కంటెంట్‌కు వెళ్లండి

Tabernacle గురించి బైబిల్ వచనాలు: The Lord reveals Himself at

12 వచనాలు · 94 కోణాలు

The Lord reveals Himself at గురించి వచనాలు

  1. యెహోవా మోషేను పిలిచి సమావేశ గుడారం నుండి అతనితో మాట్లాడారు. ఆయన అన్నారు,

  2. ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన రెండవ సంవత్సరం రెండవ నెల మొదటి రోజు సీనాయి ఎడారిలో ఉన్న సమావేశ గుడారంలో యెహోవా మోషేతో మాట్లాడారు. ఆయన ఇలా అన్నారు:

  3. యెహోవాతో మాట్లాడటానికి మోషే సమావేశ గుడారంలో ప్రవేశించినప్పుడు, నిబంధన మందసం పైనున్న ప్రాయశ్చిత్త మూత మీదుగా ఉన్న రెండు కెరూబుల మధ్య నుండి అతనితో మాట్లాడటం అతనికి వినిపించింది. ఇలా యెహోవా అతనితో మాట్లాడారు.

  4. వెంటనే యెహోవా మోషే, అహరోను మిర్యాములతో, “మీ ముగ్గురు, సమావేశ గుడారం దగ్గరకు రండి” అని చెప్పారు. కాబట్టి ముగ్గురు వెళ్లారు.

  5. అప్పుడు యెహోవా మేఘస్తంభంలో దిగి వచ్చారు; ఆయన గుడార ద్వారం దగ్గర నిలబడి అహరోను, మిర్యాములను పిలిచారు. ఆ ఇద్దరు ముందుకు వచ్చినప్పుడు,

  6. ఆయన, “నా మాటలు వినండి: “ఒకవేళ మీ మధ్య ప్రవక్త ఉంటే, యెహోవానైన నేను దర్శనాలలో వారికి ప్రత్యక్షమవుతాను, కలలలో నేను వారితో మాట్లాడతాను.

  7. అయితే నా సేవకుడైన మోషే విషయంలో ఇలా కాదు; అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్థుడు.

  8. అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడతాను, పొడుపుకథల్లా కాక స్పష్టంగా మాట్లాడతాను. అతడు యెహోవా రూపాన్ని చూస్తాడు. అలాంటప్పుడు మీరెందుకు భయపడకుండా నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు?”

  9. యెహోవా కోపం వారిపై రగులుకుంది, ఆయన వారిని విడిచి వెళ్లారు.

  10. మేఘం గుడారం నుండి పైకి వెళ్లిపోయాక, మిర్యాముకు కుష్ఠువ్యాధి వచ్చి చర్మం మంచులా తెల్లగా మారింది. అహరోను ఆమె వైపు చూసి, ఆమెకు కుష్ఠువ్యాధి వచ్చిందని గ్రహించి,

  11. ఆ తర్వాత యెహోవా మోషేతో, “నీవు చనిపోయే రోజు దగ్గరలో ఉంది. యెహోషువను పిలిచి, సమావేశ గుడారం దగ్గరకు రండి, అక్కడ నేను అతన్ని నియమిస్తాను” అని చెప్పారు. కాబట్టి మోషే, యెహోషువ వచ్చి సమావేశ గుడారం దగ్గర ఉన్నారు.

  12. అప్పుడు యెహోవా గుడారం దగ్గర మేఘస్తంభంలో ప్రత్యక్షమయ్యారు, మేఘం గుడార ద్వారం మీద నిలిచింది.