Tabernacle గురించి బైబిల్ వచనాలు: Supported by bars of shittim wood resting in rings of gold
Supported by bars of shittim wood resting in rings of gold గురించి వచనాలు
“అలాగే తుమ్మకర్రతో అడ్డకర్రలు తయారుచేయాలి: సమావేశ గుడారానికి ఒక ప్రక్కన ఉన్న చట్రాలకు అయిదు అడ్డకర్రలు,
రెండవ వైపున ఉన్నవాటికి అయిదు, సమావేశ గుడారానికి వెనుక వైపున పడమర వైపున ఉన్న చట్రాలకు అయిదు అడ్డకర్రలు చేయాలి.
మధ్య అడ్డకర్ర, చట్రాల మధ్యలో ఈ చివరి నుండి ఆ చివరి వరకు విస్తరించాలి.
ఆ చట్రాలను బంగారంతో పొదిగించి, అడ్డకర్రలు ఉంచడానికి బంగారు ఉంగరాలు చేయాలి. అలాగే అడ్డకర్రలను కూడా బంగారంతో పొదిగించాలి.
అలాగే వారు తుమ్మకర్రతో అడ్డకర్రలు తయారుచేశారు: సమావేశ గుడారానికి ఒక ప్రక్కన ఉన్న చట్రాలకు అయిదు అడ్డకర్రలు,
రెండవ వైపున ఉన్నవాటికి అయిదు, సమావేశ గుడారానికి వెనుక వైపున పడమర వైపున ఉన్న చట్రాలకు అయిదు అడ్డకర్రలు చేశారు.
చట్రాల మధ్యలో ఉండే అడ్డకర్రను ఈ చివరి నుండి ఆ చివరి వరకు చేశారు.