన నాతో ఇలా అన్నాడు: “దేవాలయంలో పరిచర్య చేసేవారు ప్రజల బలి అర్పణలు వండడానికి ఇవి వంటశాలలు.”

  20. యెహెజ్కేలు 47:1సుమారు క్రీ.పూ. 574

    ఆ మనుష్యుడు నన్ను ఆలయ ద్వారం దగ్గరకు తిరిగి తీసుకువచ్చాడు, అక్కడ ఆలయ గుమ్మం క్రిందనుండి తూర్పు వైపుకు నీరు రావడం నేను చూశాను (మందిరం తూర్పు ముఖంగా ఉంది). ఆ నీరు ఆలయానికి దక్షిణం వైపున క్రింది నుండి, బలిపీఠానికి దక్షిణం నుండి వస్తుంది.

  21. యెహెజ్కేలు 47:2సుమారు క్రీ.పూ. 574

    తర్వాత అతడు నన్ను ఉత్తర ద్వారం గుండా బయటకు తీసుకువచ్చి, తూర్పు వైపున ఉన్న బయటి ద్వారం దగ్గరకు నన్ను నడిపించాడు, అక్కడ ఆ నీరు దక్షిణం వైపు నుండి పారుతుంది.

  22. యెహెజ్కేలు 47:3సుమారు క్రీ.పూ. 574

    ఆ వ్యక్తి తన చేతిలో కొలమానం పట్టుకుని తూర్పు వైపు వెళ్తుండగా, అతడు వెయ్యి మూరలు కొలిచాడు, ఆపై చీలమండల లోతు ఉన్న నీటి గుండా నన్ను నడిపించాడు.

  23. యెహెజ్కేలు 47:4సుమారు క్రీ.పూ. 574

    అతడు మరో వెయ్యి మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించాడు. నీళ్లు మోకాళ్ల వరకు వచ్చాయి. మరో వెయ్యి మూరలు కొలిచి నీటి గుండా నన్ను నడిపించాడు. అక్కడ నీళ్లు నడుము వరకు వచ్చాయి.

  24. యెహెజ్కేలు 47:5సుమారు క్రీ.పూ. 574

    అతడు మరో వెయ్యి కొలిచాడు, కానీ ఇప్పుడు అది నేను దాటలేని నదిగా ఉంది, ఎందుకంటే నీళ్లు ఎక్కువై ఈదగలిగినంత లోతుగా ఉంది.

  25. యెహెజ్కేలు 47:6సుమారు క్రీ.పూ. 574

    “మనుష్యకుమారుడా! ఇది చూస్తున్నావా?” ఆయన నన్ను మరల నది ఒడ్డుకు చేర్చాడు.