Skip to content

Select Readings గురించి బైబిల్ వచనాలు

802 వచనాలు · 47 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. తోటలో నుండి రాజు విందుశాలకు వచ్చాడు, ఆ సమయంలో హామాను ఎస్తేరు రాణి కూర్చున్న మంచం పైన పడి ఉండడం చూశాడు. రాజు ఆవేశంతో, “ఇంట్లో రాణి నాతో ఉండగానే వీడు రాణి మీద అత్యాచారం చేస్తాడా?” అని అన్నాడు. రాజు నోటి నుండి ఆ మాట రావడంతోనే సైనికులు హామాను ముఖానికి ముసుగు వేశారు.

  2. రాజు సేవచేసే నపుంసకులలో హర్బోనా అనే ఒకడు, “నిజానికి, రాజు తరపున మాట్లాడిన మొర్దెకైని చంపించడానికి హామాను తన ఇంటి వద్ద యాభై మూరల ఒక ఉరికంబాన్ని చేయించాడు” అని చెప్పాడు. వెంటనే రాజు, “దానిమీదే అతన్ని ఉరితీయండి” అని అన్నాడు.

  3. మొర్దెకై కోసం హామాను చేయించిన ఉరికంబం మీద హామానును ఉరితీశారు. అప్పుడు రాజు కోపం చల్లారింది.

  4. “స్త్రీకి పుట్టిన మనుష్యులు, ఉండేది కొంతకాలమే అయినా ఎన్నో శ్రమలు పొందుతారు.

  5. వారు పువ్వులా వికసించి వాడిపోతారు; నిలకడలేని నీడలా వారు స్థిరంగా ఉండరు.

  6. అలాంటివారి మీద మీ దృష్టిని నిలిపారా? తీర్పు తీర్చడానికి వారిని మీ ఎదుటికి తీసుకువస్తారా?

  7. అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని ఎవరు తీసుకురాగలరు? ఎవరు తీసుకురాలేరు!

  8. మనుష్యులు బ్రతికే రోజులు నిశ్చయించబడ్డాయి; వారు ఎన్ని నెలలు బ్రతుకుతారో మీరు శాసించారు వారు దాటలేని పరిధిని మీరు నియమించారు.

  9. కూలివారిలా వారు తమ పని ముగించే వరకు మీరు వారివైపు చూడకండి, వారిని అలా వదిలేయండి.

  10. “కనీసం చెట్టుకైనా నిరీక్షణ ఉంది: దాన్ని నరికివేసినా అది మరలా చిగురిస్తుంది, దానికి లేత కొమ్మలు ఖచ్చితంగా వస్తాయి.

  11. దాని వేర్లు భూమిలో ఎండిపోయినా దాని మోడు మట్టిలో చనిపోయినా,

  12. నీటి వాసన తగిలితే చాలు అది చిగురిస్తుంది. లేత మొక్కలా కొమ్మలు వేస్తుంది.

  13. కాని నరులు చనిపోయి కదలకుండ పడి ఉంటారు; చివరి శ్వాస విడిచిన తర్వాత వారు ఇక ఉండరు.

  14. వెండికి గని ఉన్నది బంగారాన్ని పుటం వేయడానికి ఒక స్థలం ఉన్నది.

  15. ఇనుము మట్టిలో నుండి తీయబడుతుంది, ధాతువు కరిగించి రాగి తీస్తారు.

  16. చీకటిలో కాంతిని ఎలా ప్రకాశింప చేయాలో మానవులకు తెలుసు; ధాతువు కోసం చీకటిలో శోధిస్తున్నప్పుడు భూమి యొక్క సుదూర ప్రాంతాలను అన్వేషిస్తారు.

  17. మనుష్యుల నివాస స్థలాలకు దూరంగా, మానవ అడుగులు పడని చోట్లలో; వ్రేలాడుతూ ఊగుతూ సొరంగాలు త్రవ్వుతారు.

  18. భూమిపై ఆహారం పెంచబడుతుంది, కాని దాని లోపలి భాగం అగ్నికి కరిగిపోయి ఉంటుంది.

  19. దాని రాళ్లల్లో నీలమణులుంటాయి. దాని మట్టిలో బంగారం ఉంటుంది.

  20. దాని త్రోవ ఏ గ్రద్దకు తెలియదు, డేగ కన్ను కూడా దానిని చూడలేదు.

  21. గర్వంగల క్రూరమృగాలు ఆ దారిలో అడుగుపెట్టలేదు, ఏ సింహం అక్కడ నడవలేదు.

  22. మనుష్యులు తమ చేతులతో చెకుముకిరాయి మీద దాడి చేస్తారు. కొండలను వాటి పునాదులతో సహా పెకిలించి వేస్తారు.

  23. బండలో వారు సొరంగం త్రవ్వుతారు. దాని నిధులను వారి కళ్లు పసిగడుతుంది.

  24. వారు నదుల మూలాలను శోధిస్తారు, మరుగున పడి ఉన్నవాటిని వెలుగులోనికి తెస్తారు.

  25. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? అవగాహన ఎక్కడ నివసిస్తుంది?