కంటెంట్‌కు వెళ్లండి

Holy Land గురించి బైబిల్ వచనాలు

108 వచనాలు · 37 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సరిహద్దు షెఫాము నుండి ఆయినుకు తూర్పు వైపు రిబ్లా వరకు వెళ్లి కిన్నెరెతు సరస్సు తూర్పున ఉన్న వాలుల వెంట కొనసాగుతుంది.

  2. తర్వాత ఆ సరిహద్దు యొర్దాను గుండా వెళ్తూ మృత సముద్రం వరకు వ్యాపిస్తుంది.

  3. యెహోవా మోషేతో అన్నారు,

  4. “మీకు భూమిని స్వాస్థ్యంగా కేటాయించే పురుషుల పేర్లు ఇవి: యాజకుడైన ఎలియాజరు నూను కుమారుడైన యెహోషువ.

  5. భూకేటాయింపు కోసం సహాయపడడానికి ప్రతి గోత్రం నుండి ఒక నాయకున్ని నియమించు.

  6. “వారి పేర్లు ఇవి: “యూదా గోత్రం నుండి, యెఫున్నె కుమారుడైన కాలేబు;

  7. షిమ్యోను గోత్రం నుండి అమీహూదు కుమారుడైన షెమూయేలు;

  8. బెన్యామీను గోత్రం నుండి కిస్లోను కుమారుడైన ఎలీదాదు;

  9. దాను గోత్రం నుండి యొగ్లీ కుమారుడైన బుక్కీ నాయకుడు;

  10. యోసేపు కుమారుడైన మనష్షే గోత్రం నుండి ఏఫోదు కుమారుడైన హన్నీయేలు నాయకుడు;

  11. ఎఫ్రాయిం గోత్రం నుండి షిఫ్తాను కుమారుడైన కెమూయేలు నాయకుడు;

  12. జెబూలూను గోత్రం నుండి పర్నాకు కుమారుడైన ఎలీషాపాను నాయకుడు;

  13. ఇశ్శాఖారు గోత్రం నుండి అజ్జాను కుమారుడైన పల్తీయేలు నాయకుడు;

  14. ఆషేరు గోత్రం నుండి షెలోమి కుమారుడైన అహీహూదు నాయకుడు;

  15. నఫ్తాలి గోత్రం నుండి అమీహూదు కుమారుడైన పెదహేలు నాయకుడు.”

  16. కనాను దేశంలో ఇశ్రాయేలీయులకు వారసత్వ భూమిని కేటాయించడానికి యెహోవా ఈ పురుషులను నియమించారు.

  17. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని మంచి దేశంలోకి తీసుకెళ్తారు; అది నదులు నీటిప్రవాహాలు లోయల నుండి కొండల నుండి ఉబికే లోతైన నీటి ఊటలు ఉండే దేశం;

  18. అంతేకాదు గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూర చెట్లు దానిమ్మపండ్లు ఒలీవనూనె తేనె దొరికే దేశం;

  19. ఆ దేశంలో రొట్టెలకు కొరత ఉండదు మీకు ఏది తక్కువకాదు; ఇనుప రాళ్లు గల దేశం, దాని కొండల్లో మీరు రాగి త్రవ్వితీయవచ్చు.

  20. మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం మీరు విడిచి వచ్చిన ఈజిప్టు దేశం వంటిది కాదు; అక్కడ మీరు విత్తనాలు విత్తి కూరతోటలలో చేసినట్లు వాటికి కాళ్లతో నీరు పెట్టారు.

  21. మీరు యొర్దాను దాటి వెళ్లి స్వాధీనం చేసుకోబోయే దేశం ఆకాశపు వర్షాన్ని త్రాగే పర్వతాలు లోయలు ఉన్న దేశము.

  22. అది మీ దేవుడైన యెహోవా సంరక్షించే దేశము; సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ దేవుడైన యెహోవా దృష్టి దాని మీద నిలిచి ఉంటుంది.

  23. మీరు పాటించాలని నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలను మీరు జాగ్రతగా పాటిస్తే అనగా మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయనను అంటిపెట్టుకుని ఉండాలి.

  24. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ జనాంగాలన్నిటిని వెళ్లగొడతారు. మీకంటే విస్తారమైన, బలమైన దేశాలను మీరు వెళ్లగొడతారు.

  25. మీరు అడుగుపెట్టే ప్రతి చోటు మీదే అవుతుంది: ఎడారి నుండి లెబానోను వరకు, యూఫ్రటీసు నది నుండి మధ్యధరా సముద్రం వరకు మీ సరిహద్దులు వ్యాపిస్తాయి.