- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Select Readings గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
అప్పుడు యూదా అతని దగ్గరకు వెళ్లి అన్నాడు: “నా ప్రభువా, మీ దాసుని క్షమించి నా ప్రభువుతో ఒక్క మాట మాట్లాడనివ్వండి. మీరు ఫరోతో సమానులైనను మీ దాసునిపై కోప్పడకండి.
నా ప్రభువు తమ దాసులను, ‘మీకు తండ్రి గాని సోదరుడు గాని ఉన్నాడా?’ అని అడిగారు.
దానికి మేము, ‘నా ప్రభువా, మాకు వృద్ధుడైన తండ్రి, వృద్ధాప్యంలో తనకు పుట్టిన చిన్నకుమారుడు ఉన్నాడు. అతని అన్న చనిపోయాడు, అతని తల్లి కుమారులలో ఆ ఒక్కడే మిగిలాడు, అతని తండ్రికి ఆ చిన్నవాడంటే చాలా ప్రేమ’ అని చెప్పాము.
“అప్పుడు మీరు మీ దాసులతో, ‘అతన్ని నేను చూడాలి, నా దగ్గరకు తీసుకురండి’ అని అన్నారు.
అందుకు మేము నా ప్రభువుతో, ‘అతడు తండ్రిని విడిచి ఉండలేడు; ఒకవేళ అతడు విడిచిపెట్టి వస్తే, అతని తండ్రి చనిపోతాడు’ అని చెప్పాము.
కాని మీరు మీ దాసులతో, ‘మీ చిన్న తమ్ముడు మీతో వస్తేనే తప్ప మీరు నాకు కనబడవద్దు’ అని అన్నారు.
మేము మా తండ్రి దగ్గరకు వెళ్లి మా ప్రభువు చెప్పిందంతా చెప్పాము.
“మా తండ్రి, ‘ఇంకొంచెం ఆహారం కొనడానికి మళ్ళీ వెళ్లండి’ అన్నాడు.
అందుకు మేము అతనితో, ‘మేము వెళ్లలేము. మా చిన్న తమ్ముడు మాతో వెళ్తేనే మేము వెళ్తాము. మా చిన్న తమ్ముడు మాతో ఉంటేనే తప్ప మేము వెళ్లి ఆయన ముఖం చూడలేం’ అని చెప్పాము.
“మీ దాసుడైన మా తండ్రి మాతో, ‘నా భార్య నాకు ఇద్దరు కుమారులను కన్నదని మీకు తెలుసు.
వారిలో ఒకడు వెళ్లి తిరిగి రాలేదు. నిస్సందేహంగా అతన్ని ఏదో అడవి జంతువు చంపి ముక్కలు చేసి ఉంటుంది. అప్పటినుండి అతన్ని నేను చూడలేదు.
మీరు నా దగ్గర నుండి వీన్ని కూడా తీసుకెళ్తే, వీనికి ఏదైన హాని సంభవిస్తే, దుఃఖిస్తూ ఉన్న, తల నెరసిన ఈ వ్యక్తిని సమాధికి పంపిన వారవుతారు’ అన్నాడు.
“కాబట్టి ఇప్పుడు మా తమ్ముడు మాతో లేకుండ, మీ దాసుడైన మా తండ్రి దగ్గరకు మేము తిరిగి వెళ్తే, ఈ చిన్నవానితో ముడిపడి ఉన్న మా తండ్రి,
మాతో చిన్నవాడు లేకపోవడం చూసి, అతడు చనిపోతాడు. మీ దాసులమైన మేము తల నెరిసిన మా తండ్రిని దుఃఖంలోనే సమాధికి తీసుకెళ్లిన వారమవుతాము.
మీ దాసుడనైన నేను బాలుని భద్రతకు నా తండ్రికి హామీ ఇచ్చాను. ‘నేను అతన్ని తీసుకురాకపోతే, నా జీవితాంతం ఆ నిందను నేను భరిస్తాను’ అని చెప్పాను.
“కాబట్టి ఇప్పుడు, ఈ చిన్నవానికి బదులు నా ప్రభువు యొక్క దాసుని మీ దగ్గర బానిసగా ఉండనివ్వండి, ఈ చిన్నవాన్ని మాత్రం తన సోదరులతో తిరిగి వెళ్లనివ్వండి.
చిన్నవాడు నాతో లేకుండ నా తండ్రి దగ్గరకు ఎలా తిరిగి వెళ్లగలను? లేదు! నా తండ్రికి కలిగే బాధను నేను చూడలేను.”
అప్పుడు యోసేపు తన సేవకులందరి ఎదుట తనను తాను అదుపు చేసుకోలేక, “అందరిని నా ఎదుట నుండి పంపివేయండి!” అని బిగ్గరగా చెప్పాడు. తన సోదరులకు తనను తాను తెలియపరచుకున్నప్పుడు యోసేపుతో ఎవరు లేరు.
అతడు ఈజిప్టువారు వినేటంతగా బిగ్గరగా ఏడ్చాడు, ఫరో ఇంటివారు దాని గురించి విన్నారు.
యోసేపు తన సోదరులతో, “నేను యోసేపును! నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా?” అని అన్నాడు. అతన్ని చూసి అతని సోదరులు కంగారుపడి అతనికి జవాబు ఇవ్వలేకపోయారు.
యోసేపు తన సోదరులతో, “నా దగ్గరకు రండి” అన్నాడు. వారు అతని దగ్గరకు వచ్చాక, “నేను మీ సోదరుడైన యోసేపును, మీరు ఈజిప్టుకు అమ్మివేసినవాన్ని!
ఇప్పుడు నన్ను ఇక్కడకు అమ్మివేసినందుకు బాధపడకండి, మీపై మీరు కోప్పడకండి, ఎందుకంటే జీవితాలను రక్షించడానికి మీకంటే ముందే దేవుడు నన్ను పంపించారు.
ఇప్పటికి దేశంలో కరువు వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది, ఇంకా వచ్చే అయిదు సంవత్సరాలు దున్నడం, కోత కోయడం ఉండదు.
అయితే దేవుడు భూమిపై మిమ్మల్ని సంరక్షించి, మీ జీవితాలను కాపాడడానికి మీకంటే ముందు నన్ను ఇక్కడకు పంపించారు.
“కాబట్టి ఇప్పుడు, నన్ను ఇక్కడకు పంపింది మీరు కాదు, దేవుడే. ఆయన నన్ను ఫరోకు తండ్రిగా, అతని ఇంటికి ప్రభువుగా, ఈజిప్టు అంతటికి పాలకునిగా చేశారు.