కంటెంట్‌కు వెళ్లండి

Tabernacle గురించి బైబిల్ వచనాలు: Divine wisdom given to Bezaleel to make

13 వచనాలు · 94 కోణాలు

Divine wisdom given to Bezaleel to make గురించి వచనాలు

  1. “చూడు, నేను యూదా గోత్రానికి చెందిన ఊరి కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును ఏర్పరచుకొని,

  2. నేను అతన్ని దేవుని ఆత్మతో జ్ఞానంతో సామర్థ్యంతో అన్ని రకాల నైపుణ్యతలతో నింపాను.

  3. అతడు బంగారం వెండి ఇత్తడితో కళాత్మక నమూనాలను తయారుచేస్తాడు.

  4. ఇంకా అతడు రాళ్లను చెక్కి అమర్చడం, చెక్క పని చేయడం, అలా అన్ని రకాల చేతిపనులు చేస్తాడు.

  5. అంతేకాక అతనికి సహాయం చేయడానికి దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడైన ఒహోలీయాబును నేను నియమించాను.

  6. “ప్రత్యక్ష గుడారం, నిబంధన మందసం, దాని మీద ఉండే ప్రాయశ్చిత్త మూత, గుడారంలోని ఇతర ఉపకరణాలు

  7. తర్వాత మోషే ఇశ్రాయేలీయులతో, “చూడండి, యెహోవా యూదా గోత్రానికి చెందిన ఊరి కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును ఏర్పరచుకొని,

  8. బంగారం వెండి ఇత్తడితో కళాత్మక నమూనాలను రూపొందించడానికి, రాళ్లను చెక్కి అమర్చడం, చెక్క పని చేయడం వంటి అన్ని రకాల కళాత్మక నైపుణ్యాలతో పని చేయడానికి అతన్ని దేవుని ఆత్మతో జ్ఞానంతో సామర్థ్యంతో తెలివితో అన్ని రకాల నైపుణ్యతలతో నింపారు.

  9. And to devise curious works, to work in gold, and in silver, and in brass,

  10. And in the cutting of stones, to set them, and in carving of wood, to make any manner of cunning work.

  11. ఆయన బెసలేలుకు, అలాగే దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడైన ఒహోలీయాబుకు ఇతరులకు నేర్పగల సామర్థ్యాన్ని ఇచ్చారు.

  12. చెక్కేవారి పని, కళాకారుల పని, నీలం ఊదా ఎరుపు రంగుల నూలు సన్నని నారతో కుట్టుపని, నేతగాని పని, చిత్రకారులు చేయగల అన్ని రకాల పనులను చేయడానికి కావలసిన నైపుణ్యంతో యెహోవా వారిని నింపారు.

  13. పరిశుద్ధాలయం యొక్క సేవ కోసం చేయవలసిన అన్ని రకాల పనులు ఎలా చేయాలో తెలుసుకోవడానికి యెహోవా నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని ఇచ్చిన బెసలేలు ఒహోలీయాబు వలె నైపుణ్యం కలిగిన ప్రతి ఒక్కరు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం పని చేయాలి” అన్నాడు.