Skip to content

Select Readings గురించి బైబిల్ వచనాలు: Judah's defense

17 వచనాలు · 47 కోణాలు

Judah's defense గురించి వచనాలు

  1. అప్పుడు యూదా అతని దగ్గరకు వెళ్లి అన్నాడు: “నా ప్రభువా, మీ దాసుని క్షమించి నా ప్రభువుతో ఒక్క మాట మాట్లాడనివ్వండి. మీరు ఫరోతో సమానులైనను మీ దాసునిపై కోప్పడకండి.

  2. నా ప్రభువు తమ దాసులను, ‘మీకు తండ్రి గాని సోదరుడు గాని ఉన్నాడా?’ అని అడిగారు.

  3. దానికి మేము, ‘నా ప్రభువా, మాకు వృద్ధుడైన తండ్రి, వృద్ధాప్యంలో తనకు పుట్టిన చిన్నకుమారుడు ఉన్నాడు. అతని అన్న చనిపోయాడు, అతని తల్లి కుమారులలో ఆ ఒక్కడే మిగిలాడు, అతని తండ్రికి ఆ చిన్నవాడంటే చాలా ప్రేమ’ అని చెప్పాము.

  4. “అప్పుడు మీరు మీ దాసులతో, ‘అతన్ని నేను చూడాలి, నా దగ్గరకు తీసుకురండి’ అని అన్నారు.

  5. అందుకు మేము నా ప్రభువుతో, ‘అతడు తండ్రిని విడిచి ఉండలేడు; ఒకవేళ అతడు విడిచిపెట్టి వస్తే, అతని తండ్రి చనిపోతాడు’ అని చెప్పాము.

  6. కాని మీరు మీ దాసులతో, ‘మీ చిన్న తమ్ముడు మీతో వస్తేనే తప్ప మీరు నాకు కనబడవద్దు’ అని అన్నారు.

  7. మేము మా తండ్రి దగ్గరకు వెళ్లి మా ప్రభువు చెప్పిందంతా చెప్పాము.

  8. “మా తండ్రి, ‘ఇంకొంచెం ఆహారం కొనడానికి మళ్ళీ వెళ్లండి’ అన్నాడు.

  9. అందుకు మేము అతనితో, ‘మేము వెళ్లలేము. మా చిన్న తమ్ముడు మాతో వెళ్తేనే మేము వెళ్తాము. మా చిన్న తమ్ముడు మాతో ఉంటేనే తప్ప మేము వెళ్లి ఆయన ముఖం చూడలేం’ అని చెప్పాము.

  10. “మీ దాసుడైన మా తండ్రి మాతో, ‘నా భార్య నాకు ఇద్దరు కుమారులను కన్నదని మీకు తెలుసు.

  11. వారిలో ఒకడు వెళ్లి తిరిగి రాలేదు. నిస్సందేహంగా అతన్ని ఏదో అడవి జంతువు చంపి ముక్కలు చేసి ఉంటుంది. అప్పటినుండి అతన్ని నేను చూడలేదు.

  12. మీరు నా దగ్గర నుండి వీన్ని కూడా తీసుకెళ్తే, వీనికి ఏదైన హాని సంభవిస్తే, దుఃఖిస్తూ ఉన్న, తల నెరసిన ఈ వ్యక్తిని సమాధికి పంపిన వారవుతారు’ అన్నాడు.

  13. “కాబట్టి ఇప్పుడు మా తమ్ముడు మాతో లేకుండ, మీ దాసుడైన మా తండ్రి దగ్గరకు మేము తిరిగి వెళ్తే, ఈ చిన్నవానితో ముడిపడి ఉన్న మా తండ్రి,

  14. మాతో చిన్నవాడు లేకపోవడం చూసి, అతడు చనిపోతాడు. మీ దాసులమైన మేము తల నెరిసిన మా తండ్రిని దుఃఖంలోనే సమాధికి తీసుకెళ్లిన వారమవుతాము.

  15. మీ దాసుడనైన నేను బాలుని భద్రతకు నా తండ్రికి హామీ ఇచ్చాను. ‘నేను అతన్ని తీసుకురాకపోతే, నా జీవితాంతం ఆ నిందను నేను భరిస్తాను’ అని చెప్పాను.

  16. “కాబట్టి ఇప్పుడు, ఈ చిన్నవానికి బదులు నా ప్రభువు యొక్క దాసుని మీ దగ్గర బానిసగా ఉండనివ్వండి, ఈ చిన్నవాన్ని మాత్రం తన సోదరులతో తిరిగి వెళ్లనివ్వండి.

  17. చిన్నవాడు నాతో లేకుండ నా తండ్రి దగ్గరకు ఎలా తిరిగి వెళ్లగలను? లేదు! నా తండ్రికి కలిగే బాధను నేను చూడలేను.”