Skip to content

Select Readings గురించి బైబిల్ వచనాలు

802 వచనాలు · 47 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఏ మానవుడు దాని విలువను అర్థం చేసుకోడు; అది సజీవుల దేశంలో దొరకదు.

  2. “అది నాలో లేదు” అని అగాధం అంటుంది; “అది నాలో లేదు” అని సముద్రం అంటుంది.

  3. మేలిమి బంగారంతో దానిని కొనలేము, దాని వెలకు సరిపడా వెండిని తూచలేము.

  4. ఓఫీరు బంగారంతోనైనా విలువైన గోమేధికంతోనైనా నీలమణితోనైనా దానిని కొనలేము.

  5. బంగారాన్ని కాని స్ఫటికాన్ని కాని దానితో పోల్చలేము; బంగారు ఆభరణాలతో కూడా దాన్ని పొందలేము.

  6. పగడము చంద్రకాంత శిల ప్రస్తావించదగినవి కావు; జ్ఞానం యొక్క ధర మాణిక్యాలకు మించినది.

  7. కూషుదేశపు విలువైన రాయిని దానితో పోల్చలేము; శుద్ధమైన బంగారంతో కూడా దానిని కొనలేము.

  8. అలాగైతే జ్ఞానం ఎక్కడ నుండి వస్తుంది? అవగాహన ఎక్కడ నివసిస్తుంది?

  9. అది జీవులన్నిటి కళ్ళ నుండి దాచబడింది, ఆకాశపక్షుల నుండి కూడా అది దాచిపెట్టబడింది.

  10. “కేవలం దాని గురించిన వదంతిని విన్నాము” నరకము మృత్యువు అంటాయి.

  11. దేవుడే దాని మార్గాన్ని గ్రహిస్తారు అది ఎక్కడుండేది ఆయనకే తెలుసు.

  12. ఎందుకంటే ఆయన భూమి అంచుల వరకు చూస్తున్నారు ఆకాశాల క్రింద ఉన్న ప్రతిదీ ఆయన చూస్తున్నారు.

  13. ఆయన గాలి ప్రభావాన్ని స్థాపించినప్పుడు జలములను కొలిచినప్పుడు,

  14. వర్షపాతానికి శాసనాన్ని విధించినప్పుడు ఉరుములతో కూడిన మెరుపులకు దారిని ఏర్పరచినప్పుడు,

  15. అప్పుడు ఆయన జ్ఞానం వైపు చూశాడు దానిని అంచనా వేశాడు; ఆయన దానిని ధృవీకరించారు పరీక్షించారు.

  16. అంతేకాక మనుష్యజాతితో, “యెహోవాకు భయపడడమే జ్ఞానం దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకం” అని అన్నాడు.

  17. దుష్టుల సలహాను పాటించక పాపులు కోరుకునే మార్గంలో నిలబడక ఎగతాళి చేసేవారి గుంపుతో కూర్చోక,

  18. యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ, రాత్రింబగళ్ళు దాన్ని ధ్యానిస్తూ ఉండేవారు ధన్యులు.

  19. వారు నీటికాలువల ప్రక్కన నాటబడి, ఆకులు వాడిపోకుండ, సరియైన కాలంలో ఫలమిచ్చే చెట్టులా ఉంటారు వారు చేసేవాటన్నిటిలో వృద్ధిచెందుతారు.

  20. అయితే దుష్టులు అలా ఉండరు! వారు గాలికి కొట్టుకుపోయే పొట్టులా ఉంటారు.

  21. కాబట్టి న్యాయతీర్పులో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలబడరు.

  22. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసు, దుష్టుల మార్గం నాశనానికి నడిపిస్తుంది.

  23. దేశాలు ఎందుకు కుట్ర చేస్తున్నాయి? ప్రజలు ఎందుకు వ్యర్థంగా పన్నాగం వేస్తున్నారు?

  24. యెహోవాకు ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా భూరాజులు లేచి పాలకులందరు ఒకటిగా చేరి,

  25. “మనం వారి గొలుసులను తెంపుదాం వారి సంకెళ్ళను విసిరి పారేద్దాం” అంటున్నారు.