Tabernacle గురించి బైబిల్ వచనాలు: Renewed by David, and pitched on Mount Zion
Renewed by David, and pitched on Mount Zion గురించి వచనాలు
దావీదు తన కోసం దావీదు పట్టణంలో భవనాలు కట్టించుకున్న తర్వాత, అతడు దేవుని మందసం కోసం ఒక స్థలాన్ని సిద్ధపరచి దాని కోసం గుడారం వేయించాడు.
వారు దేవుని మందసాన్ని తీసుకువచ్చి, దావీదు దాని కోసం వేసిన గుడారంలో దానిని ఉంచి వారు దేవుని సన్నిధిలో దహనబలులు సమాధానబలులు అర్పించారు.
దావీదు దహనబలులు సమాధానబలులు అర్పించిన తర్వాత, అతడు యెహోవా పేరిట ప్రజలను దీవించాడు.
దావీదు దేవుని మందసాన్ని కిర్యత్-యారీము నుండి దాని కోసం సిద్ధపరచిన స్థలానికి తీసుకువచ్చాడు, ఎందుకంటే అతడు యెరూషలేములో దాని కోసం ఒక గుడారాన్ని వేశాడు.