Select Readings గురించి బైబిల్ వచనాలు: The majesty of God
The majesty of God గురించి వచనాలు
దేవా, మీ మార్గాలు పరిశుద్ధమైనవి. మన దేవునిలాంటి గొప్ప దేవుడెవరున్నారు?
మీరు అద్భుతాలు చేసే దేవుడు; మీరు ప్రజలమధ్య మీ శక్తిని చూపిస్తారు.
మీ శక్తివంతమైన చేతితో యాకోబు, యోసేపు సంతతివారైన మీ ప్రజలను విమోచించారు. సెలా
దేవా, జలాలు మిమ్మల్ని చూశాయి, జలాలు మిమ్మల్ని చూసి త్రుళ్ళిపడ్డాయి; అగాధాలు వణికిపోయాయి.
మేఘాలు వర్షించాయి. ఆకాశాలు ఉరుములతో ప్రతిధ్వనించాయి. మీ బాణాలు అన్నివైపులా తళుక్కుమన్నాయి.
మీ ఉరుము సుడిగాలిలో వినిపించింది, మీ మెరుపు ప్రపంచాన్ని వెలిగించింది; భూమి వణికి కంపించింది.
మీ అడుగుజాడలు కనిపించనప్పటికీ, మీ మార్గం సముద్రం గుండా, శక్తివంతమైన జలాల గుండా వెళ్లింది.
మోషే అహరోనుల ద్వార మీరు మీ ప్రజలను మందలా నడిపించారు.
దేవుడు తేమాను నుండి వచ్చాడు, పరిశుద్ధుడు పారాను పర్వతం నుండి వచ్చాడు. సెలా ఆయన మహా వైభవం ఆకాశాలను కప్పివేసింది భూమి ఆయన స్తుతితో నిండింది.
ఆయన తేజస్సు సూర్యకాంతిలా ఉంది; ఆయన చేతిలో నుండి కిరణాలు బయలువెళ్తున్నాయి, అక్కడ ఆయన శక్తి దాగి ఉంది.
ఆయనకు ముందుగా తెగులు వెళ్లింది; అంటువ్యాధి ఆయన పాదాలను అనుసరించింది.
ఆయన నిలబడగా భూమి కంపించింది; ఆయన చూడగా దేశాలు వణికాయి. పురాతన పర్వతాలు కూలిపోయాయి పురాతన కొండలు అణగిపోయాయి కానీ ఆయన మార్గాలు శాశ్వతమైనవి.
భయంలో ఉన్న కూషీయుల గుడారాలను, వేదనలో ఉన్న మిద్యానువాసుల నివాసాలను నేను చూశాను.
యెహోవా, నీవు నదులపై కోపంగా ఉన్నావా? ప్రవాహాల మీద నీ ఉగ్రత ఉందా? సముద్రంపై కోపం వచ్చిందా? అందుకే నీవు నీ గుర్రాల మీద స్వారీ చేస్తూ నీ విజయ రథాలను ఎక్కి వస్తున్నావా?
వరలో నుండి నీ విల్లు తీసావు, నీ వాక్కుతోడని ప్రమాణం చేసి నీ బాణాలను సిద్ధం చేశావు. సెలా నీవు భూమిని చీల్చి నదులను ప్రవహింపజేశావు;
పర్వతాలు నిన్ను చూసి వణికాయి. నీళ్లు ప్రవాహాలుగా ప్రవహిస్తాయి; అగాధం ఘోషిస్తూ తన అలలను పైకి లేపుతుంది.
ఎగిరే నీ బాణాల కాంతికి నీ ఈటె తళతళ మెరుపుకు సూర్యచంద్రులు తమ ఆకాశంలో స్థానాల్లో నిలిచిపోతాయి.
ఉగ్రతతో నీవు భూమిమీద తిరుగుతున్నావు ఆగ్రహంతో దేశాలను అణగద్రొక్కుతున్నావు.
నీ ప్రజలను విడిపించడానికి, నీ అభిషిక్తుని రక్షించడానికి నీవు బయలుదేరుతున్నావు. దుర్మార్గపు దేశపు నాయకుడిని నీవు కూలద్రోసి, తల నుండి పాదం ఖండించి నిర్మూలం చేస్తున్నావు. సెలా