కంటెంట్‌కు వెళ్లండి

Quotations and Allusions గురించి బైబిల్ వచనాలు

636 వచనాలు · 252 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారు ధారాళంగా బహుమానాలను పేదలకు పంచిపెట్టారు, వారి నీతి నిరంతరం నిలిచి ఉంటుంది; వారి కొమ్ము ఘనత పొంది హెచ్చింపబడుతుంది.

  2. “నేను చాలా బాధింపబడ్డాను” అని నేను చెప్పినప్పుడు, నేను యెహోవాపై నమ్మకం ఉంచాను;

  3. సమస్త దేశాల్లారా, యెహోవాను స్తుతించండి; సర్వజనులారా, ఆయనను కీర్తించండి.

  4. యెహోవా నా పక్షాన ఉన్నారు; నేను భయపడను. నరమాత్రులు నన్నేమి చేయగలరు?

  5. ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది;

  6. ఇది యెహోవా చేశారు, ఇది మా కళ్లకు ఆశ్చర్యంగా ఉంది.

  7. యెహోవా పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక! యెహోవా మందిరం నుండి మేము మిమ్మల్ని దీవిస్తాము.

  8. కారణం లేకుండ అధికారులు నన్ను హింసిస్తున్నారు, అయినా నా హృదయం మీ వాక్కుకు వణికిపోతుంది.

  9. వారు పాము నాలుకలా వారి నాలుకను పదును చేసుకుంటారు; వారి పెదవుల క్రింద సర్పాల విషం ఉంది. సెలా

  10. నా కుమారుడా, యెహోవా క్రమశిక్షణను తృణీకరించవద్దు ఆయన గద్దింపును అసహ్యించుకోవద్దు.

  11. ఎందుకంటే తండ్రి తన కుమారునిలో ఆనందించునట్లు, యెహోవా తాను ప్రేమించేవారిని క్రమశిక్షణలో ఉంచుతారు.

  12. ఎగతాళి చేసేవారిని ఆయన ఎగతాళి చేస్తారు కాని దీనులకు అణగారిన వారికి దయ చూపిస్తారు.

  13. నీ శత్రువు ఆకలితో ఉంటే, తినడానికి భోజనము పెట్టు; అతడు దాహంతో ఉంటే, త్రాగడానికి నీళ్లు ఇవ్వు.

  14. ఇలా చేయడం ద్వారా అతని తలపై మండుతున్న నిప్పులు కుప్పగా పోస్తావు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిస్తారు.

  15. తన మూర్ఖత్వాన్ని మరల కనుపరచు బుద్ధిహీనుడు తను కక్కిన దానికి తిరిగిన కుక్క వంటివాడు.

  16. సైన్యాల యెహోవా కొద్దిమందిని ప్రాణాలతో మనకు మిగల్చకపోయుంటే, మనం సొదొమలా మారేవారం, గొమొర్రాను పోలి ఉండేవారము.

  17. అందుకు ఆయన, “నీవు వెళ్లి ఈ ప్రజలతో ఇలా చెప్పు: “ ‘మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు, కాని అర్థం చేసుకోరు; ఎప్పుడు చూస్తూనే ఉంటారు, కాని గ్రహించరు.’

  18. వారి హృదయాలను కఠినపరచు; వారి చెవులకు చెవుడు వారి కళ్లకు గుడ్డితనం కలిగించు లేదంటే వారు తమ కళ్లతో చూసి, చెవులతో విని, హృదయాలతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందుతారు.”

  19. కాబట్టి, ప్రభువే స్వయంగా మీకు ఒక సూచన ఇస్తారు: ఇదిగో ఒక కన్య గర్భం ధరించి ఒక కుమారుని కని, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు.

  20. “ఈ ప్రజలు కుట్ర అని చెప్పే ప్రతిదాన్ని కుట్ర అనకండి. వారు భయపడే దానికి భయపడకండి. దానికి బెదిరిపోకండి.

  21. సైన్యాల యెహోవాయే పరిశుద్ధుడని మీరు గుర్తించాలి, ఆయనకే మీరు భయపడాలి, ఆయనకే మీరు భయపడాలి.

  22. ఆయన పరిశుద్ధ స్థలంగా ఉంటారు; అయితే ఆయన ఇశ్రాయేలుకు, యూదాకు ప్రజలను తడబడేలా చేసే రాయిలా వారిని పడిపోయేలా చేసే బండలా ఉంటారు. ఆయన యెరూషలేము ప్రజలకు బోనుగా, ఉచ్చుగా ఉంటారు.

  23. యాకోబు వారసుల నుండి తన ముఖాన్ని దాస్తున్న యెహోవా కోసం నేను ఎదురుచూస్తాను. ఆయనపై నా నమ్మకాన్ని ఉంచుతాను.

  24. ఇదిగో నేను, యెహోవా నాకిచ్చిన పిల్లలు, సీయోను కొండమీద నివసించే సైన్యాల యెహోవా వలన సూచనలుగా, గుర్తులుగా ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.

  25. అయినప్పటికీ బాధలో ఉన్నవారికి ఇక చీకటి ఉండదు. పూర్వకాలంలో ఆయన జెబూలూను, నఫ్తాలి ప్రాంతాలను అవమానపరిచారు కాని రాబోయే కాలంలో ఆయన సముద్ర ప్రాంతాన్ని అనగా యొర్దానుకు అవతలనున్న సముద్రతీరంలో యూదేతరులు ఉండే గలిలయ ప్రాంతాన్ని ఘనపరుస్తారు.