కంటెంట్‌కు వెళ్లండి

Select Readings గురించి బైబిల్ వచనాలు

802 వచనాలు · 47 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఈ మహిమగల రాజు ఎవరు? శక్తిమంతుడు బలశాలియైన యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా.

  2. గుమ్మాల్లారా! మీ తలలు పైకెత్తండి; మహిమగల రాజు ప్రవేశించేలా పురాతన ద్వారాల్లారా! పైకి లేవండి.

  3. ఈ మహిమగల రాజు ఎవరు? సైన్యాలకు అధిపతియైన యెహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు. సెలా

  4. దావీదు కీర్తన. దేవ కుమారులారా, యెహోవాకు ఆపాదించండి, మహిమను బలాన్ని యెహోవాకు ఆపాదించండి.

  5. యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకే ఆపాదించండి; ఆయన పరిశుద్ధ వైభవాన్ని బట్టి యెహోవాను ఆరాధించండి.

  6. యెహోవా స్వరం సముద్రం మీద ప్రతిధ్వనిస్తుంది; మహిమగల దేవుడు ఉరుముతారు మహాజలాల మీద యెహోవా స్వరం ప్రతిధ్వనిస్తోంది.

  7. యెహోవా స్వరం శక్తివంతమైనది; యెహోవా స్వరం ఘనమైనది.

  8. యెహోవా స్వరానికి దేవదారు చెట్లు విరిగి పడిపోతాయి; లెబానోను దేవదారు చెట్లను యెహోవా ముక్కలుగా చేస్తారు.

  9. ఆయన లెబానోను పర్యతాలను దూడలా, షిర్యోనును అడవి దూడలా చెంగున గంతులు వేసేలా చేస్తారు.

  10. యెహోవా స్వరం అగ్ని జ్వాలలను పుట్టిస్తుంది;

  11. యెహోవా స్వరం ఎడారిని వణికిస్తుంది. యెహోవా కాదేషు అరణ్యాన్ని కదిలిస్తారు.

  12. యెహోవా స్వరం లేళ్లను ఈనజేస్తుంది అడవిలోని ఆకులు రాలిపోయేలా చేస్తుంది. ఆయన ఆలయంలోని సమస్తం ఆయనకే, “మహిమ” అంటున్నాయి.

  13. యెహోవా ప్రళయజలాల మీద ఆసీనులయ్యారు; ఆయనే నిరంతరం రాజుగా పరిపాలిస్తున్నారు.

  14. యెహోవా తన ప్రజలకు బలాన్ని దయచేస్తారు; యెహోవా సమాధానంతో తన ప్రజలను ఆశీర్వదిస్తారు.

  15. సంగీత దర్శకునికి. అలామోతు రాగంలో కోరహు కుమారుల గీతము. దేవుడు మనకు ఆశ్రయం బలం, ఇబ్బందిలో ఎప్పుడు ఉండే సహాయం

  16. కాబట్టి భూమి మార్పుచెందినా, నడిసముద్రంలో పర్వతాలు మునిగినా, మేము భయపడము.

  17. జలాలు గర్జించినా నురుగు కట్టినా పర్వతాలు వాటి పెరుగుదలతో కదిలినా మేము భయపడము. సెలా

  18. అది ఒక నది. దాని శాఖలు దేవుని పట్టణాన్ని సంతోషపెడతాయి, అది మహోన్నతుడు నివసించే పరిశుద్ధస్థలము.

  19. అందులో దేవుడున్నారు, అది కూలదు; తెల్లవారగానే దేవుడు దానికి సహాయం చేస్తారు.

  20. దేశాలు గందరగోళంలో ఉన్నాయి, రాజ్యాలు కూలిపోతాయి; దేవుని స్వరం ఉరుముతుంది, భూమి కరుగుతుంది.

  21. సైన్యాల యెహోవా మనతో ఉన్నారు; యాకోబు దేవుడు మనకు కోట. సెలా

  22. రండి యెహోవా చేసిన క్రియలను చూడండి, లోకంలో నాశనాన్ని ఆయన ఎలా తెస్తారో చూడండి.

  23. ఆ కొన నుండి ఈ కొనదాకా భూమి మీద యుద్ధాలు జరగకుండా ఆయనే ఆపివేస్తారు. విల్లును విరుస్తారు, ఈటెను ముక్కలు చేస్తారు; రథాలను అగ్నితో కాల్చేస్తారు.

  24. “ఊరకుండండి, నేనే దేవున్ని అని తెలుసుకోండి; దేశాల్లో నేను హెచ్చింపబడతాను, భూమి మీద నేను హెచ్చింపబడతాను.”

  25. సైన్యాల యెహోవా మనతో ఉన్నారు; యాకోబు దేవుడు మనకు కోట. సెలా