Skip to content

Select Readings గురించి బైబిల్ వచనాలు

802 వచనాలు · 47 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అందుకు ఆమె జవాబిస్తూ, “సజీవుడు, మీ దేవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేస్తున్నాను, నా దగ్గర రొట్టె ఒక్కటి కూడా లేదు, కేవలం జాడీలో పిడికెడు పిండి, కూజలో కొంచెం నూనె ఉన్నాయి. నేను కొన్ని కట్టెలు ఏరుకుని ఇంటికి వెళ్లి నాకు నా కుమారునికి చివరి వంట చేసుకుని, తిని చనిపోతాము” అని అన్నది.

  2. ఏలీయా ఆమెతో, “భయపడకు. ఇంటికి వెళ్లి నేను నీకు చెప్పినట్లు చేయు. మొదట నా కోసం చిన్న రొట్టె చేసి తీసుకురా, తర్వాత నీకు, నీ కుమారునికి చేసుకో.

  3. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘దేశం మీద యెహోవా వర్షం కురిపించే వరకు, ఆ జాడీలో పిండి తగ్గిపోదు, కూజలో నూనె అయిపోదు’ ” అని చెప్పాడు.

  4. ఆమె వెళ్లి ఏలీయా చెప్పినట్లు చేసింది. కాబట్టి ప్రతిరోజు ఏలీయాకు, ఆ స్త్రీకి, తన కుటుంబానికి ఆహారం ఉండేది.

  5. ఎందుకంటే ఏలీయా ద్వారా యెహోవా చెప్పిన మాట ప్రకారం జాడీలో పిండి తరిగిపోలేదు, కూజలో నూనె అయిపోలేదు.

  6. ఒక రోజు ప్రవక్తల బృందంలో ఒకని భార్య ఎలీషా దగ్గరకు వచ్చి, “మీ సేవకుడైన నా భర్త చనిపోయాడు, అతడు యెహోవా పట్ల భక్తి కలవాడని మీకు తెలుసు. అయితే ఇప్పుడు అతనికి అప్పిచ్చినవాడు నా ఇద్దరు కుమారులను బానిసలుగా తీసుకెళ్లడానికి వస్తున్నాడు” అని మొరపెట్టింది.

  7. ఎలీషా, “నేను నీకెలా సహాయం చేయాలి? నీ ఇంట్లో ఏముందో చెప్పు” అన్నాడు. “నీ సేవకురాలి దగ్గర ఒక చిన్న పాత్రలో కొంచెం ఒలీవనూనె తప్ప ఇంకేమి లేదు” అని ఆమె చెప్పింది.

  8. అప్పుడు ఎలీషా, “నీవు వెళ్లి, నీ పొరుగు వారందరి దగ్గర ఖాళీ పాత్రలను అడుగు. ఎన్ని దొరికితే అన్ని తెచ్చుకో.

  9. అప్పుడు నీవు, నీ కుమారులు ఇంట్లోకి వెళ్లి తలుపు మూసి ఆ పాత్రలన్నిట్లో నూనె పోసి నిండినవాటిని ప్రక్కన పెట్టండి” అని చెప్పాడు.

  10. ఆమె అతని దగ్గర నుండి వెళ్లి, తన కుమారులతో లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది. వారు ఆమె దగ్గరకు తెచ్చిన పాత్రలన్నిట్లో ఆమె నూనె పోస్తూ ఉంది.

  11. పాత్రలన్నీ నిండినప్పుడు ఆమె తన కుమారునితో, “ఇంకొకటి తీసుకురా” అన్నది. అతడు, “ఇంకొక పాత్ర లేదు” అని జవాబిచ్చాడు. అప్పుడు నూనె ప్రవాహం ఆగిపోయింది.

  12. ఆమె వెళ్లి దైవజనునికి చెప్పగా అతడు, “వెళ్లు, ఆ నూనె అమ్మి, నీ అప్పు తీర్చుకో. మిగిలిన దానితో నీవు, నీ కుమారులు జీవనం కొనసాగించండి” అన్నాడు.

  13. అరాము రాజు సైన్యాధిపతి నయమాను. అతడు తన యజమాని దృష్టిలో గొప్పవాడు, గౌరవనీయుడు, ఎందుకంటే యెహోవా అతని చేత అరామీయులకు విజయం ప్రసాదించారు. అతడు మహాశూరుడు, కానీ కుష్ఠురోగి.

  14. అరామీయులు గుంపులు గుంపులుగా ఇశ్రాయేలు మీదికి దోపిడికి వెళ్లేవారు, ఒకసారి వారు ఒక చిన్నదాన్ని బందీగా తీసుకువచ్చారు, ఆమె నయమాను భార్యకు పరిచారం చేసేది.

  15. ఆమె తన యజమానురాలితో, “నా యజమాని సమరయలో ఉన్న ప్రవక్తను కలిస్తే బాగుండేది! ఆయన అతని కుష్ఠురోగాన్ని పూర్తిగా నయం చేస్తాడు” అని చెప్పింది.

  16. నయమాను తన యజమాని దగ్గరకు వెళ్లి, ఆ ఇశ్రాయేలు అమ్మాయి చెప్పిన మాటలు అతనికి చెప్పాడు.

  17. అందుకు అరాము రాజు, “సరే వెళ్లు, నేను ఇశ్రాయేలు రాజుకు ఉత్తరం పంపిస్తాను” అన్నాడు. కాబట్టి నయమాను తనతో పది తలాంతుల వెండి, ఆరువేల షెకెళ్ళ బంగారం, పది జతల దుస్తులు తీసుకుని వెళ్లాడు.

  18. అతడు ఇశ్రాయేలు రాజు దగ్గరకు తీసుకెళ్లిన ఉత్తరంలో ఇలా వ్రాసి ఉంది: “ఈ ఉత్తరంతో పాటు నా సేవకుడైన నయమానును నీ దగ్గరకు పంపిస్తున్నాను, అతనికి ఉన్న కుష్ఠును మీరు బాగుచేయాలని కోరుతున్నాను.”

  19. ఇశ్రాయేలు రాజు ఆ ఉత్తరం చదవగానే తన బట్టలు చింపుకొని, “చంపడానికి బ్రతికించడానికి నేనేమైనా దేవుడనా? కుష్ఠును బాగుచేయాలని ఇతడు ఒక వ్యక్తిని నా దగ్గరకు ఎందుకు పంపాడు? ఇతడు నాతో ఎలా వాదం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడో చూడండి!” అన్నాడు.

  20. దైవజనుడైన ఎలీషా, ఇశ్రాయేలు రాజు తన బట్టలు చించుకొన్నాడని విన్నప్పుడు, ఈ సందేశం అతనికి పంపాడు: “నీ బట్టలు ఎందుకు చించుకొన్నావు? ఆ వ్యక్తిని ఇప్పుడు నా దగ్గరకు పంపు, ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని అతడు తెలుసుకుంటాడు.”

  21. కాబట్టి నయమాను తన గుర్రాలతో, రథాలతో వెళ్లి ఎలీషా ఇంటి గుమ్మం దగ్గర ఆగాడు.

  22. ఎలీషా, “నీవు వెళ్లి, యొర్దానులో ఏడుసార్లు స్నానం చేయి; అప్పుడు నీ శరీరం మామూలుగా మారి నీవు శుద్ధుడవవుతావు” అని అతనికి చెప్పమని ఒక దూతను పంపాడు.

  23. అయితే నయమాను కోపంతో వెళ్లి, “అతడు తప్పకుండా నా కోసం బయటకు వచ్చి, నిలబడి, అతని దేవుడైన యెహోవా పేరిట ప్రార్థనచేసి, తన చేయి రోగం ఉన్నచోట అల్లాడించి కుష్ఠును నయం చేస్తాడనుకున్నాను.

  24. ఇశ్రాయేలు నీళ్ల కంటే దమస్కులో ఉన్న అబానా, ఫర్పరు నదుల నీళ్లు మంచివి కావా? నేను వాటిలో కడుక్కుని పవిత్రపరచబడనా?” అని అంటూ ఆగ్రహంతో వెనుకకు తిరిగి వెళ్లాడు.

  25. నయమాను సేవకులు అతని దగ్గరకు వెళ్లి, “నా తండ్రి, ఒకవేళ ఆ ప్రవక్త మిమ్మల్ని ఏదైనా గొప్ప పని చేయమని చెప్తే మీరు చేయకుండా ఉంటారా? ‘స్నానం చేసి పవిత్రపరచబడండి!’ అన్నమాట దానికంటే ఇంకా మంచిది కదా!” అని అన్నాడు.