Skip to content

Tabernacle గురించి బైబిల్ వచనాలు

465 వచనాలు · 94 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారు అయిదు తెరలను ఒక దానితో ఒకటి కలిపి ఒక్కటిగా చేశారు; మిగిలిన అయిదింటిని కూడా అలాగే చేశారు.

  2. తర్వాత వారు ఒక కూర్పులోని తెరల చివర మొదటి తెర అంచుకు నీలి నూలుతో ఉచ్చులు చేశారు, రెండవ కూర్పులోని బయటి తెర చివర కూడా అలాగే చేశారు.

  3. అంతేకాక వారు ఒక తెరకు యాభై ఉచ్చులు చేసి, ఉచ్చులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేలా మరొకదాని తెర అంచుకు యాభై ఉచ్చులు చేశారు.

  4. తర్వాత వారు యాభై బంగారు గుండీలు తయారుచేసి ఆ గుండీలతో ఆ రెండు తెరలను ఒక దానితో ఒకటి కలిపినప్పుడు అది ఒకే సమావేశ గుడారంగా ఉంటుంది.

  5. వారు సమావేశ గుడారం పైకప్పుగా ఉండే గుడారం కోసం మేక వెంట్రుకలతో మొత్తం పదకొండు తెరలు తయారుచేశారు.

  6. పదకొండు తెరలన్నీ పొడవు ముప్పై మూరలు, వెడల్పు నాలుగు మూరలు కలిగి ఒకే కొలతతో ఉన్నాయి.

  7. వారు అయిదు తెరలను ఒకటిగా మిగతా ఆరు తెరలను ఒకటిగా కలిపారు.

  8. అప్పుడు వారు మొదటి కూర్పులోని చివరి తెర అంచున, అలాగే రెండవ కూర్పులోని చివరి తెర అంచున యాభై ఉచ్చులు చేశారు.

  9. దాన్ని ఒకటే గుడారమయ్యేలా వారు యాభై ఇత్తడి గుండీలు తయారుచేశారు.

  10. ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల చర్మంతో గుడారం కోసం పైకప్పును దానిపైన మన్నికైన తోళ్లతో పైకప్పు తయారుచేశారు.

  11. వారు సమావేశ గుడారానికి తుమ్మకర్రతో నిలువు పలకలు తయారుచేశారు.

  12. ప్రతి చట్రం పొడవు పది మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర ఉన్నాయి,

  13. రెండు కొయ్యమేకులు ఒకదానికొకటి సమాంతరంగా అమర్చారు. వారు సమావేశ గుడారపు చట్రాలన్నిటిని ఈ విధంగా తయారుచేశారు.

  14. సమావేశ గుడారపు దక్షిణ వైపుకు వారు ఇరవై చట్రాలు తయారుచేశారు.

  15. ప్రతి చట్రానికి క్రింద రెండు కొయ్య మేకులకు రెండు దిమ్మల చొప్పున ఇరవై చట్రాలకు నలభై వెండి దిమ్మలు తయారుచేశారు.

  16. మరోవైపుకు, అంటే సమావేశ గుడారానికి ఉత్తర వైపుకు, ప్రతి చట్రం క్రింద రెండు చొప్పున, వారు ఇరవై చట్రాలు తయారుచేశారు.

  17. పడమర వైపుకు అంటే సమావేశ గుడారపు వెనుక వైపుకు వారు ఆరు చట్రాలు తయారుచేశారు,

  18. సమావేశ గుడారం యొక్క మూలల కోసం రెండు చట్రాలు తయారుచేయబడ్డాయి.

  19. ఈ రెండు మూలల వద్ద చట్రాలు క్రింది నుండి పై వరకు రెండింతలు ఉండి ఒకే ఉంగరంలోకి అమర్చబడ్డాయి; రెండూ ఒకేలా ఉన్నాయి.

  20. అక్కడ ఎనిమిది చట్రాలు, ప్రతి చట్రం క్రింద రెండేసి చొప్పున పదహారు వెండి దిమ్మలు ఉన్నాయి.

  21. అలాగే వారు తుమ్మకర్రతో అడ్డకర్రలు తయారుచేశారు: సమావేశ గుడారానికి ఒక ప్రక్కన ఉన్న చట్రాలకు అయిదు అడ్డకర్రలు,

  22. రెండవ వైపున ఉన్నవాటికి అయిదు, సమావేశ గుడారానికి వెనుక వైపున పడమర వైపున ఉన్న చట్రాలకు అయిదు అడ్డకర్రలు చేశారు.

  23. చట్రాల మధ్యలో ఉండే అడ్డకర్రను ఈ చివరి నుండి ఆ చివరి వరకు చేశారు.

  24. వారు చట్రాలను బంగారంతో పొదిగించి, అడ్డకర్రలు ఉంచడానికి బంగారు ఉంగరాలు చేశారు. అలాగే అడ్డకర్రలను కూడా బంగారంతో పొదిగించారు.

  25. వారు నీలం ఊదా ఎరుపు రంగుల్లో ఒక తెరను పేనిన సన్నని నారతో చేయించి, నిపుణుడైన పనివానితో దానిమీద కెరూబులను అల్లించారు.