కంటెంట్‌కు వెళ్లండి

Select Readings గురించి బైబిల్ వచనాలు

802 వచనాలు · 47 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆయన నాసికా రంధ్రాల్లో నుండి పొగలేచింది; ఆయన నోటి నుండి దహించే అగ్ని వచ్చింది, దానిలో నిప్పులు మండుతున్నాయి.

  2. ఆకాశాన్ని చీల్చుకొని ఆయన దిగివచ్చారు; ఆయన పాదాల క్రింద నల్లని మేఘాలు కమ్ముకున్నాయి.

  3. ఆయన కెరూబుల మీద ఎక్కి వచ్చారు; ఆయన గాలి రెక్కల మీద ఎగిరి వచ్చారు.

  4. ఆయన చీకటిని తన కప్పుగా, కారు మేఘాలను తన చుట్టూ పందిరిగా చేసుకున్నారు.

  5. ఆయన సన్నిధి కాంతి నుండి మేఘాలు, వడగండ్లు, మండుతున్న నిప్పులు కురిసాయి.

  6. యెహోవా పరలోకం నుండి ఉరిమారు; మహోన్నతుని స్వరం ప్రతిధ్వనించింది.

  7. ఆయన తన బాణాలు విసిరి శత్రువును చెదరగొట్టారు, మెరుస్తున్న గొప్ప పిడుగులతో వారిని తరిమికొట్టారు.

  8. యెహోవా, మీ గద్దింపుకు, మీ నాసికా రంధ్రాల్లో నుండి వచ్చే బలమైన ఊపిరికి, సముద్రపు అగాధాలు కనబడ్డాయి భూమి పునాదులు బయటపడ్డాయి.

  9. ఆయన పైనుండి చేయి చాచి నన్ను పట్టుకున్నారు; లోతైన జలాల్లో నుండి నన్ను పైకి తీశారు.

  10. శక్తివంతమైన నా శత్రువు నుండి, నాకన్నా బలవంతులైన పగవారి నుండి ఆయన నన్ను రక్షించారు.

  11. నా విపత్తు రోజున వారు నా మీదికి వచ్చారు, కాని యెహోవా నాకు అండగా ఉన్నారు.

  12. ఆయన నన్ను విశాలమైన స్థలంలోకి తీసుకువచ్చారు; ఆయన నాయందు ఆనందించారు కాబట్టి నన్ను విడిపించారు.

  13. దావీదు కీర్తన యెహోవా నా కాపరి, నాకు ఏ కొరత లేదు.

  14. పచ్చిక ఉన్నచోట ఆయన నన్ను పడుకోనిస్తారు. ప్రశాంత జలాల ప్రక్కన ఆయన నన్ను నడిపిస్తారు.

  15. ఆయన నా ప్రాణానికి సేదదీరుస్తారు. ఆయన తన నామం కోసం నీతి మార్గాల్లో నన్ను నడిపిస్తారు.

  16. మృత్యు నీడలా ఉన్న లోయలో నేను నడిచినా, ఏ కీడుకు భయపడను, ఎందుకంటే మీరు నాతో ఉన్నారు; మీ దండం మీ చేతికర్ర నన్ను ఆదరిస్తాయి.

  17. నా శత్రువులు ఉన్న చోటనే మీరు నాకు బల్ల సిద్ధం చేస్తారు. నూనెతో నా తల అభిషేకించారు; నా పాత్ర నిండి పొర్లుతుంది.

  18. నిశ్చయంగా నా జీవితకాలమంతా మీ మంచితనం మీ మారని ప్రేమ నావెంటే ఉంటాయి. నేను నిరంతరం యెహోవా మందిరంలో నివసిస్తాను.

  19. దావీదు కీర్తన. భూమి, దానిలో ఉండే సమస్తం, లోకం, దానిలో నివసించేవారు యెహోవా సొత్తు.

  20. ఆయన సముద్రంపై భూమికి పునాది వేశారు. జలాల మీద ఆయన దాన్ని స్థాపించారు.

  21. యెహోవా పర్వతాన్ని అధిరోహించగల వారెవరు? ఆయన పవిత్ర స్థలంలో నిలువగలవారెవరు?

  22. ఎవరి చేతులు నిర్దోషమైనవో ఎవరి హృదయం శుద్ధమైనదో, ఎవరు విగ్రహాల మీద నమ్మిక ఉంచరో, ఎవరు మోసపూరితంగా ప్రమాణాలు చేయరో, వారే కదా!

  23. వారు యెహోవా నుండి దీవెన పొందుతారు వారి రక్షకుడైన దేవునిచే నీతిమంతులుగా తీర్చబడతారు.

  24. ఆయనను వెదికే తరం ఇదే, యాకోబు దేవా, మీ ముఖకాంతిని వెదకేవారు అలాంటివారే. సెలా

  25. గుమ్మాల్లారా! మీ తలలు పైకెత్తండి; మహిమగల రాజు ప్రవేశించేలా పురాతన ద్వారాల్లారా! పైకి లేవండి.