Select Readings గురించి బైబిల్ వచనాలు: Confidence in God
Confidence in God గురించి వచనాలు
దావీదు కీర్తన యెహోవా నా కాపరి, నాకు ఏ కొరత లేదు.
పచ్చిక ఉన్నచోట ఆయన నన్ను పడుకోనిస్తారు. ప్రశాంత జలాల ప్రక్కన ఆయన నన్ను నడిపిస్తారు.
ఆయన నా ప్రాణానికి సేదదీరుస్తారు. ఆయన తన నామం కోసం నీతి మార్గాల్లో నన్ను నడిపిస్తారు.
మృత్యు నీడలా ఉన్న లోయలో నేను నడిచినా, ఏ కీడుకు భయపడను, ఎందుకంటే మీరు నాతో ఉన్నారు; మీ దండం మీ చేతికర్ర నన్ను ఆదరిస్తాయి.
నా శత్రువులు ఉన్న చోటనే మీరు నాకు బల్ల సిద్ధం చేస్తారు. నూనెతో నా తల అభిషేకించారు; నా పాత్ర నిండి పొర్లుతుంది.
నిశ్చయంగా నా జీవితకాలమంతా మీ మంచితనం మీ మారని ప్రేమ నావెంటే ఉంటాయి. నేను నిరంతరం యెహోవా మందిరంలో నివసిస్తాను.