- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
ఈ కాలపు వచనాలు
- యెహెజ్కేలు 48:9సుమారు క్రీ.పూ. 574
“యెహోవాకు ప్రతిష్ఠించే ప్రత్యేక భాగం పొడవు 25,000 మూరలు. వెడల్పు 10,000 మూరలు ఉంటుంది.
- యెహెజ్కేలు 48:10సుమారు క్రీ.పూ. 574
ఇది యాజకులకు కేటాయించబడిన పవిత్రమైన భాగము. అది ఉత్తరం వైపు 25,000 మూరల పొడవు, పడమర వైపు 10,000 మూరల వెడల్పు, తూర్పు వైపున 10,000 మూరల వెడల్పు దక్షిణం వైపున 25,000 మూరల పొడవు ఉంటుంది. దాని మధ్యలో యెహోవా మందిరం ఉంటుంది.
- యెహెజ్కేలు 48:11సుమారు క్రీ.పూ. 574
ఇది ప్రతిష్ఠించబడిన యాజకులైన సాదోకు సంతతివారి కోసము. ఇశ్రాయేలీయులు తప్పుదారి పట్టినప్పుడు లేవీయుల్లా తప్పుదారి పట్టకుండా, వారు నాకు సేవచేయడంలో నమ్మకంగా ఉన్నారు.
- యెహెజ్కేలు 48:12సుమారు క్రీ.పూ. 574
పవిత్రమైన భూమిలో లేవీయుల భూభాగానికి సరిహద్దుగా ఉన్న ఆ భాగం వారికి ప్రత్యేక బహుమతిగా ఉంటుంది, అది అతిపరిశుద్ధమైన భాగము.
- యెహెజ్కేలు 48:13సుమారు క్రీ.పూ. 574
“యాజకుల ప్రాంతంతో పాటు, లేవీయులకు 25,000 మూరల పొడవు 10,000 మూరల వెడల్పు ఉంటుంది. దాని మొత్తం పొడవు 25,000 మూరలు వెడల్పు 10,000 మూరలు.
- యెహెజ్కేలు 48:14సుమారు క్రీ.పూ. 574
వారు దేనినీ అమ్మకూడదు లేదా మార్చుకోకూడదు. ఇది భూమిలో శ్రేష్ఠమైనది ఇతర చేతుల్లోకి వెళ్లకూడదు, ఎందుకంటే ఇది యెహోవాకు పవిత్రమైనది.
- యెహెజ్కేలు 48:15సుమారు క్రీ.పూ. 574
“మిగిలిన స్థలం, 5,000 మూరల వెడల్పు 25,000 మూరల పొడవున మిగిలిన భూమిని ఉమ్మడి ప్రాంతంగా భావించి పట్టణంలోని ఇళ్ళ కోసం పచ్చిక బయళ్ల కోసం ఉపయోగించాలి. పట్టణం దాని మధ్యలో ఉంటుంది.
- యెహెజ్కేలు 48:16సుమారు క్రీ.పూ. 574
పట్టణానికి ఈ కొలతలు ఉంటాయి: ఉత్తరం వైపు 4,500 మూరలు, దక్షిణం వైపు 4,500 మూరలు, తూర్పు వైపు 4,500 మూరలు పడమర వైపు 4,500 మూరలు.
- యెహెజ్కేలు 48:17సుమారు క్రీ.పూ. 574
పట్టణం కోసం పచ్చిక బయలు ఉత్తరాన 250 మూరలు, దక్షిణాన 250 మూరలు, తూర్పున 250 మూరలు పశ్చిమాన 250 మూరలు ఉండాలి.
- యెహెజ్కేలు 48:18సుమారు క్రీ.పూ. 574
కేటాయించబడిన పవిత్ర స్థలంతో పాటు మిగిలిన భూమి పొడవు తూర్పు వైపున 10,000 మూరలు పడమర వైపు 10,000 మూరలు ఉంటుంది. ఇది పట్టణంలో పనిచేసి బ్రతికేవారికి ఆహారాన్ని అందించే ఆధారంగా ఉంటుంది.
- యెహెజ్కేలు 48:19సుమారు క్రీ.పూ. 574
ఇశ్రాయేలులోని అన్ని గోత్రాల నుండి పట్టణంలో కష్టపడి పని చేసేవారు దానిని సాగు చేస్తారు.
- యెహెజ్కేలు 48:20సుమారు క్రీ.పూ. 574
భాగమంతా చతురస్రాకారంలో ఉంటుంది, ప్రతి వైపు 25,000 మూరలు ఉండాలి. ప్రత్యేక బహుమతిగా మీరు పట్టణం యొక్క ఆస్తితో పాటు పవిత్ర భాగాన్ని ప్రక్కన పెడతారు.
- యెహెజ్కేలు 48:21సుమారు క్రీ.పూ. 574
“పవిత్ర కేటాయింపు, పట్టణం యొక్క ఆస్తికి రెండు వైపులా మిగిలి ఉన్నవి యువరాజుకు చెందుతాయి. ఇది పవిత్ర భాగపు 25,000 మూరల నుండి తూర్పు సరిహద్దు వరకు పశ్చిమాన 25,000 మూరల నుండి పశ్చిమ సరిహద్దు వరకు విస్తరించి ఉంటుంది. గిరిజన ప్రాంతాల పొడవునా ఈ రెండు ప్రాంతాలు యువరాజుకు చెందుతాయి ఆలయ పరిశుద్ధ స్థలంతో కూడిన పవిత్ర భాగం వాటి మధ్యలో ఉంటుంది.
- యెహెజ్కేలు 48:22సుమారు క్రీ.పూ. 574
కాబట్టి లేవీయుల స్వాస్థ్యం, పట్టణం యొక్క స్వాస్థ్యం యువరాజుకు చెందిన ప్రాంతం మధ్యలో ఉంటుంది. యువరాజుకు చెందిన ప్రాంతం యూదా సరిహద్దుకు బెన్యామీను సరిహద్దుకు మధ్య ఉంటుంది.
- యెహెజ్కేలు 48:23సుమారు క్రీ.పూ. 574
“తక్కిన గోత్రాల వివరాలు: “బెన్యామీను వారికి ఒక భాగము. అది తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది.
- యెహెజ్కేలు 48:24సుమారు క్రీ.పూ. 574
షిమ్యోను వారికి ఒక భాగము. తూర్పు నుండి పడమటి వరకు అది బెన్యామీను వారి భూమిని ఆనుకుని ఉంటుంది.
- యెహెజ్కేలు 48:25సుమారు క్రీ.పూ. 574
ఇశ్శాఖారు వారికి ఒక వాటా! అది తూర్పు నుండి పడమర వరకు షిమ్యోను భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.
- యెహెజ్కేలు 48:26సుమారు క్రీ.పూ. 574
జెబూలూను తూర్పు నుండి పడమర వరకు ఇశ్శాఖారు భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.
- యెహెజ్కేలు 48:27సుమారు క్రీ.పూ. 574
గాదు వారికి ఒక వాటా. అది తూర్పు నుండి పడమర వరకు జెబూలూను భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.
- యెహెజ్కేలు 48:28సుమారు క్రీ.పూ. 574
గాదు దక్షిణ సరిహద్దు తామారు నుండి మెరీబా కాదేషు నీళ్ల వరకు, తర్వాత ఈజిప్టు వాగు వెంట మధ్యధరా సముద్రం వరకు వెళ్తుంది.
- యెహెజ్కేలు 48:29సుమారు క్రీ.పూ. 574
“ఇశ్రాయేలు గోత్రాలకు వారసత్వంగా కేటాయించవలసిన దేశం ఇదే, ఇవి వారి భాగాలు” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
- యెహెజ్కేలు 48:30సుమారు క్రీ.పూ. 574
“పట్టణం నుండి బయటకు వెళ్లే గుమ్మాల వివరాలు: “ఉత్తర దిక్కున 4,500 మూరల పొడవుగా ద్వారాలు మూడు ఉంటాయి,
- యెహెజ్కేలు 48:31సుమారు క్రీ.పూ. 574
పట్టణ ద్వారాలకు ఇశ్రాయేలు గోత్రాల పేర్లు పెట్టాలి. ఉత్తర దిక్కున రూబేను ద్వారం, యూదా ద్వారం, లేవీ ద్వారం ఉండాలి.
- యెహెజ్కేలు 48:32సుమారు క్రీ.పూ. 574
తూర్పు దిక్కున 4,500 మూరల పొడవుతో మూడు ద్వారాలు: యోసేపు ద్వారం, బెన్యామీను ద్వారం, దాను ద్వారము.
- యెహెజ్కేలు 48:33సుమారు క్రీ.పూ. 574
దక్షిణ దిక్కున 4,500 మూరల కొలతలతో మూడు ద్వారాలు: షిమ్యోను ద్వారం, ఇశ్శాఖారు ద్వారం, జెబూలూను ద్వారం ఉండాలి.