Tabernacle గురించి బైబిల్ వచనాలు: Filled with the cloud of glory
Filled with the cloud of glory గురించి వచనాలు
అప్పుడు సమావేశ గుడారాన్ని మేఘం కమ్మింది, యెహోవా మహిమతో సమావేశ గుడారం నిండింది.
ఆ మేఘం దాని మీద నిలిచి ఉండడం వల్ల, యెహోవా మహిమ సమావేశ గుడారాన్ని నింపివేసేది, కాబట్టి మోషే సమావేశ గుడారం లోనికి ప్రవేశించలేకపోయాడు.
ఇశ్రాయేలీయుల ప్రయాణాలన్నిటిలో, సమావేశ గుడారం మీద నుండి మేఘం పైకి వెళ్లినప్పుడు వారు బయలుదేరేవారు.
ఒకవేళ మేఘం పైకి వెళ్లకపోతే, అది పైకి వెళ్లేవరకు బయలుదేరేవారు కారు.
ఇశ్రాయేలీయుల ప్రయాణాలన్నిటిలో ఇశ్రాయేలీయులంతా చూస్తూ ఉండగా పగటివేళ యెహోవా మేఘం సమావేశ గుడారం మీద ఉండేది, రాత్రివేళ ఆ మేఘంలో అగ్ని ఉండేది.