కంటెంట్‌కు వెళ్లండి

Select Readings గురించి బైబిల్ వచనాలు

802 వచనాలు · 47 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆకాశంలో ఆసీనులై ఉన్న ప్రభువు నవ్వుతున్నారు; ఆయన వారిని చూసి ఎగతాళి చేస్తున్నారు.

  2. ఆయన కోపంతో వారిని గద్దించి తన తీవ్రమైన ఉగ్రతతో వారిని భయకంపితులను చేసి ఇలా అన్నారు,

  3. “నా పవిత్ర పర్వతమైన సీయోనును నా రాజు ఏలుతున్నారు.”

  4. నేను యెహోవా శాసనాన్ని ప్రకటిస్తాను: ఆయన నాతో ఇలా అన్నారు, “నీవు నా కుమారుడవు; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను.

  5. నన్ను అడిగితే, నేను దేశాలను నీకు స్వాస్థ్యంగా, భూమి అంచుల వరకు ఆస్తిగా ఇస్తాను.

  6. ఇనుపదండంతో నీవు వారిని నలగ్గొడతావు; పగిలిన కుండలా వారిని ముక్కలుగా చేస్తావు.”

  7. కాబట్టి, రాజులారా, తెలివిగా ఉండండి; భూమిని పాలించేవారలారా, మిమ్మల్ని సరిచేసుకోండి.

  8. యెహోవాను భయంతో సేవించండి వణుకుతూ ఆనందించండి.

  9. ఆయన కుమారున్ని ముద్దాడండి, లేకపోతే ఆయన కోపం ఒక క్షణంలో రగులుకుంటుంది. మీ మార్గం మీ నాశనానికి నడిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఉగ్రత క్షణంలో రగులుకుంటుంది. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు.

  10. సంగీత దర్శకునికి. గిత్తీతు రాగములో పాడదగినది. దావీదు కీర్తన. యెహోవా, మా ప్రభువా, భూలోకమంతట మీ నామం ఎంతో ప్రభావవంతమైనది! మీరు ఆకాశాల్లో మీ మహిమను ఉంచారు.

  11. చిన్నపిల్లల చంటిబిడ్డల స్తుతుల ద్వారా, మీ శత్రువుల పగవారి నోరు మూయించడానికి మీ శత్రువులకు వ్యతిరేకంగా మీరు బలమైన కోటను స్థాపించారు.

  12. మీ చేతి పనియైన మీ ఆకాశాలను, మీరు వాటి వాటి స్థానాల్లో ఉంచిన చంద్ర నక్షత్రాలను నేను చూసినప్పుడు,

  13. మీరు మానవులను జ్ఞాపకం చేసుకోడానికి వారు ఏపాటివారు? మీరు నరపుత్రుని గురించి శ్రద్ధ చూపడానికి అతడు ఎంతటివాడు?

  14. మీరు వారిని దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశారు, మహిమ ఘనతను వారికి కిరీటంగా పెట్టారు.

  15. మీ చేతిపనుల మీద వారికి అధికారం ఇచ్చారు; మీరు సమస్తాన్ని అనగా:

  16. గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి జంతువులను, ఆకాశ పక్షులను, సముద్రంలో చేపలను, సముద్ర మార్గంలో తిరిగే ప్రాణులను వారి పాదాల క్రింద ఉంచారు.

  17. The fowl of the air, and the fish of the sea, and whatsoever passeth through the paths of the seas.

  18. యెహోవా, మా ప్రభువా, భూమి అంతట మీ నామం ఎంతో ఘనమైనది!

  19. సంగీత దర్శకునికి. యెహోవా దావీదును శత్రువులందరి చేతి నుండి సౌలు చేతి నుండి విడిపించినప్పుడు అతడు పాడిన పాట. యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. యెహోవా నా బలమా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.

  20. యెహోవా నా కొండ, నా కోట నా విమోచకుడు; నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ, నా డాలు నా రక్షణ కొమ్ము, నా బలమైన కోట.

  21. స్తుతికి యోగ్యుడైన యెహోవాకు నేను మొరపెట్టాను, నా శత్రువుల నుండి నేను రక్షించబడ్డాను.

  22. మరణపు ఉచ్చులు నన్ను చుట్టుకున్నాయి; దుష్టులు వరదలా పొంగి నన్ను ముంచెత్తుతారు.

  23. సమాధి ఉచ్చులు నన్ను చుట్టుకున్నాయి; మరణపు ఉచ్చులు నన్ను బంధించాయి.

  24. నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను; సహాయం కోసం నా దేవున్ని వేడుకున్నాను. తన మందిరంలో నుండి ఆయన నా స్వరం విన్నారు; నా మొర ఆయన సన్నిధికి, ఆయన చెవులకు చేరింది.

  25. భూమి కంపించి అదిరింది, పర్వతాల పునాదులు కదిలాయి; ఆయన కోపానికి అవి వణికాయి.